ఇప్పుడు ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడే కనిపిస్తోంది. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు ఇచ్చే క్రిస్మస్ (Christmas) పార్టీలకు వెళ్లాల్సి ఉంటుంది. మరి దానికి ఎలా సిద్ధమవ్వాలి? మేకప్ ఎలా ఉంటే బాగుంటుంది? అందుకే మేం మీకోసం కొంతమంది సెలబ్రిటీల స్టయిల్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. వాటిని మీరు కూడా ఫాలో అయి అందరిలోనూ ప్రత్యేకంగా మెరిసిపోండి.
2018.. ఫ్యాషన్ ప్రియులకు ఈ ఏడాది ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సెలబ్రిటీలు ధరించిన దుస్తులు, వేసుకొన్న మేకప్ అసలు మరిచిపోయేలా ఉన్నాయా? అప్పుడప్పుడూ మనం కూడా అలాంటి మేకప్ వేసుకొంటే బాగుంటుదనిపిస్తుంది కదా..! ఈ ఏడాది తమ మేకప్ మెరుపులతో మనల్ని మురిపించిన బాలీవుడ్ సెలబ్రిటీల గురించి మీకోసం.
1. కరీనా కపూర్ ఖాన్
మేకప్ విషయంలో ప్రయోగాలు చేయడంలో కరీనాకి సాటి మరెవరూ రారంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా ఆమె ఐ మేకప్ అందరినీ ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇక్కడ చూడండి. బ్రౌన్ ఐ లైనర్, స్మోకీ ఐ మేకప్‌తో కరీనా ఎంత అందంగా కనిపిస్తోందో..!
Image Courtesy: Kareena Kapoor Khan Instagram నుంచి.
2. సోనమ్ కపూర్
బాలీవుడ్‌లో స్టయిలిస్ట్ సెలబ్రిటీ ఎవరంటే సోనమ్ కపూర్ అనే చెప్పుకోవాలి. తన ఫ్యాషనబుల్ లుక్స్‌తో అందరి చూపులనూ తనవైపు తిప్పేసుకొంటుంది ఈ సుందరి. ముఖ్యంగా ఆమె ఉపయోగించే వివిధ రంగుల్లోని ఐషాడోలతో వేసే ఐ మేకప్ ఆకర్షించేలా ఉంటుంది. ఆ మధ్య లేతపచ్చని రంగులో ఉన్న ఐషాడోతో కనిపించిందీ ముద్దుగుమ్మ. ఈ చలికాలంలో ఇలాంటి మేకప్ మన నయనాల్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
Image Courtesy: Sonam Kapoor Ahuja Instagram నుంచి.
3. దిశా పటానీ
నయనాల సోయగాలను మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలంటే దిశాపటానీని ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ చూడండి.. లేత గులాబీ రంగులో ఉన్న ఐషాడో ఆమె సొగసుని మరింత పెంచి చూపిస్తోంది. ఈ తరహా ఐ మేకప్ వేసుకొనేటప్పుడు.. మీ మేకప్ తక్కువగా ఉండటం మంచిది.
Image Courtesy: Disha Patani Instagram నుంచి.
4. తాప్సీ పన్ను..
తక్కువ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపించాలంటే పంజాబీ భామ తాప్సీని అనుసరించాల్సిందే. ఐ లైనర్ ఉపయోగించకుండా.. ఆమె వేసుకొన్న స్మోకీ ఐ మేకప్ లుక్ చాలా కొత్తగా.. అందంగా కనిపిస్తోంది.
Image Courtesy: Devki B Instagram నుంచి.
5. ఇషా గుప్త
కనుబొమ్మలు సన్నగా ఉంటే బాగుంటుందని చాలామంది అమ్మాయిలు భావిస్తారు. కానీ వారికి భిన్నంగా ఈషాగుప్త మాత్రం సన్నని ఐబ్రోస్ కాకుండా బోల్డ్‌గా కనిపించే ‘Manbrows’ని తీర్చిదిద్దుకొంది. అంటే మందపాటి ఐబ్రోస్ అన్నమాట. గ్లిట్టరీ ఐ మేకప్ దానికి మరింత అందాన్ని జోడించింది. వీటికి తోడు చెంపలకు వేసిన హైలైటర్, న్యూడ్ మ్యాట్ లిప్ స్టిక్ వేసుకొంటే క్రిస్మస్ పార్టీలో స్టార్‌లా మెరిసిపోవాల్సిందే.
