
ఈ రోజు (ఆగస్టు 9, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు వ్యాపారస్తులకు లాభసాటిగా గడుస్తుంది. ముఖ్యంగా మొండి బాకీలు వసూలవుతాయి. సులభ ధనయోగం కూడా ఉంది. వివాహితులకు కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. కుటుంబీకుల నుండి కొన్ని కానుకలు కూడా అందుకుంటారు. అదేవిధంగా స్ఠిరాస్తులు కొనడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ రోజు చాలా మంచిది.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం ఇంకా మంచిది. అలాగే తల్లిదండ్రులు, మీ భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ చూపించండి. యోగా చేయడం లేదా జిమ్ చేయడం ఈ రోజు నుండే ప్రారంభించండి.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు కొంత వరకు మానసిక ఒత్తిడి ఉంటుంది. అయినా సరే.. ఆత్మస్థైర్యంతో ముందుకువెళ్లండి. ఉద్యోగస్తులు ఆఫీసులో వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. తమ పని తాము నిజాయతీగా చేసుకుంటూ వెళితే మంచిది. వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు, బోకర్లతో లావాదేవీలు జరిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు బాగా శారీరక శ్రమ చేస్తారు. అలాగే విపరీతమైన అలసటకు గురవుతారు. విద్యార్థులు క్రీడాపోటీలలో పాల్గొనే అవకాశం ఉంది. వివాహితులు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే ఈ రోజు ఈ రాశివారికి మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ నిజాయతే మీకు శ్రీరామరక్ష.
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యమైన ఒప్పందాలు చేసుకొనే అవకాశం కూడా ఉంది. అలాగే వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. క్రియేటీవ్ ఫీల్డ్‌లోని వ్యక్తులకు.. ఈ రోజు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి.
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే అవివాహితులకు.. తమ వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలిగిపోతాయి. వివాహితులు కూడా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ప్రేమికులకు తమ మనసులోని భావాలను.. కుటుంబీకులతో పంచుకోవడానికి ఇదే సరైన సమయం. పెద్దల్ని ఒప్పించడానికి కూడా ఇది అనువైన రోజు.
తుల (Libra) – ఈ రోజు రాశివ్యక్తులు అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. కనుక కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఆఫీసులో అధికారులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కనుక కోపాన్ని నియంత్రించుకోండి. మీ తప్పు లేనప్పుడు.. మీరు భయపడాల్సిన అవసరం లేదని నమ్మండి. ఎన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టిముట్టినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు రాశి వ్యక్తులకు అనుకోని అదృష్టం కలిసొస్తుంది. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే బాండ్స్ పై సంతకాలు పెట్టేటప్పుడు.. నూటికి పదిసార్లు ఆలోచించాలి. అలాగే వివాహితులు దూర ప్రయాణాలు చేస్తారు. తమ కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీకు దక్కే అదృష్టం మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. కనుక నిజాయతీగా మీ పని మీరు చేసుకొని వెళ్లండి. ఆఫీసులో కూడా మీ శ్రమకు తగిన ఫలితం కచ్చితంగా దొరుకుతుంది. వివాహితులు తమ భాగస్వామి విషయంలో శాంతంగా వ్యవహరించాలి. ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు.. ఎదుటి మనిషి వైపు నుండి కూడా ఆలోచించాలి.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు తమ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. వెంటనే డాక్టరును సంప్రదించాలి. అలాగే వ్యాపారస్తులు.. వాణిజ్య విస్తరణ, ప్లానింగ్, పెట్టుబడి మొదలైన విషయాలలో వివేకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వివాహితులు సాధ్యమైనంత వరకూ.. భాగస్వామితో భేదాలను వెంటనే క్లియర్ చేసుకుంటే మంచిది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎంతో సంతోషంతో ఉంటారు. అలాగే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులు కూడా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని.. తమ బిజినెస్‌ను విస్తరిస్తారు. అలాగే వివాహితులు పలు శుభవార్తలు వింటారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.
మీనం (Pisces) – ఈ రోజు మీరు తీసుకొనే నిర్ణయమే మీ భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది. కనుక ఏదైన కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాాపారస్తులు, ఉద్యోగులు తమ కెరీర్‌కు సంబంధించి.. వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. సినిమా, మార్కెటింగ్ రంగాల్లో వారికి అనుకోని అవకాశాలు తలుపు తడతాయి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.