Astrology

8 సెప్టెంబరు 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Sep 8, 2019
8 సెప్టెంబరు 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 8, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి.  వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో అప్రమత్తతతో ఉండాలి. వివాహితులు ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. నిరుద్యోగులకు నిరాశాజనకమైన ఫలితాలు ఎదురవుతాయి. అయినా.. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించండి.  

వృషభం (Tarus) –  ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలెర్జీలు, పలు శారీరక రుగ్మతలు మీ పిల్లలను వేధించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ట్రాఫిక్ సమస్య వల్ల.. కొన్ని అర్జెంట్ పనులు మిస్ అవుతారు. అలాగే ఆలుమగలు తమ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి.. కొన్ని విషయాలలో కలిసి ముందుకు వెళ్లాలి.  

మిథునం (Gemini) –  ఈ రోజు ప్రేమికులకు ఎంతో శుభదినం. తమ కష్టాలు అన్నీ తీరి.. సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయి. మీ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన రోజు. అలాగే ఆలుమగలు మనస్పర్థలను తొలిగించుకొని.. కొన్ని విషయాలలో ఈ రోజు రాజీకి వస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఈ రోజు కాస్త ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే పనులు చేస్తారు.  

కర్కాటకం (Cancer) –  ఈ రోజు యువత తాము కోరుకున్న లక్ష్యాలను చేరుకొనే దిశగా.. ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. వివాహితుల ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు తీసుకుంటారు. ఆలుమగలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది.  

సింహం (Leo) –  ఈ రోజు వ్యాపారస్తులకు అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆడిట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు కెరీర్‌కు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికులు ప్రతికూల ఆలోచనలను వీడి.. ఒకరి విషయంలో మరొకరు నిజాయతీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.  వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.  

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు తమకు సంబంధం లేని వివాదాలలో తలదూర్చకపోవడం శ్రేయస్కరం.  ఆలుమగలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు.. ఇంట్లో పెద్దలను సంప్రదించడం మంచిది. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త పథకాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలాగే కుటుంబంతో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని పార్టీలు, ఫంక్షన్లలో కూడా పాల్గొంటారు. ప్రేమికులు తమ స్నేహితుల నుండి సహాయాన్ని పొందుతారు. ఆలుమగలు కొన్ని విషయాలలో.. ఒకరి మీద ఒకరు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.   

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు నిర్లక్ష్యం కారణంగా.. కొన్ని మంచి అవకాశాలను పోగొట్టుకుంటారు. అలాగే మిమ్మల్ని అసందర్భంగా ప్రశంసించే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు మొదలైనవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. డబ్బు విపరీతంగా ఖర్చు అయినా.. మీ సమస్యలు మాత్రం ఎట్టకేలకు పరిష్కారమవుతాయి.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆస్తి పంపిణీ, వాటాల విభజన మొదలైన విషయాల గురించి కొందరు మిమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులన్నీ.. మళ్లీ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది.  

మకరం (Capricorn) – ఈ రోజు నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. తాము ఇష్టపడే కెరీర్‌లో అవకాశాలను సంపాదించుకోగలరు. వ్యాపారస్తులు కూడా పెద్ద కాంట్రాక్టులను పొందే అవకాశం ఉంది. వివాహితులకు సోదరులు, మిత్రులు, కుటుంబీకుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. ప్రేమికులు కొన్ని సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. తమకు తామే పరిష్కరించుకోవడం మంచిది.  

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సానుకూల ధోరణిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు కూడా తమకు నచ్చిన కెరీర్ వైపు అడుగులు వేస్తేనే.. విజయం సాధించగలరు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరింత కష్టపడాలి. ప్రేమికులు ఊహాజనితమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి.. కొన్ని విషయాలలో ప్రాక్టికల్‌గా ఆలోచించాలి.  

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మీ మంచితనంతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారస్తులు ఎంత సన్నిహితులైనా.. బయట వ్యక్తుల వద్ద బిజినెస్ సీక్రెట్స్ గురించి మాట్లాడవద్దు. ఆలుమగలు ఇంట్లో పిల్లల ఎదుట.. గొడవ పడే అలవాటుకి స్వస్తి పలకండి.  

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Astrology