Astrology

ఆగస్టు 8, 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Aug 7, 2019
ఆగస్టు 8, 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 8, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొంత వరకు కోపానికి దూరంగా ఉండడం మంచిది. అలాగే ఏ సమస్యనైనా శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు.. తన కోణం నుండి కూడా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఉద్యోగులు కూడా పని ఒత్తిడిలో పడి ఇంటిని పట్టించుకోవడం మర్చిపోవద్దు.

వృషభం (Tarus) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. అలాగే ఉద్యోగులకు పని ఒత్తిడి వల్ల కూడా సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమయంలోనే ఆత్మస్థైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లండి. డాక్టరును కలిసి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి.  

మిథునం (Gemini) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త పనులను టేకప్ చేస్తారు. వ్యాపారస్తులు కొత్త భాగస్వాములతో కలిసి పెట్టుబడులు పెడతారు. స్టార్టప్స్ ప్రారంభించాలని భావించే వారికి.. ప్రణాళికలు రూపొందించడానికి ఇదే సరైన రోజు. ఉద్యోగస్తులు కూడా కొత్త వర్క్‌షాపుల్లో శిక్షణకు హాజరయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా కొత్త కోర్సులపై ఆసక్తి పెరగవచ్చు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ప్రేమికులకు బాగా కలిసొస్తుంది. తమ తల్లిదండ్రులకు తమ బంధం గురించి తెలియజేయడానికి ఇదే సరైన సమయం. అలాగే వివాహితులు ఈ రోజు తమ భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. అలాగే ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఈ రోజు సులభ ధన యోగం ఉంది. మీ లక్ ఫ్యాక్టర్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. విద్యార్థులకు కూడా ఈ రోజు చాలా అనువైనది. 

సింహం (Leo) – ఈ రోజు అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహితులు ఖర్చుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులు కూడా ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మే విషయంలో కాస్త జాగరూకతతో వ్యవహరించాలి. అప్పులు.. ఇవ్వడం లేదా తీసుకొనే విషయాలలో కూడా ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా బాండ్స్ మీద సంతకాలు చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు బాగా కలిసొస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రత్యమ్నాయ కెరీర్స్ వైపు ఆసక్తి పెంచుకొనే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా కొత్త కోర్సులపై ఆసక్తి పెరుగుతుంది. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల పంపకం లేదా ఇతర కీలక అగ్రిమెంట్లు తీసుకుంటారు. అలాగే కోర్టు కేసులు మొదలైనవి ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. విద్యార్థులకి ఇది ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం. వివాహితులకు తమ భాగస్వామితో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశముంది. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీరు ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబం కోసం కూడా కొంత సమయం కేటాయించండి. ముఖ్యంగా మీ భాగస్వామితో ఏర్పడిన మనస్పర్థలను తొలిగించుకోవడానికి ప్రయత్నించండి. మీ పిల్లల అలవాట్లపై కూడా ఓ కన్నేసి ఉంచండి. వ్యాపారస్తులు తమ బిజినెస్‌ను సమీక్షించుకోవాల్సిన సమయం ఇది. అలాగే ఉద్యోగస్తులు కాస్త రిలాక్స్‌గా పని చేయడానికి ప్రయత్నించండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ప్రేమికులకు బాగా కలిసొచ్చే రోజు. తమ బంధం గురించి పూర్తిగా ఒక క్లారిటీకి వచ్చే రోజు. ముఖ్యంగా ఇలాంటి విషయాలను ఇంట్లో చెప్పడానికి  కూడా ఈ రోజు ఎంతో అనువైనది. అలాగే వివాహితులు కూడా తమ సంసారిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రోజు ముందుకు వెళ్లచ్చు. అయితే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా .. మీ కుటుంబ సమస్యలను మీరే పరిష్కరించుకోవడం బెటర్. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు ఆర్థికంగా గడ్డు పరిస్థితి తలెత్తవచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ రంగంలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. స్టార్టప్స్ ప్రారంభించాలని భావించే వారికి కూడా.. కొంతవరకు చిన్న చిన్న లోపాలు కనిపిస్తాయి. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. ఆశావాదంతో మీరు అనుకున్న ప్రణాళికలను సిద్ధం చేయండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశివ్యక్తులంతా ఆత్మ విశ్వాసంతో పనిచేస్తారు.ముఖ్యంగా ఉద్యోగస్తులు తాము చేసిన పనులకు.. అధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపారస్తులు సరికొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. సినిమా, కళా రంగానికి చెందిన వ్యక్తులకు కూడా అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు భావోద్వేగాలకు గురవుతారు. బాగా సన్నిహితులైన మీ కుటుంబీకులు, స్నేహితుల ప్రవర్తన మీకు ఆందోళనను కలిగించవచ్చు. ఇలాంటి సమయంలోనే వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. సహనంతో ఉండాలి. ఏ సమస్యనైనా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికే యత్నించాలి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Astrology