
ఈ రోజు (సెప్టెంబరు 13, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజు మీరంతా బిజీగా గడుపుతారు. మీ సోదరులు లేదా స్నేహితుల సహాయాన్ని తీసుకుంటారు. మీ ప్రత్యర్థులు కూడా మీ స్నేహితులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు తమ అనుబంధాన్ని మరింత పరిపుష్టం చేసుకుంటారు. ఇంట్లో పెద్దలను ఒప్పిస్తారు.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పూర్తి ఉల్లాసంగా, ఉత్సాహంగా పని చేస్తారు. కుటుంబ సంబంధాలు కూడా బాగా మెరుగుపడతాయి. అలాగే మీరు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి పలు శుభవార్తలు వింటారు. ప్రేమికుల సమస్యలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సంతోషకరమైన వార్తలు వింటారు. అలాగే కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. ఇంటర్వ్యూలలో విజయం సాధించడం పెద్ద విషయం ఏమీ కాదు. విద్యార్థులకు ప్రత్యమ్నాయ కోర్సులు లేదా క్రీడల పై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుండి పిల్లలకు పూర్తి మద్దతు లభిస్తుంది.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రతికూల ఆలోచనలను వీడి.. సానుకూలంగా స్పందించాలి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి. కొన్ని విషయాలను లౌక్యంతో, సమయస్ఫూర్తితో డీల్ చేయాలి. వ్యాపార రంగంలో కొంత అస్థిరత ఉంటుంది. ఉద్యోగులు వివేకంతో వ్యవహరించాలి. లేదా మీరు చేసే పనులు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి.
సింహం (Leo) – ఈ రోజు మీరు కొత్త ప్రణాళికలు రచించే అవకాశం ఉంది. అలాగే మీకు అనుకోని బహుమతులు, కానుకలు లభిస్తాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వ్యక్తులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉంటాయి. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు కూడా లభించవచ్చు.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులను ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశముంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. ఆలుమగలు గొడవలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిది. అలాగే అవివాహితులు, నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
తుల (Libra) – ఈ రోజు ప్రేమికులకు శుభదినం. తమ సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే అవాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా తమ శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారస్తులు కొంత అస్థిరతను చవిచూసినా.. ఆఖరికి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు తమ గమ్యాన్ని తామే నిర్దేశించుకుంటారు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తీసుకొనే నిర్ణయానికి సన్నిహితుల మద్దతు ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆలుమగలు కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే ఏ పనిని ప్రారంభించినా.. దాన్ని తక్కువ సమయంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు కూడా తాము చేసే పనుల ద్వారా అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులు కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. అలాగే కోర్టు లావాదేవీలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోకుండా మోసాల బారిన పడే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. నిరుద్యోగులు కూడా ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఈ రాశి వ్యక్తులకు తమ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మంచి వార్తలను వింటారు. అలాగే కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. అలాగే సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. ఉద్యోగులకు కూడా తమ శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆలుమగల మధ్య సయోధ్య లేకపోవడంతో.. కొన్ని పనులు ఇరకాటంలో పడతాయి. అలాగే ప్రత్యర్థుల నుండి కూడా బహిరంగ సవాళ్లను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలోనే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.