దిశా పటానీ హాట్ ఫొటోలు చూసి.. వాళ్ల నాన్న ఏమన్నారో తెలుసా?

దిశా పటానీ హాట్ ఫొటోలు చూసి.. వాళ్ల నాన్న ఏమన్నారో తెలుసా?

దిశా పటానీ (Disha patani).. తెలుగు సినిమా 'లోఫర్'తో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఎం. ఎస్ ధోనీ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించి.. బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్‌తో కలిసి 'బాఘీ 2' సినిమాలో నటించిందామె. తాజాగా సల్మాన్ సరసన ఆమె నటించిన 'భారత్' చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది.


ఈ అమ్మడు ఒక నటిగా కంటే.. టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్‌గానే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సాధించింది. అంతేకాదు.. హాట్ దుస్తులతో సోషల్ మీడియాలో కనిపిస్తూ కూడా దిశా పాపులర్‌గా మారుతోంది. అయితే ఈ హాట్ దుస్తులు చూసి వాళ్ల తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారు.. అన్న డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఆ ప్రశ్నకి దిశ ఇటీవలే సమాధానమిచ్చింది.


d5


బాలీవుడ్‌లోని హాట్ అండ్ గ్లామరస్ హీరోయిన్లలో దిశ ఒకరు. సోషల్ మీడియాలో హాట్‌గా ఉండే తన ఫొటోలను పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది దిశ. ఆమె పోస్ట్ చేసే ఫొటోల్లో ఎక్కువగా షార్ట్ డ్రెస్సెస్ లేదా బికినీ ఫొటోలే ఎక్కువగా ఉంటాయి. ఈ ఫొటోలను చాలామంది లైక్ చేస్తే.. కొందరు ట్రోల్ కూడా చేస్తుంటారు. కానీ ఆమె ఫొటోల్లో ఎక్కువ శాతం ఇష్టపడని వారిలో ముఖ్యమైన వ్యక్తి ఆమె నాన్న (Dad) జగదీష్ సింగ్ పటానీ కూడా ఒకరట.


d6


ఆమె కుటుంబంలోని మిగిలిన సభ్యులకు తన గ్లామరస్ ఫొటోల విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదట. కానీ దిశ నాన్నకి మాత్రం ఆ ఫోటోల్లో కొన్ని అస్సలు నచ్చవట.  దిశా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ.. "మా ఇంట్లో వాళ్ల ఆలోచనా తీరు చాలా మోడ్రన్‌గా ఉంటుంది. అందుకే నేను ఏదైనా ఫొటోషూట్‌లో పాల్గొంటే ముందు దానికి సంబంధించిన ఫొటోలన్నీ మా ఇంట్లో వాళ్లతో పంచుకుంటాను. ఆ ఫోటోలు చూస్తూ నాన్న కొంచెం ఇబ్బందిపడతారు.  అయితే అమ్మ మాత్రం అన్ని ఫొటోలు చూసి నాకు సలహాలు కూడా అందిస్తుంది. "అంటూ చెప్పుకొచ్చింది.


అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు ఎంత మోడ్రన్ ఆలోచనలతో ఉన్నా ఫ్యాన్స్ అలా ఫీలవ్వరు కదా. సోషల్ మీడియాలో దిశ ఫొటోలు షేర్ చేసిన ప్రతిసారీ చాలామంది ఆమెను ట్రోల్ చేస్తుంటారు. ఆమె వేసుకునే దుస్తులు, శరీర ప్రదర్శన పై ప్రతిసారి కామెంట్లు వస్తూనే ఉంటాయి. అయినా సరే.. వాటిని తాను అస్సలు పంచుకోనంటుందీ అందాల రాశి. ట్రోల్స్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తను సరైనదని భావించిన దిశలోనే ముందుకు సాగుతూ పేరు సాధిస్తోంది దిశ.


d2


ఇటీవలే భారత్ సినిమాలో కనిపించి అభిమానులను అలరించింది దిశ. అయితే ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో సల్మాన్ వయసు గురించి అనుకోకుండా మాట్లాడి సల్మాన్ కోపానికి గురైంది.


తాను ఎప్పటినుంచో సల్మాన్‌తో పనిచేయాలనుకుంటున్నానని.. ఆ అవకాశం భారత్ సినిమాతో లభించిందని చెప్పిన దిశ.. దీని తర్వాత మరోసారి నాకు సల్మాన్‌తో నటించే అవకాశం దొరుకుతుందని నేను భావించట్లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య చాలా వయసు తేడా ఉంది. అందుకే ఇకపై మేమిద్దరం కలిసి పనిచేయడం కాస్త కష్టమే అనిపిస్తోంది అంటూ వెల్లడించింది. దీనితో సల్మాన్ ఆమెపై గుర్రుగా ఉన్నట్లు వార్తలొచ్చాయి.
 

 

 


View this post on Instagram


 

 

🙏❤️ #bharat#slowmotion


A post shared by disha patani (paatni) (@dishapatani) on

మరో వైపు భారత్ విడుదల తర్వాత తనకు వస్తున్న ప్రశంసలతో ఎంతో ఆనందంగా ఉంది దిశ. తాజాగా భారత్‌లో ఆమె నర్తించిన స్లో మోషన్ పాటకు థియేటర్లో ఆడియన్స్ డ్యాన్స్ చేస్తుంటే.. దాన్ని వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకుందీ అందాల తార. భారత్ తర్వాత ఈ అమ్మడు ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ నటిస్తోన్న మలంగ్ చిత్రంలో నటిస్తోంది.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ


కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !


ఇవి కూడా చదవండి. 


తన బెడ్రూంకి సంబంధించిన.. ఓ సీక్రెట్‌ని బయటపెట్టిన ప్రియాంక..!


ఆ నిమిషం నేను సినిమాలు వదిలేసి మెడిసిన్ చేద్దామనుకున్నా : సాయి పల్లవి


కాస్త జిప్ వేసుకోవాల్సింది.. : రకుల్ పై విమర్శలు చేస్తున్న నెటిజన్లు..