ADVERTISEMENT
home / ఫ్యాషన్
బెల్లీ ఫ్యాట్ కనబడకుండా చేసే.. జీనియస్ ఫ్యాషన్ టిప్స్ మీకోసమే..!

బెల్లీ ఫ్యాట్ కనబడకుండా చేసే.. జీనియస్ ఫ్యాషన్ టిప్స్ మీకోసమే..!

సన్నని నడుముతో ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకోని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? కానీ ఈ విషయంలో మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాల్సిందే. సన్నని నడుము, పొట్ట ఫ్లాట్‌గా ఉండటం మనకు ఎంత ఇష్టమో.. పిజ్జా కూడా అంతే ఇష్టం. అందులోనూ మన తెలుగువారికి పిండి వంటలంటే మహా ఇష్టం.

వీటన్నింటి కారణంగా మనం కాస్త బొద్దుగా కనిపిస్తాం. అయితే కొన్ని ఫ్యాషన్ చిట్కాలు పాటించడం ద్వారా పొట్ట(tummy) ఎత్తుగా ఉన్నప్పటికీ ఫ్లాట్‌గా కనిపించేలా చేసుకోవచ్చు. ఇండియన్ వేర్ నుంచి వెస్ట్రన్ వేర్ వరకు ఏ రకమైన దుస్తులు ధరించినా సరే ఫ్లాట్ టమ్మీతో అందంగా మెరిసిపోవచ్చు. పిజ్జా పీస్ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.

పొట్ట ఎత్తుగా కనబడకుండా చేసే ఫ్యాషన్ టిప్స్

ముదురు రంగు దుస్తులతో

ADVERTISEMENT

సాధారణంగా ముదురు రంగు దుస్తులు ధరించడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ ఎత్తుగా ఉన్న మీ పొట్ట ఫ్లాట్‌గా కనిపించాలంటే.. ముదురు రంగుల్లో ఉన్న దుస్తులు ఎంపిక చేసుకోవడం మంచింది. ఇవి మీకు ఫర్ఫెక్ట్ లుక్ ఇస్తాయి.

1-flatter-looking-tummy

నడుము భాగం హైలైట్ అయ్యే విధంగా..

ఎంపైర్ వెయిస్ట్ టాప్స్, ఎ-లైన్ డ్రస్ ధరించడం ద్వారా పొట్ట ఫ్లాట్‌‌గా కనిపించేలా చేసుకోవచ్చు. అలాగే షర్ట్ డ్రస్ ధరించి నడుము దగ్గర బెల్ట్ పెట్టుకోవడం వల్ల మీకు ఫ్లాట్ టమ్మీ లుక్ వస్తుంది. ఇవి మీ నడుమును సన్నగా కనిపించేలా చేయడంతో పాటు మీకు హవర్ గ్లాస్ లుక్ అందిస్తాయి.

ADVERTISEMENT

లేయర్స్ తో మ్యాజిక్

మీరు ధరించిన డ్రస్ లేదా టాప్ పై స్ట్రక్చర్డ్ బ్లేజర్ లేదా జాకెట్ ధరిస్తే.. మీ లుక్ మొత్తం మారిపోతుంది. ఫ్యాషనబుల్‌గా కనిపించడం మాత్రమే కాకుండా.. ఫాబ్యులస్ లుక్ సైతం సొంతం చేసుకోవచ్చు.

యాక్సెసరీస్‌తో అందంగా..

మీ టమ్మీ పై ఇతరుల దృష్టి పడకుండా ఉండాలంటే.. దానికి తగినట్టుగా యాక్సెసరీస్ ధరించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా స్టేట్మెంట్ నెక్లెస్ ధరించడమే. లేదా భుజాల వరకు వేలాడేలా ఉండే హ్యాంగింగ్స్‌ను చెవులకు పెట్టుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

నిదానంగా కూర్చోవడం ద్వారా

కాస్త వంగినట్టుగా కూర్చొంటే.. పొట్ట మరింత ముందుకు వచ్చి చూడటానికి అంత బాగోదు. అందుకే ఎప్పుడూ స్ట్రెయిట్ గానే కూర్చోవాలి. ఇలా నిదానంగా కూర్చోవడం వల్ల ఫ్లాట్ టమ్మీ ఉన్నట్టుగా ఇల్యూషన్ ఏర్పడుతుంది. ఇలా కూర్చోవడం కంటిన్యూ చేస్తే ఉదరభాగంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి.