Image Courtesy: Esha Gupta Instagram నుంచి.
6. యామీ గౌతమ్
చమక్కుమనిపించే మెరుపులు, ఆకట్టుకొనే రంగుల మేళవింపుతో కూడిన ఐ మేకప్‌తో ఫెస్టివ్ మేకప్ లుక్‌లో మెరిసిపోవచ్చు. అచ్చం యామీ గౌతమ్‌లా. ఐ మేకప్ విషయంలో ముందుగా హైలైటర్ అప్లై చేసుకొని దానిపై మీకు నచ్చిన రంగులోని ఐషాడోను వేసుకోవాలి. ఒకే రంగు కాకుండా రెండు మూడు రంగుల కలబోతగా అయితే.. ఐ మేకప్ మరింత అందంగా కనిపిస్తుంది. ఈ తరహా మేకప్ వేసుకొన్నప్పుడు పెదవులకు లిప్ స్టిక్ వేసుకోకుండా.. లిప్ గ్లాస్(lip gloss) వేసుకొంటే సరిపోతుంది.
Image Courtesy: Yami Gautam Instagram నుంచి.
7. అదితి రావు హైదరీ
రాజసంగా కనిపించే ఈ భామ మేకప్ చాలా తక్కువగా వేసుకొంటూ ఉంటుంది. ఈ ఫొటోలో చూడండి.. తక్కువ మేకప్‌లోనే ఉన్నప్పటికీ.. ఎంత అందంగా మెరిసిపోతోందో. ఆమె వేసుకొన్న ఐ మేకప్ వల్లే అది సాధ్యమైంది. గ్లిట్టర్ ఐలైనర్‌తో మనం కూడా ఐ మేకప్ వేసుకొంటే.. క్రిస్మస్ పార్టీలో దేవకన్యలా మెరిసిపోవచ్చు.
Image Courtesy: Aditi Rao Hydari Instagram నుంచి.
8. ఐశ్వర్యారాయ్ బచ్చన్
చక్కటి మాట్ ఫినిషింగ్ లుక్‌ని మీరు కోరుకొంటున్నట్లయితే ఐశ్వర్యారాయ్‌ని ఫాలో అవ్వాల్సిందే. ఐషాడో, ఐలైనర్, ఎరుపు రంగులోని మాట్ లిప్ స్టిక్.. ఇవి మనకందించే క్లాసిక్ లుక్‌కి సాటి ఏమీ కాదు.
Image Courtesy: Aishwarya Rai Bachchan Instagram నుంచి.
9. రాధికా ఆప్టే
కోరల్ పింక్ రంగు లిప్ స్టిక్, కాస్త మందంగా తీర్చిదిద్దిన ఐలైనర్‌తో బోల్డ్ లుక్‌లో మెరిసిపోతోంది రాధికా ఆప్టే. క్రిస్మస్ పార్టీలో చమక్కులా మెరిసిపోవాలంటే.. ఇలా మేకప్ వేసుకోండి.
Image Courtesy: Radhika Apte Instagram నుంచి.
10. డయానా పెంటి
క్రిస్మస్ లంచ్ పార్టీకి తగినట్లుగా సిద్ధమవ్వాలంటే.. ఓ సారి బ్రాంజ్ మేకప్ లుక్‌లో మెరిసిపోతున్న డయానా పెంటిని ఒకసారి చూడండి. బ్రాంజర్ లేదా హైలైటర్‌ని మేకప్ కోసం ఉపయోగించాలి. అలాగే పెదవులకు న్యూడ్ కలర్ లిప్ గ్లాస్ అప్లై చేసుకొంటే.. చాలా బాగుంటుంది.
Image Courtesy: Diana Penty Instagram నుంచి.
ఇవి కూడా చదవండి
క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నసెలబ్రిటీపై వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి
క్రిస్మస్ సందర్భంగా ధరించాల్సిన 10 అమేజింగ్ ఔట్ ఫిట్స్ గురించి వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి
క్రిస్మస్ గిఫ్ట్ ఐడియాల గురించి వ్యాసాన్ని ఆంగ్లంలో చదివేయండి