Entertainment

దీపిక ప‌దుకొణే ‘ఛపాక్’ చిత్రం ఎందుకు చూడాలంటే ..?

Sandeep Thatla  |  Dec 10, 2019
దీపిక ప‌దుకొణే  ‘ఛపాక్’ చిత్రం ఎందుకు చూడాలంటే ..?

(Deepika Padukone “Chhapaak” Movie Trailer)

ప్రముఖ నటి దీపిక ప‌దుకొణే  తాజా చిత్రం ‘ఛపాక్’ ట్రైలర్  కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అందరూ ఊహించినట్టుగానే దీపిక ఈ చిత్రంలో యాసిడ్ బాధితురాలు లక్ష్మి పాత్రలో అద్భుతంగా అభినయించింది. ముఖ్యంగా యాసిడ్ బాధితురాలిగా కనిపించడానికి దీపిక ముఖం పై వాడిన ప్రొస్థెటిక్స్ కూడా చాలా సహజంగా ఉండడం గమనార్హం. దీంతో ఆమె ఈ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసిందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

లెజెండరీ విమెన్ క్రికెటర్ ‘మిథాలీ రాజ్’ బయోపిక్‌లో.. తాప్సీ పన్ను

ఇక దర్శకురాలు మేఘన గుల్జార్ కూడా.. ‘ఛపాక్ ‘ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  ట్రైలర్  చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్ధమవుతుంది. ఓ 15 ఏళ్ళ అమ్మాయి పై యాసిడ్ దాడి జరిగిన క్రమంలో..  ఆ ఘటన నుండి ఆ అమ్మాయి ఎలా బయటకి రాగలిగింది…? అలా బయటకి వచ్చాక సమాజంలో తన లాంటి యాసిడ్ బాధితుల సంక్షేమం కోసం ఎలా పాటుపడిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నో భావోద్వేగాలతో ఆమె ఈ చిత్రాన్ని తీశారనే విషయం మనకు స్పష్టమవుతోంది. 

ఈ ‘ఛపాక్’ ట్రైలర్‌ని కొద్దిసేపటి క్రితమే మీడియాకి విడుదల చేసిన తరుణంలో.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు దీపిక ప‌దుకొణే. ‘నా కెరీర్ మొత్తానికి ఈ చిత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.. లక్ష్మి పాత్ర చేయడం ఒక ఛాలెంజింగ్‌గా అనిపించింది” అని ఆమె తెలిపింది. ‘ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు అందించిన దర్శకురాలు మేఘన గుల్జార్‌కి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని కూడా ప్రకటించింది దీపిక. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారని తెలియగానే.. తాను వెంటనే ఈ ప్రాజెక్టుకి పచ్చా జెండా ఊపానని.. ఎన్నో భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రాన్ని తెరకెక్కించడం మామూలు విషయం కాదని ఆమె అభిప్రాయపడింది. 

 

అమెరికాలో అద్భుత యాత్ర : మన హైదరాబాదీ లేడీ బైకర్ ‘జయభారతి’ సాధించిన వినూత్న రికార్డ్

మరి మేఘన గుల్జార్ పై దీపిక ప‌దుకొణేకి ఇంతలా నమ్మకం కుదరడానికి కారణం ఆమె అంతకముందు తీసిన ‘రాజీ’ చిత్రం. అందులో ఆలియా భట్‌తో కథను నడిపించిన తీరు.. ఇండియా – పాకిస్తాన్ నేపథ్యంలో సాగే ఆ కథని తెరకెక్కించడంలో చూపిన సమర్ధతని బేరీజు వేసుకున్నాకే.. ఈ చిత్రంలో తనకు అవకాశం దక్కిందని చెప్పాలి. 

ఇక ‘ఛపాక్’ చిత్ర ప్రకటన గత ఏడాది డిసెంబర్‌లో జరగగా.. ఈ ఏడాది మార్చిలో  చిత్రీకరణను మొదలుపెట్టి జూన్ నెలలో ముగించడం జరిగింది. ఇటీవలే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. 

ఇక దీపిక ప‌దుకొణే  కూడా గత కొన్నాళ్లుగా.. నటనకు స్కోప్ ఉండే చిత్రాల్లో నటించడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఛపాక్’ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుంది. ప్రస్తుతం దీపిక ఈ చిత్రంలోనే కాకుండా.. 1983 క్రికెట్ వరల్డ్ కప్పు గెలిచిన భారత జట్టు పై తీస్తున్న చిత్రం ’83’లో కూడా కపిల్ దేవ్ భార్య పాత్రలో నటిస్తుండడం విశేషం. 

మరి ఇటువంటి ఒక సాహసోపేతమైన కథని ఎంపిక చేసుకుని అందులో నటించడమే కాకుండా.. ఆ చిత్ర నిర్మాతలలో ఒకరిగా మారిన దీపిక .. ఈ సినిమా ద్వారా తాను అనుకున్న ఫలితాన్ని అందుకుంటుందా లేదా అనేది ఇంకొక నెలరోజులు ఆగితే తెలిసిపోతుంది.

ఢిల్లీలో స్వచ్ఛమైన ‘గాలి’ పీల్చుకోవాలంటే… ఈ ‘ఆక్సిజన్ బార్’కి వెళ్లాల్సిందే ..!                                                                                                                                                                                                                                                                    

 

Read More From Entertainment