
ఈ రోజు (జూలై 29) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు మీరు రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. వ్యాపారస్తులు కొందరు ముఖ్యమైన వ్యక్తులతో జరిపిన చర్చలు ఫలప్రదమవుతాయి. వివాహితులు కూడా ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగస్తుల సృజనాత్మక సామర్థ్యాలు పెరగవచ్చు. విద్యార్థులు కళలపై ఆసక్తిని పెంచుకుంటారు.
వృషభం (Tarus) – ఈ రోజు మీకు మీ కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సదావకాశం. వ్యాపారస్తులకు ప్రత్యర్థులతో సమస్యలు ఏర్పడతాయి. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి వారు ప్రయత్నించవచ్చు. అలాగే ఆస్తి లావాదేవీలు, చట్టపరమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి.
మిథునం (Gemini) – ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో మీరు స్నేహితుల మద్దతు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వృత్తి భాగస్వామ్యం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటే బెటర్. అలాగే ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశివారికి అన్నీ పనులు శుభప్రదంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. వివాహితులు తమ భాగస్వామితో కలిసి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు కూడా శుభవార్తలు వింటారు.
మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!
సింహం (Leo) – ఈ రోజు మీ కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు రావచ్చు. అయినా సహనంతో వ్యవహరించండి. వ్యక్తిగత జీవితంలో మార్పులు సంభవిస్తాయి. అలాగే ఆఫీసులో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మకత రంగంలోని వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది.
కన్య (Virgo) – ఈ రోజు యువత బద్ధకాన్ని, సోమరితనాన్ని వీడాలి. వాటివల్ల మీరు మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే కోపాన్ని నియంత్రించుకోండి. వ్యాపారస్తులు కూడా ఆదాయ-వ్యయంలో సమతుల్యతను పాటించాలి. ఉద్యోగులు సకాలంలో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ప్రేమికులు నిరాశావాదాన్ని వీడితే మంచిది.
తుల (Libra) – ఈ రోజు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. అలాగే వివాహితులు తమ భాగస్వామి నుండి బహుమతులు పొందే అవకాశం ఉంది. ఓ లక్ష్యం కోసం ఎప్పటినుంచో పోరాడుతున్న మీరు.. ఈ రోజు ఆ గమ్యాన్ని చేరే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి.. మంచి విషయాలు వింటారు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఉద్యోగస్తులు ఆఫీసులో ప్రత్యర్థుల నుండి పలు సవాళ్లు ఎదుర్కొంటారు. అలాగే విద్యార్థులు నిర్లక్ష్య ధోరణిని వీడాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యం చేరుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. రాజకీయ రంగంలోని వ్యక్తులు పార్టీలు మారే అవకాశం ఉంది. వివాహితులు తమ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు అధికంగా శ్రమించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు క్రమశిక్షణ పాటించకపోతే.. కొన్ని చిక్కుల్లో పడతారు. వివాహితులు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. దినచర్యలో సూర్య నమస్కారాలను లేదా యోగాను భాగం చేసుకోవడాన్ని.. ఈ రోజు నుండి ప్రారంభిస్తే మంచిది. అలాగే ఉద్యోగస్తులు ఈ రోజు ఆఫీసులో సహోద్యోగుల మద్దతు పొందవచ్చు.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు. వివాహితులు తమ భాగస్వామితో కలిసి రొమాంటిక్ యాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో.. సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కళలు, సైన్స్ లేదా కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా బదిలీలు సంభవించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వ్యక్తులకు.. ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు లాంటి విషయాలలో వివేకంతో ఆలోచించండి.
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణాలు తీసుకొనే విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే అపరిచితులను ఇంట్లోకి రానివ్వకుండా ఉంటే మంచిది. బంగారం ధరించి బయటకు వెళ్లకుండా ఉంటే శ్రేయస్కరం. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటే మంచిది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.