Astrology

21 సెప్టెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Sep 21, 2019
21 సెప్టెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (21 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు రాశి వ్యక్తులు బహుమతులు లేదా కానుకలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు కీలక ఒప్పందాలను చేసుకుంటారు. మహిళలు ఇంటి అలంకరణ లేదా ఇంటీరియర్ డిజైన్‌లకు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆలుమగల సంబంధాలు మరింత పటిష్టంగా మారతాయి.

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని విషయాలలో అజాగ్రత్తగా ఉండడం వల్ల.. మొదటికే మోసం వస్తుంది. అలాగే వ్యాపారస్తులు.. పలు ఒప్పందాలను రద్దు చేసుకుంటారు. ఉద్యోగస్తులు తమ కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. వివాహితులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యతను పాటించండి.

మిథునం (Gemini) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శారీరక రుగ్మతలకు గురయ్యే అవకాశముంది. అలాగే అల్పమైన విషయాలను.. అతిగా చెప్పడం మానుకోవాలి.  విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రచిస్తారు. అలాగే ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా విరివిగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీ కుటుంబ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మీ భాగస్వామితో సంబంధాలు పటిష్టంగా మారతాయి. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములను కలుస్తారు. సినిమా రంగంలో ప్రయత్నాలు చేసే వారికి.. ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. మహిళలకు ఆదాయం పెరుగుతుంది. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. 

సింహం (Leo) – ఈ రోజు విద్యార్థులు లేదా నిరుద్యోగులు తమ గమ్యాన్ని సాధించడంలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉంటాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు విజయం సిద్ధిస్తుంది. మీకు పలు సత్కారాలు కూడా జరిగే అవకాశం ఉంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రాశి వ్యక్తులు వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో.. నూటికి పది సార్లు ఆలోచించాలి. ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. విద్యార్థులు కెరీర్‌లో అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మరింత కష్టపడాలి. ప్రత్యర్థులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. అలాగే మీకు సమాజ సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ భాగస్వామితో సంబంధాలు బలంగా మారతాయి. ప్రేమికుల సమస్యలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడే అవకాశముంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు కుటుంబ సమస్యల వల్ల.. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.  అలాగే కోపాన్ని నియంత్రించుకోండి. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యతను పాటించండి. వ్యాపారస్తులు వాణిజ్య విస్తరణకు.. ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషిస్తారు.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు  కుటుంబ సమస్యలు.. మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. అయినా సరే ఆత్మస్థైర్యంతో ముందుకువెళ్లండి. ఆఫీసులో కూడా ఉద్యోగులు ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తారు. కొన్ని వివాదాలు, స్కాములను దగ్గరి నుండి చూస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు  నిజాయతీగా ఉన్నంత కాలం.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.  

మకరం (Capricorn) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే అవివాహితులు శుభవార్తలు వింటారు. స్థిరాస్తి రంగానికి చెందిన వ్యక్తులకు.. ఈ రోజు బాగా కలిసొస్తుంది. వ్యాపారస్తులు కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు.. తమ సన్నిహితులకు సంబంధించి అపోహలను తొలిగించుకోవడం మంచిది. లేకపోతే కొన్ని సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు చేసే బిజినెస్ పర్యటనలు విజయవంతమవుతాయి. అలాగే నిరుద్యోగులు.. చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడానికి మొగ్గుచూపిస్తారు. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏ మాత్రం అలసత్వం చూపించినా సరే.. చేతికందిన అవకాశాలు చేజారిపోతాయి. అలాగే వ్యాపారస్తులు మరింత కష్టపడాల్సి ఉంది. ప్రేమికులు తమ బంధంలో నిజాయతీ ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలి. ధన వ్యామోహం కొన్ని బంధాలను శాశ్వతంగా దూరం చేస్తుందని భావించాలి. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశి వ్యక్తులకు ఆసక్తి పెరుగుతుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Astrology