ADVERTISEMENT
home / Bigg Boss
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మొదటి ఎపిసోడ్ రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మొదటి ఎపిసోడ్ రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?

ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (Bigg Boss Telugu 3) ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా ఈ సీజన్ చాలా కలర్ ఫుల్‌గా మొదలైంది. గత కొంతకాలంగా ఈ సీజన్ బిగ్ బాస్‌లోకి వెళుతున్న కంటెస్టెంట్స్ అంటూ.. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పేర్లలో ఎక్కువశాతం నిజంగానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

వారు ఎవరనగా –

* సావిత్రి అక్క – శివ జ్యోతి

* రాహుల్ సిప్లిగంజ్ – ర్యాపర్ & సింగర్

ADVERTISEMENT

* టీవీ 9 జాఫర్ – జర్నలిస్ట్

* హేమ – సినీ నటి

* మహేష్ విట్టా – సినీ యాక్టర్

* శ్రీముఖి – యాంకర్ & యాక్టర్

ADVERTISEMENT

* వరుణ్ సందేశ్ & వితికా షేరు – భార్యాభర్తలు & సినీ యాక్టర్లు

పైన చెప్పిన పేర్లన్ని మనకి పరిచయమున్నవే. వారికి జనసామాన్యంలో కూడా మంచి పాపులారిటీ ఉంది. దీనితో వీరిలో ఎవరో ఒకరు టైటిల్ గెలుస్తారన్న బెట్టింగ్స్ మొదలయ్యాయి. ఇక ఈ ఎనిమిది మంది కాకుండా.. మిగతా ఏడుగురు కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇప్పుడు చూద్దాం….

* రవికృష్ణ – టీవీ ఆర్టిస్ట్

* అశు రెడ్డి – సోషల్ మీడియా సెలబ్రిటీ

ADVERTISEMENT

* హిమజ – సినీనటి & సీరియల్ నటి

* రోహిణి – సీరియల్ నటి

* బాబా భాస్కర్ – కొరియోగ్రాఫర్

* పునర్నవి భూపాళం – సినీ నటి

ADVERTISEMENT

* అలీ రజా – టీవీ ఆర్టిస్ట్

15 మంది కంటెస్టెంట్స్ ఎవరో అన్నది తెలుసుకున్నాక, ఈ సీజన్‌ ప్రత్యేకతలు గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. 

ఫన్నీ ఫ్రెండ్‌షిప్ విషెస్ కోసం క్లిక్ చేయండి

సీజన్ ప్రత్యేకతలు – 

ADVERTISEMENT

* మలినా – నాగార్జున పర్సనల్ అసిస్టెంట్.

* హౌస్‌లోకి వెళ్లిన మొదటి ముగ్గురు కంటెస్టెంట్స్.. మిగితా 12 మందిని ప్రశ్నలు అడిగించడం.

* ‘మన’ టీవీ

* కొరియోగ్రాఫర్ ‘బాబా భాస్కర్’

ADVERTISEMENT

* కంటెస్టెంట్స్‌గా భార్యాభర్తలు రావడం

మొత్తంగా కంటెస్టెంట్స్ గురించి ఒక్కసారిగా గమనిస్తే, ఎక్కువగా టీవీ ఆర్టిస్టులు, జర్నలిస్టులు, యాంకర్లు ఉన్నారు. ముఖ్యంగా టీవీ వీక్షకులని టార్గెట్ చేస్తూ ఈ సీజన్  ప్లాన్ చేసినట్టుగా అర్ధమవుతుంది. అయితే అందరూ ఊహించినట్టుగానే.. పైన చెప్పిన 8 మందిలోనే కాకుండా.. కింద చెప్పిన ఏడుగురిలో కూడా ఒకరు టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.

“బిగ్ బాస్ 3” తెలుగు రియాల్టీ షో.. కంటెస్టంట్స్ వీరేనా..?

అయినా 100 రోజులు జరిగే ఈ సీజన్‌లో 15 మంది ఎలా ఉంటారు? వారి మధ్య ప్రవర్తన ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఎందుకంటే ఈ సారి కంటెస్టెంట్స్‌లో చాలా మంది మంచి ఎనర్జీ ఉన్న వారే. వారిని ఒకసారి గమనిస్తే.. దాదాపు అందరూ టైటిల్‌ని గెలిచే సత్తా ఉన్నవారిలాగే కనిపిస్తున్నారు.

ADVERTISEMENT

ఇక ఈ సీజన్ వ్యాఖ్యాత కింగ్ నాగార్జున గురించి చెప్పాలంటే, ఆయన యాంకరింగ్ స్టైల్ కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంది. బుల్లితెర పైన యాంకర్‌గా మంచి పేరే సంపాదించుకున్న నాగార్జున.. మరోసారి ఒక హిట్ షోని హోస్ట్ చేయడానికి వచ్చేసినట్టుగా స్పష్టమైతుంది.

ఏదేమైనా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి సంబంధించి తొలి ఎపిసోడ్ పూర్తయ్యాక మాత్రం.. ఈ సీజన్ మంచి ఆదరణనే దక్కించుకుంటుందన్న అంచనాలు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ బట్టి తెలుస్తుంది. అలాగే రాబోయే 99 రోజులు.. తెలుగు ప్రేక్షకులకి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మంచి కిక్ ఇస్తుందన్న దాంట్లో మాత్రం ఏ మాత్రం సందేహం లేదు.

“బిగ్‌బాస్ తెలుగు”కి కోర్టు చిక్కులు తొలుగుతాయా? అసలు ఈ సీజన్ ప్రారంభమవుతుందా?

21 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT