Astrology

2 అక్టోబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Oct 2, 2019
2 అక్టోబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (2 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు విద్యార్థులు చదువు విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించాలి. కొత్త ప్రాజెక్టులు చేపట్టే సమయంలో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. అలాగే ఆఫీసులో ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి సమయంలోనే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. అలాగే రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు.

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వివాహితులకు తమ భాగస్వామితో సంబంధాలు బలంగా మారతాయి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. అయితే రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయంలో.. జాగ్రత్తగా ఉండండి.  సృజనాత్మక, సినిమా మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ కుటుంబంతో ఆహ్లాదంగా.. ఆనందంగా గడుపుతారు. అలాగే సోదరులకు సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలను దగ్గరుండి పరిష్కరిస్తారు. అలాగే యువతకు తమ ప్రతిభను చూపించే అవకాశం లభిస్తుంది. మహిళలకు సామాజిక గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు వ్యాపారంలో ఖ్యాతి పెరుగుతుంది. అలాగే రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.  సినీ రంగంలో ప్రవేశించాలని భావించే వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం వల్ల ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండాలి.  విద్యార్థులకు తల్లిదండ్రులకు మద్దతు ఉంటుంది. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ కుటుంబంతో హాయిగా గడుపుతారు. అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి.  ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా వేగంగానే బయటపడతారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అయితే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొనే పద్ధతికి స్వస్తి పలకండి. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు బంధువుల నుండి ఒత్తిడి ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయమిది. ముఖ్యంగా అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించడం మంచిది. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి.  

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే.. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి. కొన్ని స్నేహాలను దూరం పెట్టాలి. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజు సులభ ధనయోగం ఉంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త వాహనాలను కొనే అవకాశం ఉంది. అలాగే ఆదాయ వనరులు పెరుగుతాయి. అదేవిధంగా కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అలాగే తమ శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది. 

మకరం (Capricorn) – ఈ రోజు అవివాహితులు శుభవార్తలు వింటారు. అలాగే కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా  కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆఫీసులో ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.  విద్యార్థులు కొంచెం కష్టపడితే.. మంచి ఫలితాలను పొందడం అసాధ్యమేమీ కాదు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) – ఈ రోజు  విద్యార్థులు చదువు విషయంలో.. అజాగ్రత్తగా ఉండకపోవడం మంచిది. లేదంటే ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. అలాగే మొబైల్ పనిచేయకపోవడం లేదా విద్యుత్ అంతరాయం లాంటి సమస్యలు మిమ్మల్ని ఈ రోజు వేధించవచ్చు. అదేవిధంగా స్నేహితులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది.  అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం బెటర్. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా లాభసాటిగా గడుస్తుంది. వివాహితులకు భాగస్వామితో విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు క్రీడలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది.   ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించండి. అలాగే బాల్య మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Astrology