
ఈ రోజు (15 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు వర్క్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాలను మీరు ప్రశ్నించుకోవడం మంచిదే కానీ మీపై మీరు నమ్మకం పెట్టుకోవడం అవసరం. వర్తమానంలో జరిగే విషయాలను గతంతో పోల్చుకొని బాధపడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ పాత స్నేహితులను కలుస్తారు. మీ లాంటి పని చేసే మరికొందరు వ్యక్తులను కలుస్తారు.
వృషభం (Tarus) – ఈ రోజు గతంలో మీరు చేసిన పనికి ఇప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి. ఒక డీల్ పూర్తి చేసినందుకు.. ఒక పెద్ద ఆఫర్ మీకు లభించినందుకు మీరు మీ టీమ్ సభ్యులు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఎంత ముఖ్యమైనదైనా సరే పనిని మాత్రం ఇంటికి తీసుకురాకండి. మీ కుటుంబ సభ్యులకు మీ అవసరం ఉంటుంది. స్నేహితులు కూడా వారికి మీ అవసరం ఉన్నప్పుడు మీరు వారితో లేకపోవడం గురించి బాధపడతారు.
మిథునం (Gemini) – ఈ రోజు మీరు పెండింగ్ లో ఉన్న మీటింగులు, ఇతర విషయాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాలను ఇప్పటివరకూ ఎంతో వాయిదా వేశారు. ఇక అలా చేయడం మానడం మంచిది. పెండింగ్ లో ఉన్న ఈమెయిల్స్, ఫోన్లు చేయడానికి కాస్త సమయం కేటాయించుకోండి. మిమ్మల్ని పని విషయంలో కొందరు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ అది మీకు మంచే చేస్తుంది. సాయంత్రాలు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు పూర్తిగా ఓ బ్యాలన్స్ డ్ డే.. పెండింగ్ విషయాలన్నింటి గురించి ఆలోచించి ఆ శక్తినంతా కూడగట్టి కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అయితే ఈ విషయంలో కొన్ని సలహాలు తీసుకోవడం, రీసర్చ్ అవసరం అవుతాయి. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో మీకు సాయపడతారు. మీ భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి.
సింహం (Leo) – ఈ రోజు మీ పని ఎక్కడికక్కడే ఆగిపోతుంది. అందుకే మీరు జీవితంలో తీసుకున్న నిర్ణయాల గురించి మీకు మీరే ప్రశ్నించుకుంటారు. మీ జీవితం ఎక్కడికి పోతోందని ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మీపై మీకు కోపం రావడంతో పాటు ఇతరుల పైన కూడా చిన్న విషయాలకే కోపం వస్తూ ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం, వారి ఆలోచనలను తెలుసుకోవడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా మారతారు.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య (Virgo) – ఈ రోజు మీ పని వేగం పుంజుకుంటుంది. మీరు చేసేందుకు తగినంత పని ఉంటుంది. అయితే మీ సందేహాల వల్ల మీ కొలీగ్స్ లో ఉన్న బంధంలో తేడాలు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. పని ఎక్కువ సమయం పాటు చేయాల్సి రావడం వల్ల కుటుంబంతో సమయం గడపలేరు. కుటుంబ సమస్యల వల్ల బయటకు వెళ్లి స్నేహితులతో గడపడం కూడా సాధ్యపడదు. మీ ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది.
తుల (Libra) – ఈ రోజు మీ పని నిశ్చలంగా సాగుతుంటుంది. మీ టీమ్ మెంబర్స్ తో సఖ్యత ఉండడం వల్ల అది వేగంగా పూర్తవుతుంది. కాస్త పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఈ రోజు మీ పనులను వాయిదా వేయకుండా కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కాస్త బాధపడుతుండడం వల్ల వారిని మీరు తిరిగి నవ్వించే ప్రయత్నం చేయాల్సి వస్తుంది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు పనిలో ముందు కంటే ఎక్కువ వేగంగా ఎక్కువ ఏకాగ్రతతో పనిచేస్తారు. అయితే మీ కడుపు, కళ్ల పై ఎక్కువ శ్రద్ధ వహించండి. మీ కుటుంబ సభ్యులు మీ సలహా, ఆర్థిక సహాయం కోసం మీ వద్దకు వస్తారు. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ పని ఆనందంగా సాగుతుంది. అయితే ఇతరుల ఆనందం కోసం మీరు కొన్ని నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఆఖరి నిమిషంలో మీటింగ్స్ ఏర్పాటవడం వల్ల ఎక్కువ సమయం పని చేయాల్సి రావచ్చు. కానీ దానివల్ల మంచి ఫలితాలుంటాయి. పని ఎక్కువగా ఉండడం వల్ల స్నేహితులు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. కుటుంబ సభ్యులు మీరు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని భావించే అవకాశం ఉంది కాబట్టి వారితో కాస్త ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. మీకు గతంలో తెలిసిన ఓ ఫ్రెండ్ పని సంబంధిత విషయం గురించి మిమ్మల్ని తిరిగి కలుస్తారు.
మకరం (Capricorn) – ఈ రోజు మీ పని ప్రదేశం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. పని బాగానే సాగుతున్నా.. మీ కొలీగ్స్ మీకు చిరాకు తెప్పిస్తారు. ఇబ్బందులను ఎక్కువ చేస్తారు. అయితే వారి నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసుకొని వారి అభిప్రాయాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్ల మీ పని ముందుకు సాగుతుంది. కోపం తెచ్చుకోవద్దు. సాయంత్రాలు మీ కుటుంబంతో సమయం గడుపుతారు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు మీ పని చాలా ఉదయాన్నే ప్రారంభమవుతుంది. మీటింగ్స్ వరుస పెట్టి ఉండడం వల్ల అలసిపోతారు. అయితే సాయంత్రానికి మీరే ఇంకా మీరు వెళ్లాల్సిన దారి ఎంతో ఉందని కొత్త పని కోసం చేయాల్సింది ఎంతో ఉందని భావిస్తారు. మీ టీం సభ్యులతో గొడవలు జరగొచ్చు. మీ బంధువులను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మీనం (Pisces) – ఈరోజు మీ పని చాలా నెమ్మదిగా సాగుతుంది. క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారు విమర్శలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రోజు నిరాశాజనకంగానే ఉంటుంది. అయితే నెమ్మదిగా అన్ని విషయాలు సర్దుకుంటాయి. అందుకే కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.