2-flatter-looking-tummy

బాడీ షేపర్స్‌తో

ADVERTISEMENT

బాడీ కాన్ డ్రసెస్, వెల్ ఫిట్టెడ్ టాప్ ధరించేటప్పుడు ఎక్కువ మంది బాడీ షేపర్స్‌ను కూడా ధరిస్తారు. ఎందుకంటే ఇవి పొట్టను తక్కువ చేసి చూపించడంతో పాటు.. శ‌రీరాకృతి అందంగా క‌నిపించేలా చేస్తాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి వీటిని ప్రయత్నించి చూడండి.

హై హీల్స్ తో

మనం ధరించే చెప్పులు సైతం మన లుక్‌ని ప్రభావితం చేస్తాయి. స్టిలెట్టోస్, హై హీల్స్ ధరించడం వల్ల మనం పొడవుగా ఉన్నట్టు కనిపిస్తాం. అలాగే.. స్లిమ్‌గానూ కనిపిస్తాం.

Also Read: షూ బైట్‌తో బాధపడుతున్నారా ? అయితే ఈ 15 చిట్కాలు మీకోసమే..

ADVERTISEMENT

సరైన లోదుస్తులతో

సరైన లోదుస్తులు ధరించినట్లయితే మన బాడీ షేప్ కరెక్ట్‌గా కనిపిస్తుంది. కాబట్టి వాటిని ఎంచుకొనే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. మీకు సౌకర్యవంతంగా ఉంటూనే.. మీ షేప్ పర్ఫెక్ట్‌గా కనిపించేలా చేసే బ్రాను ఎంచుకోవడం ముఖ్యం. బాడీ షేపర్స్ ధరించడం ఇష్టం లేని వారు.. వాటికి బదులుగా హైరైజ్ అండర్వేర్ ధరించవచ్చు. ఇది కూడా మీకు ఫ్లాట్ టమ్మీ లుక్ ఇస్తుంది.

నిలువు చారల డిజైన్ ఎంచుకోండి

ఫ్లాట్ టమ్మీ లుక్ కావాలంటే వెర్టికల్ ప్యాట్రన్ డిజైన్ ఉన్న దుస్తులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి మిమ్మల్ని పొడవుగా, స్లిమ్‌గా కనిపించేలా చేస్తాయి. అడ్డ చారలున్న దుస్తులు ధరిస్తే.. మరింత లావుగా ఉన్నట్టు కనిపిస్తాం.

ADVERTISEMENT

3-flatter-looking-tummy

షో ఆఫ్ చేయండి..

సంప్రదాయ దుస్తులు ధరించినా.. వెస్ట్రన్ దుస్తులు ధరించినా.. కాస్త షో ఆఫ్ చేయాల్సిందే. అలా చేయడం తప్పేమీ కాదు. కాబట్టి అలా చేయడానికి భయపడాల్సిన అవసరమే లేదు. డీప్ వీ నెక్ బ్లౌజ్ లేదా డ్రస్ వేసుకోవడం ద్వారా అందరి దృష్టి మీ మెడ మీదే ఉంటుంది.

మీ ప్లస్ పాయింట్స్ హైలైట్ చేయండి

ADVERTISEMENT

ఏ విషయంలోనైనా సరే ఈ నియమాన్ని పాటించమని చెబుతూ ఉంటారు. మరి దాన్ని ఫ్యాషన్ పరంగా ఎందుకు పాటించకూడదు? మీ ప్లస్ పాయింట్స్ ఏంటో మీకు తెలిసినంత బాగా మరొకరకి తెలియకపోవచ్చు. కాబట్టి వాటిని హైలైట్ చేసే విధంగా మీ వస్త్రధారణ, యాక్సెసరీస్ ఉండాలి. అప్పుడు పొట్ట  ఎత్తుగా ఉన్నా అలా కనిపించదు. మీ చేతులు చాలా అందంగా కనిపించేవైతే.. స్లీవ్ లెస్ డ్రస్ వేసుకోండి. శంఖం లాంటి మెడ మీ సొంతమైతే.. డీప్ నెక్ ఉన్న టాప్స్ ధరించండి. మీ కాళ్లు పొడవుగా ఉంటే.. షార్ట్ స్కర్ట్ లేదా స్కర్ట్ డ్రస్ వేసుకోవడం ద్వారా చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు.

