Fashion

ఈ ట్రెండీ జీన్స్ ప్యాంట్లకు.. మీ వార్డ్రోబ్‌లో కచ్చితంగా చోటు కల్పించాల్సిందే..!

Lakshmi Sudha  |  Apr 22, 2019
ఈ ట్రెండీ జీన్స్ ప్యాంట్లకు.. మీ వార్డ్రోబ్‌లో కచ్చితంగా చోటు కల్పించాల్సిందే..!

ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ ప్యాంట్లకు ఉన్న క్రేజే వేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు జీన్స్ ధరించడానికి ఇష్టపడుతుంటారు. చూడటానికి రఫ్‌గా ఉండే జీన్స్‌లో సైతం వివిధ రకాల మోడల్స్ వస్తున్నాయి. సందర్భానికి తగినట్లు ధరించేందుకు వీలుగా వీటిని రూపొందిస్తున్నారు.

అయితే వాటిలో కొన్ని మోడల్స్ కచ్చితంగా మన దగ్గర ఉండాల్సిందే. ఇవి సౌకర్యకవంతంగా ఉండటంతో పాటు తక్కువ ధరకే లభిస్తుండటంతో నేటితరం యువతలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పైగా ఇవి రోజువారీ ధరించడానికి వీలుగా ఉంటాయి. ఆ జీన్సేంటో తెలుసుకొని.. మీరు కూడా వాటిని మీ వార్డ్రోబ్‌లో చేర్చుకోండి.

1. రా డెనిమ్ జీన్స్(Raw Denim jeans)

మనం రెగ్యులర్‌గా ధరించే జీన్స్‌కు, దీనికి చాలా తేడా ఉంటుంది. దీనికి ప్రత్యేకించి ఎలాంటి డై వాడరు. కాబట్టి ఉతికి ఆరేస్తే రంగు మారిపోతుందేమోననే ఆలోచన అవసరం లేదు. అయితే మనం ఉపయోగించే కొద్దీ ఈ ప్యాంట్ పై ప్యాట్రన్స్ ఏర్పడతాయి. వీటిని ధరించినప్పుడు చాలా టైట్‌గా ఉన్నట్లు అనిపించిాన.. ఒకటి రెండు సార్లు ఉపయోగించేసరికి సౌకర్యవంతంగా మారిపోతాయి. వీటిని సెమీ ఫార్మల్ ఈవెంట్స్‌కు, స్నేహితులతో కలసి పార్టీలకు వెళ్లడానికి కూడా ఉపయోగించవచ్చు.

2. పిన్ రోల్ జీన్స్ (Pin roll jeans)

ఫ్యాషన్ ప్రపంచంలోకి పిన్ రోల్ జీన్స్ వచ్చి చాలా కాలమే అయినప్పటికీ వీటికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. పాదాల దగ్గర పైకి మడిచే ఈ జీన్స్ కచ్చితంగా మీ వార్డ్ రోబ్ లో ఉండాల్సిందే. ఎందుకంటే  ఇవి మీకు చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయి. కాకపోతే వాటిని మడతపెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ఇవి మరింత అందంగా కనిపిస్తాయి.

3. జిమ్ జీన్స్(Gym Jeans)

ఈ జీన్స్ చాలా తేలికగా ఉంటాయి.  అందుకే వేసవిలో కూడా ధరించడానికి అనువుగా ఉంటాయి. సాధారణంగా జిమ్‌కి జీన్స్ వేసుకెళ్లడం చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అవి అంత సౌకర్యవంతంగా ఉండవు. కానీ ఈ జిమ్ జీన్స్ ప్రత్యేకంగా జిమ్‌కి వేసుకెళ్లడానికే రూపొందించారు. జిమ్‌కి మాత్రమే కాదు.. వీటిని రోజువారీ కూడా ధరించవచ్చు. జిమ్ జీన్స్‌కి జతగా డెనిమ్ జాకెట్ వేసుకొంటే చాలా స్టైలిష్‌గా కనిపించవచ్చు.

4. డెనిమ్ లుక్ జీన్స్(Denim look jeans)

ఇవి చూడటానికి డెనిమ్ జీన్స్‌లా కనిపిస్తాయి. కానీ.. డెనిమ్‌తో తయారైనవి కాదు. కాస్త జెగ్గింగ్స్‌కు దగ్గరగా ఉండే వీటిని స్ట్రెచబుల్ కాటన్‌తో తయారుచేస్తారు. కాబట్టి డెనిమ్ కంటే తక్కువ ధరకే లభిస్తాయి. సౌకర్యవంతంగా ఉండే వీటిని ఫార్మల్, క్యాజువల్ వేర్‌గా ధరించవచ్చు.

5. ఇండిగో డైడ్ జీన్స్(Indigo dyed jeans)

ఇండిగో డైడ్ జీన్స్.. వివిధ రకాల మోడల్స్‌లో లభిస్తున్నాయి. డాంగ్రీ, క్యాట్ జీన్స్, డెనిమ్ సఫారీ, డెనిమ్ షర్ట్.. ఇలా మీకు నచ్చినవి, మీకు నప్పేవి ఎంచుకొని మీ వార్డ్ రోబ్‌ను మరింత స్టైలిష్‌గా మార్చేయండి.

+++++++++++++++ఈవెనింగ్ పార్టీలు, సాయంత్రం సమయంలో జరిగే ఈవెంట్స్‌కి వెళ్లాల్సి ఉంటే.. ఇండిగో డైడ్ జీన్స్ ధరించవచ్చు. దీనిపై ముదురు నీలం రంగు చొక్కా ధరిస్తే చాలా బాగుంటుంది. మీరు ధరించిన డైడ్ జీన్స్ రంగు కంటే.. కాస్త ముదురు రంగులో ఉన్న చొక్కా ధరిస్తే మీరు చాలా అందంగా మెరిసిపోతారు.

ఇవి కూడా చదవండి

ఈ 9 రకాల బ్లాక్ ఫ్యాషన్ ఐటమ్స్.. ప్రతి అమ్మాయి వార్డ్ రోబ్ లో ఉండాల్సిందే..

బెల్లీ ఫ్యాట్ కనబడకుండా చేసే.. జీనియస్ ఫ్యాషన్ టిప్స్ మీకోసమే..!

ఈ బీటౌన్ కలర్ కాంబినేషన్స్‌లో.. మీరు అందంగా మెరిసిపోతారు

Read More From Fashion