Astrology

09 నవంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Nov 8, 2019
09 నవంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (09 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మిత్రులతో జరిగే చర్చలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉంది. మీ సృజనాత్మక సామర్థ్యం సైతం పెరుగుతుంది. విద్యార్థులు ఇంకాస్త కష్టపడాలి.

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు కలిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య సంబంధాల సంక్లిష్టంగా ఉంటాయి. వాణిజ్య రంగంలో ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చట్టపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండండి. ఆచితూచి వ్యవహరించండి.

మిథున రాశి  (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించండి. మీ స్నేహితుల మద్దతు మీకు కచ్చితంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలు కూడా అనుకూల ఫలితాలు చేకూరుస్తాయి. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీకు చాలా మంచి రోజు. కార్యాలయంలో ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో బయటి వ్యక్తుల నుండి ప్రయోజనాలు పొందుతారు. విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది. కొంచెం కష్టపడితే.. అనుకోని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీ భాగస్వామి నుండి శుభవార్తలు వింటారు.వ్యాపార పర్యటనలు లాభదాయకంగా సాగుతాయి. ఆలుమగలు కొన్ని విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నా.. ఆ సమస్యల నుండి వేగంగానే బయటపడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీ కుటుంబంలో  చిన్న చిన్న మనస్పర్థలు రావచ్చు. అయినా మనో ధైర్యంతో ముందుకు వెళ్లండి. అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దు. ఉద్యోగులకు ఆఫీసులో ప్రత్యర్థులతో సమన్వయం ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. 

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులు ఛాలెంజింగ్ టాస్క్‌లు టేకప్ చేస్తారు. ఆలుమగలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తమ సమస్యలను తాము మాత్రమే పరిష్కరించుకోవడం మంచిది. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సవాళ్లు ఎదుర్కోవచ్చు.  విద్యార్థులు సోమరితనాన్ని వీడాలి. వ్యాపారస్తుల జాగ్రత్తగా లేకపోతే ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రతికూల అనుభవాలను ఎదుర్కొంటారు. అధిక శ్రమ మరియు క్రమశిక్షణా రాహిత్యం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులో సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. విద్యార్థులు ఇంకాస్త కష్టపడాలి.

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే మీ భాగస్వామి నుండి అనుకోని బహుమతిని కూడా పొందుతారు. అలాగే సమాజ సేవ పట్ల కూడా మొగ్గు చూపిస్తారు. అలాగే మీకు ఆఫీసులో సహోద్యోగుల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) – ఈ రోజు యువతకు కొత్త ఉపాధి వనరులు లభిస్తాయి. అలాగే కొత్త పనులను నేర్చుకోవడంలో విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రమోషన్లు ఉన్నాయి. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు ఎలాంటి రుణాలు తీసుకోకుండా ఉండడం మంచిది. లేకపోతే అనుకోని చిక్కులలో పడతారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది.  అదేవిధంగా విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవడం మంచిది. విద్యార్థుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. 

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

Read More From Astrology