హ్యాండ్ బ్యాగ్స్ తో మాయ చేసి

పొడవైన స్ట్రాప్స్ ఉన్న పర్స్ ను భుజానికి తగిలించడం ద్వారా ఎదుటి వారి దృష్టి టమ్మీపై కేంద్రీకృతం కాకుండా చూసుకోవచ్చు. అలాగే క్రాస్ బాడీ బ్యాగ్స్, పొడవాటి హ్యాండిల్స్ ఉన్న స్టాచెల్స్, హోబో బ్యాగ్స్ కూడా ఈ విషయంలో మనకు సాయం చేస్తాయి.

ఇప్పుడు మనం చెప్పుకొన్నవన్నీ వెస్ట్రన్ అవుట్ ఫిట్స్, ఇండియన్ అవుట్ ఫిట్స్ ధరించిన రెండు సందర్భాల్లోనూ ఉపయోగపడతాయి. అయితే.. వాటితోనే సరిపెట్టుకొంటే ఎలా? అందుకే ధరిస్తున్న దుస్తులకనుగుణంగా ఎలాంటి టిప్స్ పాటిస్తే ఫ్లాట్ టమ్మీ లుక్ వస్తుందో తెలుసుకొందాం.

ADVERTISEMENT

వెస్ట్రన్ వేర్ ధరించినప్పుడు ఈ చిట్కా పాటించండిహై వెయిస్ట్ కే ఫస్ట్ ఛాయిస్: దుస్తులు కొనేటప్పుడు లోరైజ్ ప్యాంట్స్, స్కర్ట్స్ కొనుగోలు చేసేకంటే.. హై వెయిస్ట్ ప్యాంట్స్, స్కర్ట్ ఎంచుకోవడం మంచిది. దీనివల్ల మీ కటిభాగం సన్నగా కనిపిస్తుంది. హై వెయిస్ట్ ప్యాంట్స్ వేసుకొన్నప్పుడు వదులుగా ఉన్న షర్ట్స్ వేసుకోవడం వల్ల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.

పెప్లమ్స్(Peplums) ప్రయత్నించండి: కాస్త బొద్దుగా ఉన్నవారికి పెప్లమ్ తరహా దుస్తులు బాగా నప్పుతాయి. ముఖ్యంగా పియర్ షేప్ బాడీ ఉన్నవారికి అయితే ఇవి బాగా సూటవుతాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ కనబడకుండా చేస్తాయి. హై వెయిస్ట్ ప్యాంట్ పై పెప్లమ్ టాప్ ధరించినా.. లేదా పెప్లమ్ డ్రస్ వేసుకొన్నా.. చాలా బాగుంటుంది.

నప్పే టాప్ తో: పెప్లమ్ టాప్స్ వల్ల మీ లుక్ బాగున్నప్పటికీ రోజూ వాటినే ధరించడం కష్టం. కాబట్టి మిమ్మల్ని స్టైలిష్గా కనిపించేలా చేసే టాప్స్ ఎంచుకోవడం మంచిది. దీని కోసం వీ నెక్ టాప్స్ ఎంచుకోవాలి. అయితే వీటి పొడవు హిప్స్ వరకు మాత్రమే ఉండేలా జాగ్రత్తపడాలి. అలాగే నడుము దగ్గర కుచ్చుల మాదిరిగా ఉన్నవి సైతం ఎంచుకోవాలి.

స్కిన్నీ జీన్స్ కు దూరంగా:  స్కిన్నీ జీన్స్ వేసుకొంటే స్లిమ్ గా కనిపిస్తామని మనం అనుకొంటాం. కానీ దాని వల్ల ఉదరభాగం బాగా హైలైట్ అవుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. స్కిన్నీ జీన్స్ కు బదులుగా.. బూట్ కట్ ప్యాంట్స్ లేదా స్ట్రెయిట్ ఫిట్ జీన్స్ మిమ్మల్ని  అందంగా కనిపించేలా చేస్తాయి. హై వెయిస్ట్ ప్యాంట్స్ సైతం మిమ్మల్ని కాస్త పొడవుగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి కాస్త బరువు తగ్గినట్టుగా కనిపిస్తారు.

ADVERTISEMENT

టక్ చేయద్దు: టాప్, షర్ట్స్ ను ట్రౌజర్ లోకి టక్ చేసి బెల్ట్ పెట్టుకోవడం బాగుంటుందని మీకు అనిపించవచ్చు. కానీ ఇలా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు శరీరంలో ఏ భాగం హైలైట్ కాకూడదని కోరుకొంటున్నారో అదే అందరి దృష్టిలోనూ పడుతుంది.

అయినా మీకు టక్ ఇన్ చేసుకోవాలనిపిస్తే.. హై వెయిస్ట్ ట్రౌజర్స్ ధరించడం మంచిది. లో రైజ్, మిడ్ రైజ్ ప్యాంట్స్ ధరించినప్పుడు టక్ చేయకపోవడమే మేలు.

5-flatter-looking-tummy

బెల్ట్ కి దూరంగా..: కొంతమందికి నడుముకి పైన బెల్ట్ పెట్టుకోవడమంటే చాలా ఇష్టం. అది చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది కూడా. అయితే పొట్ట కాస్త ఎక్కువగా ఉన్నవారు ఇలా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది అనవసరంగా ఇతరుల చూపును అక్కడ పడేలా చేస్తుంది.

ADVERTISEMENT

లెగ్గింగ్స్ ధరించవచ్చు: లెగ్గింగ్స్ కంఫర్టబుల్ గా ఉండటం మాత్రమే కాదు.. మన శరీరంలోని ఎక్స్ ట్రా ఫ్యాట్ ను కవర్ చేస్తాయి. లెగ్గింగ్స్ పై లాంగ్ టాప్స్, ఎసెమెట్రిక్ టాప్స్, డ్రేప్డ్ కార్డిగన్స్ ధరిస్తే మీరు చాలా స్టైలిష్ గా కనిపిస్తారు.

Also Read: హనీమూన్‌కి వెళుతున్నారా..? హాట్ లుక్ ఇచ్చే క్యూట్ డ్రస్సులు మీకోసమే..

ఇండియన్ వేర్ ధరించినప్పుడు ఫాలో అవ్వాల్సిన చిట్కాలు

ఎంపైర్ లైన్ డ్రస్ బెస్ట్ ఆప్షన్: బెల్లీ ఫ్యాట్ ను కవర్ చేసుకోవాలని భావించేవారికి ఎంపైర్ లైన్ డ్రస్ మంచి ఎంపిక. ఎంపైర్ లైన్ కుర్తాలు, ఎంపైర్ లైన్ అనార్కలీ ధరిస్తే స్టైలిష్ గా కనిపిస్తారు. అలాగే స్ట్రెయిట్ కట్ డ్రస్ లకు దూరంగా ఉండటం మంచిది.

ADVERTISEMENT

ఎలా కట్టాలో అలాగే కట్టుకోవాలి: చీర కట్టుకొన్నా, లెహంగా ధరించినా వాటిని ఎలా కట్టుకోవాలో తెలిస్తే.. స్లిమ్ గా కనిపించవచ్చు. టమ్మీ ఫ్యాట్ కనబడకుండా ఉండాలంటే.. నాభికి కొంచెం పైకి వచ్చే విధంగా కట్టు ఉంటే బాగుంటుంది.

6-flatter-looking-tummy

Image: Instagram

బాటమ్ ఎంపికలో జాగ్రత్త: కాస్త బొద్దుగా ఉన్నవారు సల్వార్ పై వదులుగా ఉండే బాటమ్ వేసుకొంటే బాగుంటుందనుకొంటారు. కానీ వాటికంటే స్లిమ్ ఫిట్ ప్యాంట్స్ మీకు బాగుంటాయి. సిగరెట్ ప్యాంట్స్ సైతం ఫ్లాట్ టమ్మీ లుక్ అందిస్తాయి.

ADVERTISEMENT

చీర కుచ్చుళ్లు, దాని ఫ్యాబ్రిక్ కూడా ముఖ్యమే.. హెవీగా కనిపించే ఆర్గంజా, కాటన్ తరహా వస్త్రాలు మనల్ని మరింత లావుగా కనిపించేలా చేస్తాయి. దీనికి తోడు మనం పెట్టుకొనే కుచ్చుళ్ల కారణంగా పొట్ట మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే షిఫాన్, క్రేప్, జార్జెట్ చీరలు ఎంచుకోవడం మంచిది.

ఇవి మనల్ని స్లిమ్ గా కనిపించేలా చేస్తాయి. అలాగే కుచ్చులు సరిగ్గా పెట్టుకొంటే పొట్ట భాగం ఎత్తుగా కనిపించదు. పైట సైతం సన్నగా ఉండేలా పెట్టుకోవాలి.

మోనోటోన్ మ్యాజిక్: లంగా ఓణీ ధరించినప్పుడు.. జాకెట్, ఓణి, పరికిణి మూడూ ఒకే రంగులో ఉండేలా జాగ్రత్త పడితే స్లిమ్ గా కనిపించవచ్చు.

.7-flatter-looking-tummy

ADVERTISEMENT

 

Image: Instagram

Also Read: ఎలాంటి సందర్భానికైనా నప్పే 40 రకాల డిజైనర్ నగలు మీకోసమే

మనల్ని మనం ప్రేమించుకోవడం ఎందుకు ముఖ్యం?

ADVERTISEMENT

చాలా రోజులుగా పర్ఫెక్ట్ బాడీ, స్లిమ్ బాడీ అంటూ అమ్మాయిలు సన్నగా ఉండాలనే భావన మన సమాజంలో ఎక్కువగా ఉంది. మనకు తెలియకుండానే ఇదే భావన మన రక్తంల ోకి ఇంకిపోయింది. మీకు తెలుసా? పర్ఫెక్ట్ బాడీ అంటూ ఏదీ లేదు. మన చుట్టూ రకరకాల బాడీ షేప్స్, సైజుల్లో ఉన్నవారుంటారు. వారంతా అందంగానే ఉంటారు.

ప్రతిఒక్కరిలోనూ లోపాలుంటాయి. కొన్ని విషయాల్లో అభద్రతాభావం ఉంటుంది. కొంతమంది తమ చేతులు బాగా పొడవుగా ఉన్నట్టు ఫీలవుతారు. ఇంకొందరు తమ ముక్కును అసలు ఇష్టపడరు. ఇంకొందరికి తమ కాళ్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.

అయితే ఇక్కడ అమ్మాయిగా మనం ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఉన్న అమ్మాయిలా మనం కూడా ఉండాలనుకొంటే మనల్ని మనం కించపరుచుకొన్నట్లే. మీరు అందంగా లేరని మీరు భావిస్తున్నట్టే. కవర్ పేజీపై ఉన్న అమ్మాయి మనకు అందంగానే కనిపిస్తున్నప్పటికీ ఆమె కూడా మనలాగే చాలా విషయాల్లో అభద్రతా భావానికి లోనవుతూ ఉండవచ్చు. ఆమె ఆకర్షణీయంగా కనిపించడానికి ఫొటోషాప్ చేసి ఉండొచ్చు.

8-flatter-looking-tummy

ADVERTISEMENT

అందుకే ఇతరులను మెప్పించేలా కాకుండా మీరు మీలా మీకు నచ్చినట్టుగా ఉండటానికి ప్రయత్నించండి. మనం ఎలా ఉన్నప్పటికీ మనలో ఉన్న లోపాలను ఎవరో ఒకరు మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. వారి మాటలకు అసలు విలువే ఇవ్వకండి. అలాగే మిమ్మల్ని మీరు అంగీకరించాలని గుర్తుంచుకోండి. అంతేకాదు.. మీ స్థైర్యాన్ని ఇంకొకరు తగ్గించే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వొద్దు.

మీ ఉదరభాగం పైకి కనిపించకుండా మేం చేసిన సూచనలన్నీ మీకో జనరల్ గైడ్ లాగా మాత్రమే ఉపయోగపడ‌తాయి. అలాగే అందం విషయంలో, మీకు నచ్చినన్ని రూల్స్ బ్రేక్ చేసే విషయంలో ధైర్యంగా వ్య‌వహరించండి.

Internal Images: Shutterstock

06 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT