Astrology

28 అక్టోబరు 2019 (సోమ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Oct 27, 2019
28 అక్టోబరు 2019 (సోమ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (28 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీ పెద్దల నుంచి మీకు ఆశీర్వాదాలు అందుతాయి. వాటిని ఉపయోగించుకొని మీ బంధాలను మరింత బలపరుచుకోండి. ఇప్పటివరకు ముందుకు కదలని సమస్యలు కూడా తప్పకుండా పరిష్కారం దిశగా పయనిస్తాయి.

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల మీకు ఎంతో ప్రేమాభిమానాలు ఉండవచ్చు. ఒకవేళ వారితో మీకేమైనా భేదాభిప్రాయాలు ఉన్నా లేక తగాదాలు ఉన్నా వాటిని ఇప్పుడు పరిష్కరించుకోండి. వారు కూడా మీకు సహకరిస్తారు. 

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీలో కొందరు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుండవచ్చు. లేదా ఉద్యోగ భద్రత లేని కారణంగా బాధపడుతుండవచ్చు. కానీ మీ కోరికలను ఒక జాబితాగా రాసుకోండి. త్వరలో అవన్నీ తీరుతాయి.

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు ప్రస్తుతం మీ శారీరక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. అలాగే మీ మానసిక ఆరోగ్యం కూడా జాగ్రత్తగా సంరక్షించుకోండి. దేని గురించీ అతిగా ఆలోచించకండి.

సింహ రాశి  (Leo) – ఈ రోజు ఇప్పుడు మీకు ప్రేమ చాలా అవసరం. అలాగే కుటుంబ సభ్యుల సహాయం, సహకారం కూడా ముఖ్యమ. కాబట్టి ముందు మీరు వారి గురించి ఆలోచించండి. వారి మాటలు, ప్రేమ మీకు సంతోషాన్నిస్తాయి.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు బాగా సెన్సిటివ్ గా ఉన్న కారణంగానే ఇతరుల పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. అయితే ఇది హద్దుల్లో ఉంటేనే మంచిది. అతిగా సెన్సిటివ్ గా ఉన్నా మీకు మంచిది కాదని గ్రహించండి.

తుల రాశి (Libra) – ఈ రోజు మిమ్మల్ని ఏదో ఒక సమస్య బాగా ఇబ్బందిపెడుతోంది. దాని గురించి మీరు ఇతరులతో కూడా పంచుకోవట్లేదు. కాబట్టి మీ సమస్యను ఒక పేపర్ పై రాసి ఆ భగవంతుణ్ని సహాయం కోరుతున్నట్లు రాయండి. తప్పక ఫలితం కనిపిస్తుంది.

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీ మైండ్ లో ఏమనుకుంటే దానిని మీరు సాధించగలరు. మీ తెలివితేటలు, కష్టపడే తత్వం మీకు విజయాన్ని అందిస్తాయి. ప్రశంసలు అందేలా చేస్తాయి. మీరు ప్రేమించే వ్యక్తితో సమయం గడిపితే మరింత సంతోషంగా ఉంటారు.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) – ఈ రోజు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు పై నుంచి మీకు ఆశీర్వాదాలు పంపుతున్నారు. మీ చుట్టుపక్కల వారి ఉనికిని కూడా మీరు గమనించవచ్చు. వారు మీకు తప్పక సహకరిస్తారు.

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీ మనసుకు అయిన గాయాన్ని మీకు మీరుగా మాన్పుకోగలరు. అందుకు ఇతరులు అందించే ప్రేమ, అభిమానాలే మీకు శక్తిని అందిస్తాయి. అయితే మీరు ఒకసారి ప్రేమిస్తే వారి నుంచి ఏమీ ఆశించకూడదని గుర్తుంచుకోండి.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) –  ఈ రోజు మీ సమస్యలకు అనుకోకుండా మీకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు.. మీకు ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులను ఛాలెంజింగ్ గా తీసుకుని వాటి నుంచి బయటపడతారు. దేని గురించీ మీరు భయపడకండి.

మీన రాశి  (Pisces) – ఈ రోజు ఇంట్లో, పని ప్రదేశంలో.. ఎక్కడైనా సరే.. ఏ విషయం గురించైనా పాజిటివ్ గానే ఆలోచించండి. మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు వాటంతటవే మీ ముందుకు వస్తాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Astrology