Astrology

20 ఆగస్టు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Aug 19, 2019
20 ఆగస్టు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 20, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కాస్త ఎనర్జిటిక్‌గా పని చేయాలి. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో కాస్త ఉత్సాహంగా పనిచేస్తే బెటర్. వివాహితులు పిల్లల విషయంలో ప్లానింగ్‌కు రెడీ అవ్వడానికి ఇదే మంచి రోజు. ఇక వ్యాపారస్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ కూడదు. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు లక్ ఫ్యాక్టర్ బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా వ్యాాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలని భావించే వారికి కూడా.. ఈ రోజు బాగా కలిసొస్తుంది. అలాగే విద్యార్థులకు సోషల్ వర్క్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఇక వివాహితులకు విదేశీ పర్యటన యోగం ఉంది. పాత స్నేహితులు కూడా మిమ్మల్ని ఈ రోజు కలిసే అవకాశం ఉంది. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఫ్యామిలీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహితులకు సంతాన భాగ్యం లభిస్తుంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు సంబంధించి మంచి వార్తలు వింటారు. అయితే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. పలువురు ముఖ్యమైన వ్యక్తులు ఈ రోజు మిమ్మల్ని కలుస్తారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు వ్యాపార రంగంలోని వ్యక్తులు కాస్త గందరగోళ పరిస్థితిని చవి చూస్తారు. ముఖ్యమైన పత్రాలు, డాక్యుమెంట్లను భద్రపరిచే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆఫీసులో ఆడిట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వివాహితులు తమ భాగస్వామితో తొలుత మనస్పర్థలు వచ్చినా.. సహనంగా వ్యవహరించండి.

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వారికి స్వల్ప ధనలాభం ఉంది. అలాగే వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు అవుతాయి. అలాగే కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అదే విధంగా పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. ఖరీదైన బహుమతులు లేదా కానుకలను మీరు పొందుతారు. వివాహితులు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త పనులు ప్రారంభించడానికి సరైన రోజు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయాలన్నా లేదా కొత్త ఇంటికి పనులు మొదలుపెట్టాలన్నా ఈ రోజు మంచిది. అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలకు అప్లై చేయడానికి కూడా ఈ రోజు అనువైనది. మహిళలు బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడానికి ఈ రోజు మంచిది. 

తుల (Libra) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైతే ఫ్యామిలీ మొత్తానికి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించండి. అలాగే ఈ రోజు ఈ రాశి వారు నిరాశావాదంలో కొట్టుమిట్టాడే అవకాశం ఉంది. కనుక సాధ్యమైనంత వరకూ ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడానికి ప్రయత్నించకండి. సహనంతో వ్యవహరించండి. కోపాన్ని నియంత్రించుకోండి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశివారికి కళ్యాణ ఘడియలు దగ్గరపడే అవకాశం ఉంది. వివాహానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలిగిపోతాయి. అలాగే ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు కూడా లభించే అవకాశముంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల్లో వారికి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు ఈ రాశివ్యక్తులకు విజయలక్ష్మి అండ పరిపూర్ఱంగా ఉంది. ఏ పని చేపట్టినా.. దానిని విజయవంతంగా ముగిస్తారు. అయితే దానికంటూ తమకున్న పరిధిలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. అస్సలు కష్టపడకుండా ఫలితం రావాలని భావించడం అవివేకం. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో సహనంతో వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకోవాలి. అలాగే ఈ రోజు మహిళలు, వివాహితులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చోర భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు కూడా ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో అప్రమత్తతంగా ఉండాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) –  ఈ రోజు ఈ రాశివ్యక్తులకు రక్తపోటు సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. వివాహితులకు కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే భాగస్వామితో మనస్పర్థలు కూడా దూరమవుతాయి. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.  

మీనం (Pisces) – ఈ రోజు మీ కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆఫీసులో కూడా అధికారులతో మీకు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. అలాగే విద్యార్థులకు కళలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా.. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Astrology