దిశా పటానీ (Disha patani).. తెలుగు సినిమా లోఫర్‌తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు జాతీయ, అంతర్జాతీయ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. కేవలం సినిమాలే కాదు.. అందాల ఆరబోత ఎక్కువగా ఉన్న తన ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు, ఫిట్ నెస్ ఫొటోలు, వీడియోలతో దిశ అందరినీ ఆకర్షిస్తుంటుంది. ఫిట్‌నెస్ అంటే ఈ అమ్మడుకు ఎంతిష్టమో.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జిమ్నాస్టిక్స్ (gymnastics), మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA), పిలాటిస్ (pilates) వంటి వాటిలో మంచి ప్రావీణ్యం సంపాదించింది.
ఇటీవలే తన వీడియోలతో తాను ఫీమేల్ యాక్షన్ ఫిల్మ్‌కి సిద్ధంగా ఉన్నానని తెలిపింది దిశ. ఎప్పుడూ టైగర్‌తో కలిసి.. అతడి వేగానికి తగినట్లుగా స్టెప్పులేసే దిశ.. ఇప్పుడు టైగర్‌కి దీటుగా మార్షల్ ఆర్ట్స్ లోనూ తన ప్రతిభను కనబరుస్తోంది. దీని గురించి తాజాగా మిడ్ డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం గురించి.. తనకు ఎదురైన గాయాల గురించి” చెప్పుకొచ్చింది దిశ.
దిశా పటానీ హాట్ ఫొటోలు చూసి.. వాళ్ల నాన్న ఏమన్నారో తెలుసా?
నేను జిమ్నాస్టిక్ట్ మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించాను. మనం వయసులోనే ఉన్నప్పుడు ఇలా శరీరాన్ని వంచడం నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే మన శరీరం ఇరవై సంవత్సరాల తర్వాత మార్పులకు లోనవుతుంది. ఎముకలు, కండరాలు గట్టిగా మారి శరీరాన్ని వంచేందుకు ఇబ్బంది అవుతుంది. నేను షూటింగ్‌లో లేనప్పుడు జిమ్నాస్టిక్స్; మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో బిజీగా ఉంటాను. ఒకరోజు అదైతే మరో రోజు ఇది నేర్చుకుంటుంటా.
జిమ్నాస్టిక్స్ కంటే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కాస్త సులువుగా ఉంటుంది. కానీ జిమ్నాస్టిక్స్ చేయాలంటే మాత్రం మీరు ధైర్యంగా ఉండడంతో పాటు.. స్థిరంగా తరచూ దాన్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. నేను ఇప్పుడున్న స్థితికి చేరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. దాన్ని రోజూ ప్రాక్టీస్ చేయాలి. మోకాలు చిప్పలు, ఎముకలు విరిగితేనే మనం నేర్చుకోగలుగుతాం. నాకు గాయాలు కొత్త కాదు.. చిన్న నుంచి పెద్ద పెద్ద గాయాలు నాకు చాలా అయ్యాయి.
ఒకసారైతే కాంక్రీట్ ఫ్లోర్ పై శిక్షణ తీసుకుంటున్నప్పుడు కింద పడి నా తలకు దెబ్బ తగిలింది. ఆ ప్రమాదంలో నేను గతాన్ని మర్చిపోయా. అంతకుముందు.. ఆరు నెలల పాటు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. అలా నా జీవితంలోని ఆరు నెలల కాలాన్ని కోల్పోయా. ఇటీవలే సినిమా షూటింగ్‌లోనూ ఓ ఫీట్ చేస్తుంటే.. మోకాళ్లకు దెబ్బ తగిలింది. అయితేనేం కేవలం వారం రోజుల్లో తిరిగి మరోసారి.. అదే ఫీట్ చేయగలిగా. అది నా పట్టుదల వల్లే.. అంటోందామె.
అంతేకాదు.. రోజూ ట్రైనింగ్ చేయడం వల్ల కొన్నాళ్లకు మన శరీరం మీద మనకు పట్టు ఉంటుంది. కాబట్టి గాయాలు తక్కువగా అవుతాయని దిశ చెబుతుంది. “నేను షూటింగ్స్ కోసం బయటకు వెళ్లినప్పుడల్లా నా ట్రైనింగ్ ఆగిపోతుంది. తిరిగి బేసిక్స్ నుంచి ప్రారంభిస్తాను. జిమ్నాస్టిక్స్‌లో రాణించాలన్నా.. స్ప్లిట్స్, కార్ట్ వీల్స్ వంటి వ్యాయామాలు చేయాలన్నా.. రోజూ శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉండాలి.
అలా చేయకపోతే శరీరాన్ని తిరిగి వంచడం ఇబ్బందిగా మారుతుంది.. అంటూ చెప్పే ఆమె వెయిట్ ట్రైనింగ్ కూడా జిమ్నాస్టిక్స్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో రాణించేందుకు ముఖ్యం అని చెబుతుంది. భుజాల్లో శక్తిని పెంచుకొని జిమ్నాస్టిక్స్‌లో అద్భుతంగా రాణించగలగడం అనేది వెయిట్ ట్రైనింగ్ వల్లే వస్తుంది. అలాగే కాళ్లు కూడా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం బలంగా ఉండాలి. అందుకే నేను రోజూ 60 నుంచి 90 నిమిషాల పాటు వెయిట్ ట్రైనింగ్ చేస్తాను. అది కూడా వారానికి ఆరు రోజులు తప్పనిసరిగా చేస్తా” అంటుంది.
నా ట్రైనింగ్కి తగినట్లుగా డైట్ తీసుకోకపోతే నేను అంత కఠినమైన వ్యాయామాలు చేసి లాభం ఉండదు. కానీ కడుపు మాడ్చుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో తేడా ఉంటుంది. నేను అన్నింట్లోనూ ఆరోగ్యకరమైన ఆప్షన్లను ఎంచుకుంటాను. మనం ఎలా కనిపిస్తాం అనేది 90 శాతం మన ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తినకపోతే నేను ఎంత వ్యాయామం చేసినా ఫలితం కనిపించదు. అందుకే నేను నా కండరాల శాతాన్ని పెంచుకునేందుకు ఎక్కువగా ప్రొటీన్ తీసుకుంటూ ఉంటాను. నాకు స్వీట్లంటే ఎంతో ఇష్టం. అందుకే వారానికి ఒక్కరోజు మాత్రం నాకు నచ్చింది తినడానికి కేటాయించుకుంటా. అంటూ డైట్ ప్రాధాన్యం గురించి కూడా చెప్పుకొచ్చింది దిశ.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీమరియు బెంగాలీ
కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !
హైదరాబాద్ ట్రెండ్స్ : బెస్ట్ జిమ్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి..!