బిగ్‌బాస్ తెలుగు ( Bigg Boss Telugu) “సీజన్ 3″లో మూడవ వారం చివరికి వచ్చేసాం. ఇక ఈరోజు జరగబోయే ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున వచ్చి ఏం చెబుతారన్నది ఒక ఇంట్రెస్ట్ ఎలిమెంట్. కాగా.. నామినేషన్స్‌లో ఉన్నవారిలో సేఫ్ జోన్‌లో ఎవరు ఉన్నారు? అలాగే ఇంటి నుండి ఈ వారం బయటకి వెళ్లేది ఎవరన్నది కూడా ఈ రోజు తెలిసిపోతుంది..
బిగ్‌బాస్ తెలుగు : రవికృష్ణ చేతి గాయం.. శ్రీముఖి పాలిట శాపం!
ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌లో చాలానే విశేషాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులెవ్వరికి తెలియకుండా.. ఇంటిలోనే ఒక ప్రత్యేకమైన ప్లేస్‌లో ఉండేందుకు పునర్నవి, అలీలకు అవకాశం కల్పించారు. తర్వాత వారికి ఒక టాస్క్ ఇచ్చారు. వారు ఆ టాస్క్‌ని విజయవంతంగా పూర్తి చేయడంతో.. వారికి ఇమ్యూనిటీ లభించింది. దాని వల్ల ఈ ఇరువురు వచ్చే వారం నామినేషన్స్ నుండి సేఫ్ అయ్యారు.
ఇదిలావుండగా పునర్నవి, అలీలు ఇంటిలోకి తిరిగిరావడానికి.. బిగ్ బాస్ కోరినట్టుగానే ఇంటి సభ్యులంతా తమ ఫుట్‌వేర్, ఫుడ్, బెడ్స్‌ని త్యాగం చేశారు. ఆ తరువాత పునర్నవి, అలీలతో మాట్లాడుతూ.. “ఇంటిలోని సభ్యులలో ఓ నలుగురి గురించి మీకు నచ్చని విషయాలు చెప్పమని బిగ్‌బాస్ కోరగా”.. శ్రీముఖి, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్‌ల గురించి పునర్నవి తన ఆలోచనలను పంచుకుంది.
అలాగే అలీ విషయానికి వస్తే.. తను తమన్నా సింహాద్రి, మహేష్ విట్టా, వితికల గురించి చెప్పడం జరిగింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే, పునర్నవి, అలీలు ఇంటి సభ్యుల గురించి తమకు నచ్చని విషయాల గురించి చెబుతున్నప్పుడు.. మిగతా సభ్యులకి వాటిని ప్లాస్మాలో చూపించారు.
ఆ తరువాత ప్రత్యేక గది కర్టెన్స్‌ని తీశారు. ఈ క్రమంలో పునర్నవి, అలీలు ఉన్న గదిని బిగ్‌బాస్ కోర్ట్ యార్డ్‌గా పేర్కొని.. దానిని ఇంటి సభ్యులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇంటి సభ్యుల్లో అదృశ్యమైన ఇద్దరు కూడా.. మళ్ళీ తిరిగి రావడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. అయినా వారిని మళ్లీ బిగ్‌బాస్ టెన్షన్ పెట్టాడు.
బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?
ఆ టెన్షన్‌కి మరో పేరే ఇంటి సభ్యులకి ఆయన విధించిన శిక్ష. ఈ శిక్షలో భాగంగా.. ఇంటి కెప్టెన్ వరుణ్ సందేశ్.. ఇంట్లో ప్రాధమిక నియమాలని కూడా పాటించలేదని తెలియజేస్తూ.. తనను కెప్టెన్సీ నుండి తొలగించారు. అలాగే తనను ఇంట్లో అందరికీ సేవకుడిగా మారమని సూచించారు.
అలాగే స్మోకింగ్ ఏరియాలోకి.. ఒకే సమయంలో వెళ్లిన వ్యక్తులకు కూడా శిక్ష విధించారు. ఆ శిక్షను పొందిన వారిలో బాబా భాస్కర్, అలీ, మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖిలు ఉన్నారు. ఈ శిక్ష ప్రకారం వారు.. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన డ్రమ్స్‌లో ఉన్న వాటర్ లెవల్‌ని తగ్గకుండా చూడాలి. అయితే ఆ డ్రమ్స్‌కి రంధ్రాలు ఉండడంతో.. ఆ రంధ్రాలను.. ఈ అయిదుగురు తమ చేతి వేళ్ళతో మూసి.. నీటిని ఆపాలన్నది శిక్ష.
ఇక రోహిణి, హిమజ, వితిక, తమన్నా, అశు రెడ్డిలు తమ మైక్‌ని సరిగ్గా ధరించని కారణంగా.. శిక్షను పొందారు. వారు బిగ్‌బాస్ నుండి ఏదైనా ప్రకటన వచ్చిన ప్రతిసారి.. స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాలి. దీనితో ఈ అయిదుగురు దాదాపు 5 నుండి 10 సార్లు స్విమ్మింగ్ పూల్‌లోకి దూకడం జరిగింది.
ఇలాంటి శిక్షలు విధించడం ద్వారా.. ఇంటి సభ్యులు బిగ్‌బాస్ నియమాలని ఉల్లంఘిస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయన్నది చూపించడం జరిగింది.
ఆఖరుగా చెప్పేదేమిటంటే… ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న రాహుల్ సిప్లిగంజ్, తమన్నా సింహాద్రి, వితిక, పునర్నవి, బాబా భాస్కర్‌లలో ఎవరు సేఫ్ జోన్‌లో ఉంటారనేది.. ఈ రోజు ఎపిసోడ్‌లో నాగార్జున తేటతెల్లం చేస్తారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla