చీర (saree) .. భారతీయ స్త్రీని నిండుగా చూపించే వస్త్రం. లావు, సన్నం అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరినీ అందంగా చూపించగలగడం చీర ప్రత్యేకత. మరి.. మీరు కూడా కాలేజీ ఫ్రెషర్స్ డే, ఆఫీస్ పార్టీ, బంధువులింట్లో ఫంక్షన్ మొదలైన వేడుకల్లో చీర కట్టుకోవడానికి సిద్ధమవుతున్నారా? అయితే మీ కోసమే ఈ సలహాలు. వీటిని ఓసారి చదివి ఈ విషయాలను గుర్తుంచుకుంటే చాలు.. చీర కట్టుకునేటప్పుడు ఇవి మీకు బాగా సాయపడతాయి.
1. ఫ్యాబ్రిక్ ఎంపిక నుంచే..
చీర కట్టుకోవడానికి మొదటి మెట్టు దాన్ని ఎంచుకోవడం. చీర ఎంపికలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఫ్యాబ్రిక్. అందుకే మీ శరీరతత్వానికి సరిపోయేలా పట్టు, జార్జెట్.. వంటి ఫ్యాబ్రిక్స్ ఎంచుకోండి. వీటిని ఎంచుకోవడం వల్ల ఒకసారి చీర కట్టుకున్నాక అది జారిపోతుందేమోనని మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. ఇవి సాఫ్ట్ మెటీరియల్స్ కాబట్టి.. ఇబ్బంది కూడా ఉండదు. చక్కగా పిన్స్ పెట్టి కట్టుకుంటే చాలు.. అలా నిలిచిపోతాయి. అదే శాటిన్ క్లాత్ అయితే చీర జారుతూ ఉంటుంది. కాటన్ క్లాత్ స్టిఫ్‌గా ఉండిపోయి ఇబ్బంది పెడుతుంది. వీటిని కట్టుకోవద్దని కాదు. కానీ మొదటిసారి కట్టుకునేవాళ్లు వీటికి దూరంగా ఉంటే మంచిది.
2. స్కిన్ షో ఎంత?
చీర కట్టుకున్నప్పుడు తప్పకుండా నడుము కొంత భాగం బయటకు కనిపిస్తుంది. మీరు ఎంత భాగం బయటకు చూపించడానికి ఇష్టపడుతున్నారు అన్నదానిపై ఆధారపడి కూడా చీర ఎంపిక ఉండాలి. షీర్ ఫ్యాబ్రిక్స్, నెట్టెడ్.. వంటివి ఎంచుకున్నప్పుడు చర్మం ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మం ఎక్కువగా కనిపించకూడదు అనుకుంటే.. వీటి బదులు వేరే ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. అంతేకాకుండా.. బ్లౌజ్ పొడవు కూడా చూసుకొని కుట్టించుకోవాలి. కాస్త పొడవు తక్కువగా ఉన్నా ఫర్వాలేదు అనుకుంటే.. దాన్ని ఇబ్బంది పడినట్లు కనిపించకుండా ఆనందంగా చీరను క్యారీ చేయాలి.
3. సేఫ్టీపిన్స్‌తో సహవాసం..
చీర కట్టుకోవడం మొదటిసారి కాబట్టి.. ఎక్కడా ఇబ్బంది లేకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి. కుచ్చిళ్లు పెట్టే ముందు ఒక పిన్ పెట్టండి. ఇలా పెట్టికోట్‌కి చీరకి కలిపి పిన్ పెట్టడం వల్ల.. మీరు కుచ్చిళ్లు దోపిన తర్వాత కూడా అవి కదలకుండా ఉంటాయి. కుచ్చిళ్లు పెట్టాక వాటిని కలుపుతూ ఓ పిన్ పెట్టుకొని అప్పుడు లోపలికి దోపుకోండి. ఆ తర్వాత చీర కొంగు కోసం మరొక పిన్ పెట్టుకోవాలి. ఇంకా మీకు ఎక్కడైనా చీర జారుతుందని అనుమానంగా అనిపిస్తే.. అక్కడ కూడా పిన్ పెట్టుకోవచ్చు.
4. పెట్టికోట్ టైట్‌గా..
సాధారణంగా మీకు దుస్తులు కాస్త లూజ్‌గా వేసుకునే అలవాటు ఉండవచ్చు. కానీ చీర కట్టుకునేటప్పుడు మాత్రం పెట్టికోట్ టైట్‌గా కట్టుకోవాల్సి ఉంటుంది. మీరు దానిని కట్టుకున్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ కాసేపటికి అది వదులయిపోతుంది. చీర కట్టుకున్నాక మీకు ఇబ్బంది తెలీదు. కాబట్టి పెట్టికోట్‌ని కాస్త టైట్‌గానే ఉంచుకోవాలి. పెట్టికోట్ ఇలా టైట్‌గా ఉంటే చీర చక్కగా కనిపిస్తుంది. ఇక్కడే చాలామంది అమ్మాయిలు తప్పు చేస్తుంటారు. పెట్టికోట్‌ని లూజ్‌గా బొడ్డు కిందకు కడుతుంటారు. కానీ ఇలా కట్టడం వల్ల చీర జారుతుంది. కాబట్టి పెట్టికోట్‌ని మీదకు కట్టుకొని కాస్త టైట్‌గా ఉంచుకుంటే చాలు.. చీర జారకుండా ఉంటుంది.
5. హీల్స్ వేసుకుంటారా?
చీర కట్టుకున్నప్పుడు చాలామంది హై హీల్స్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ మీరు చీర కట్టుకునేది మొదటిసారి కాబట్టి ..మీ చెప్పులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. కనుక పెద్దగా ఇబ్బంది కలిగించని వెడ్జెస్, కిట్టెన్ హీల్స్ వంటివి వేసుకోవచ్చు. లేదంటే చీర కట్టుకొని నడిచేటప్పుడు మీరు ఇబ్బంది ఫీలవుతారు. హీల్స్ మరింత ఇబ్బందిని కలిగించకుండా ఉండాలంటే.. మీకు నడవడానికి వీలుగా ఉండేవి ఎంచుకోవాలి. అలాగే పెట్టికోట్ కట్టుకున్నాక.. చీర దోపేటప్పుడు చెప్పుల ఎత్తును కూడా పరిగణనలోకి తీసుకొని కాస్త కిందికి లేదా పైకి దోపుకోవాలి.
6. ఎక్కువగా తిరగాలా?
చీర కట్టుకునేటప్పుడు.. మీరు బయట ఎంతసేపు ఉంటారనే విషయం పెద్దగా పట్టించుకోరు. కానీ మీరు చీర కట్టుకొని వెళ్లే అకేషన్‌ని బట్టి కూడా.. చీర తీరు ఆధారపడి ఉంటుంది. ఫ్రెషర్స్ పార్టీల్లో అయితే చాలామంది చీర కట్టుకొని పరిగెత్తడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటప్పుడు చీర కట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది కలగచ్చు. అందుకే ఇలాంటి వేడుకల్లో సంప్రదాయబద్ధంగా కాకుండా.. కాస్త ట్రెండీగా ఉండేలా లెగ్గింగ్ శారీ, ప్యాంట్ శారీ, ధోతీ శారీ వంటివి కట్టుకోవచ్చు. కొన్ని ఫంక్షనల్లో మీరు పెద్దగా తిరగకుండా.. ఒక చోట మాత్రమే కూర్చొనే అవకాశం ఉంటుంటి. ఇలాంటి ఫంక్షన్లలో మామూలు చీరను కట్టుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు.
7. అవి సరిగ్గా ఉండాలి.
ఒకవేళ మీ చీరకు హెవీ ఎంబ్రాయిడరీ కొంగు ఉంటే.. అది మీ చీరను వెనక్కి లాగుతుంది. అలాగే మీరు పిన్ సరిగ్గా పెట్టుకోకపోతే తరచూ జారుతూ ఇబ్బందిపెడుతుంది. అందుకే హెవీ ఎంబ్రాయిడరీ కొంగు ఉండే చీరలు కట్టుకునేటప్పుడు.. ఒకటికి రెండు పిన్స్ పెట్టుకోవడం మంచిది. దీంతో పాటు కొంగు కాస్త పైకి ఉండాలి. మరీ నేలకు ఆనేలా కాకుండా.. అలాగని మరీ పిరుదుల వరకూ రాకుండా చూసుకోవాలి. అలాగే మీ ఎత్తుకు తగినట్లుగా చీర కట్టుకొని కాళ్లు ఎక్కువగా కనిపించకుండా చూసుకోవాలి.
8. సహాయం తీసుకోండి.
మొదటిసారి మీరే చీర కట్టుకోవాలంటే అది ఎన్ని వీడియోలు చూసినా కుదరని పని. అందుకే మీ అమ్మ, స్నేహితురాలు, అక్క, పార్లర్ ఆంటీ.. ఇలా ఎవరో ఒకరి సహాయం తీసుకోండి. వాళ్లు ఇందులో నిజమైన ఎక్స్ పర్ట్స్. అలాగే మీరు కూడా చీర కట్టుకున్న ప్రతిసారి ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటారు. ఆ ట్రిక్స్ మరోసారి చీర కట్టుకునేటప్పుడు మీకు తోడ్పడతాయి. కనుక ఎప్పుడూ ట్రెండీగా చీర కట్టుకునే మీ ఫ్రెండ్స్, అక్కలను అడిగి కొన్ని టిప్స్ తెలుసుకోండి. కొన్నిసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత చీర కట్టడం వస్తే.. అప్పుడు వివిధ రకాలుగా కట్టడం నేర్చుకోవచ్చు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
తొడలు లావుగా ఉన్నాయా? ఇలా చేస్తే సన్నగా కనిపిస్తారు..!
మనసు చెప్పే భాష మన ఫ్యాషన్ ( ఈ అద్భుతమైన కొటేషన్లు మీకోసం)
ఈ ఫ్యాషనబుల్ వస్తువులు.. మీ వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే..!