Entertainment

‘చెన్నై’లో క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్‌గా.. అందరిని ఆకర్షిస్తున్న ‘ఇళయరాజా’ కేక్

Sandeep Thatla  |  Dec 23, 2019
‘చెన్నై’లో క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్‌గా.. అందరిని ఆకర్షిస్తున్న ‘ఇళయరాజా’ కేక్

Chennai food lovers to get Christmas, New Year Gift as Ilaiyaraaja Cake

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. ఇప్పటికే కేక్స్‌కి డిమాండ్ బాగా పెరిగింది. ఈ తరుణంలో సాధారణ కేక్స్‌తో పాటు రకరకాల ఆకారాల్లో వివిధ రకాల ఫుడ్డింగ్స్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే కేకులను అమితంగా ఇష్టపడే వారు ఇటువంటి కస్టమైజ్డ్ కేక్స్ వైపే మొగ్గు చూపడం.. ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకునే.. వివిధ బేకరీ సంస్థలు తమ కేక్ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి.. కాస్త వైవిధ్యంగా ప్రయత్నించడం విశేషం.

హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం

ఇటీవలే చెన్నై నగరంలో ఒక బేకరీ సంస్థ ఇటువంటి ప్రయోగాన్నే చేయడం గమనార్హం. వీరు చేసిన ఓ వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

అవును.. ఓ బేకరి సంస్థ తమ కస్టమర్లను ఆకర్షించడానికి..  ఏకంగా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా  రూపంలో కేక్‌ను రూపొందించడం విశేషం.  వివరాల్లోకి వెళితే, చెన్నై కోడంబాకం ఏరియా రామనాథపురంలోని ఓ బేకరీలో..  ఇళయరాజా ఆకారంలో ఓ కేక్‌ను డిజైన్ చేశారు . ఈ కేక్ తయారీ కోసం.. వారు దాదాపు 250 కోడిగుడ్లను రెసిపీలో వినియోగించారు.

ఈ కేక్ బరువు సుమారు 50 కిలోలు కాగా.. పొడవు అయిదున్నర అడుగులు ఉంటుందని బేకరి నిర్వాహకులు తెలిపారు.

ఇక ఈ కేక్ తయారీలో కూడా వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. ముఖ్యంగా ఇళయరాజా ట్రేడ్ మార్క్ కుర్తా, తెల్లటి లుంగీతో పాటుగా.. ఆయన మెడలో నిత్యం కనిపించే రుద్రాక్షమాల కూడా ఆయన ఆకారంలో ఉండే కేక్‌‌లో మనకు కనిపిస్తుంది.

ఈ కేక్‌‌ను ప్రదర్శనకు ఉంచిన సందర్భంగా.. బేకరి నిర్వాహకులు  భారత ప్రభుత్వానికి ఓ విన్నపం కూడా చేశారు. తమ అభిమాన సంగీత దర్శకుడు ఇళయారాజా గారికి.. త్వరలోనే భారతరత్న ప్రకటించాలని కూడా పేర్కొన్నారు. 

ఇక చెప్పాల్సిందేమిటంటే.. సదరు బేకరీ  ప్రతి యేటా న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని.. ఏదో ఒక వైవిధ్యాన్ని కలిగిన కేక్‌ని తయారు చేసి.. దానిని తమ అమ్మకాలకు ప్రచారంగా వాడుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుందట. అలా ఈ ఏడాది కూడా వారు ఇళయరాజా రూపంలో తయారు చేసిన కేక్.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక తమిళనాట ఇళయరాజాకి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇళయరాజా ప్రతిమ రూపంలో కేక్ తయారు చేసి.. ఆయన అభిమానుల మనసులని.. ఈ బేకరీ వారు కూడా గెల్చుకున్నారు అని వేరే చెప్పక్కర్లేదు కదా..

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌‌కి వెళ్లాల్సిందే..!

క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని.. బేకరీ నిర్వాహకులు ఇటువంటి ఆసక్తికర ప్రమోషన్స్ ద్వారా తమ కేక్స్‌ని విక్రయించే పనిలో పడుతున్నారు. అందులో భాగంగానే.. ఇటువంటి క్రియేటివ్ కేక్స్ వస్తున్నాయని చాలామంది ఫుడ్ అనలిస్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అవును మరి… ఈరోజుల్లో మనం చేసే పని ఎంత క్రియేటివ్‌గా ఉంటే.. అంత ఎక్కువగా ప్రజలను ఆకర్షించవచ్చనేది వాస్తవం.

ఈ మధ్యకాలంలో ఈ క్రియేటివ్ కేక్స్ ఫీవర్.. హైదరాబాద్‌ని కూడా తాకినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కస్టమైజ్డ్ కేక్స్‌కి రెండు జంట నగరాల్లో ఆదరణ బాగా పెరిగింది. అలాగే కొంతమంది కస్టమర్లు తమకు.. ఎటువంటి కాన్సెప్ట్ కేక్ కావాలో  ముందుగానే చెప్పిమరీ తయారుచేయించుకోవడం విశేషం.

చివరిగా.. ఈరోజుల్లో ఫుడ్ లవర్స్ కూడా.. క్రియేటివ్ రెసిపీలకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారనే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!           

Source: Instagram.com/Vikatan                                                                   

Read More From Entertainment