Lifestyle

స్టార్ హోటల్స్ అందిస్తోన్న ఉగాది రుచులు.. హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్ అప్డేట్స్..!

Lakshmi Sudha  |  Apr 5, 2019
స్టార్ హోటల్స్ అందిస్తోన్న ఉగాది రుచులు.. హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్ అప్డేట్స్..!

తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతుంది. ఈ ఏడాదిని వికార నామ సంవత్సరంగా పరిగణిస్తాం. ఏడాదికి తొలి రోజైన ఉగాది(Ugadi) పర్వదినం నాడు సంతోషంగా ఉంటే.. ఏడాదంతా సంతోషంగా ఉంటామనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. అందుకే ఆ రోజు కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడి ఆరగించి.. వివిధ రకాల పిండి వంటలతో విందు భోజనం చేస్తారు. అయితే కొంతమందికి పిండి వంటలు చేసుకొనే తీరిక ఉండకపోవచ్చు.

మరికొందరికి అవి చేయడం రాకపోవచ్చు. అందుకే హైదరాబాద్‌లోని కొన్ని స్టార్ హోటళ్లతో పాటు.. మరికొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఉగాది ఫుడ్ ఫెస్టివల్ (food festival) జరుపుతున్నాయి. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకొందాం.

ది వెస్టిన్ హైదరాబాద్, మైండ్ స్పేస్

హైదరాబాద్‌లోని మైండ్ స్పేస్ దగ్గర ఉన్న ‘ది వెస్టిన్’ హోటల్లో ఉగాది పండగ సంద‌ర్భంగా సంప్రదాయ రుచులను అందిస్తున్నారు. తెలుగు వంటకాలైన ఉగాది పచ్చడి, పులిహోర, బూరెలు  కస్టమర్లకు ప్రత్యేకంగా సర్వ్ చేయనున్నారు. వీటితో పాటు ఇతర తెలుగు, కన్నడ సంప్రదాయ రుచులను వడ్డించనున్నారు.

వేదిక: సీజనల్ టేస్ట్స్, ది వెస్టిన్ హైదరాబాద్ మైండ్ స్పేస్

తేదీలు: ఏప్రిల్ 6, 7

సమయం: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు.

ధర: లంచ్ – రూ. 1,250. బ్రంచ్ – రూ. 2,350.

ఆదిత్య పార్క్ హోటల్, అమీర్ పేట

తెలుగు వారి పండగ ఉగాదిని రుచికరంగా జరుపుకొనేలా ఆదిత్య పార్క్ హోటల్లో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. సంప్రదాయ తెలుగు రుచులతో లంచ్, డిన్నర్ సర్వ్ చేయనున్నారు.

వేదిక: హోటల్ ఆదిత్య పార్క్, అమీర్ పేట

తేదీలు: ఏప్రిల్ 6, 7

సమయం: మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 వరకు లంచ్

సాయంత్రం 7.30 నుంచి రాత్రి 10.30 వరకు డిన్నర్

ధర:  రూ 699.

ఐటీసీ కాకతీయ దక్సిణ్, బేగంపేట

ఉగాది పచ్చడితో పాటు నాటు కోడి వడ పులుసు,  జామకాయ డబుల్ బీన్స్ కుర్మా వంటి అద్భుతమైన, వైవిధ్యమైన రుచులను ఆస్వాదిస్తూ పండగ జరుపుకొనే అవకాశం కల్పిస్తోంది ఐటీసీ కాకతీయ.

వేదిక: ఐటీసీ కాకతీయ దక్సిణ్, బేగంపేట

తేదీలు: ఏప్రిల్ 7

సమయం : మధ్యాహ్నం నుంచి

ధర: రూ. 2000(బఫె)

Image: Instagram

ఉగాది ఫెస్టివల్ 2019

పిండి వంటలు, పంచాంగ శ్రవణం వంటి సంప్రదాయమైన కార్యక్రమాలతో ఉగాది పండగ జరుపుకోవాలనుందా? అయితే హైదరాబాద్ కైట్స్, నృత్య‌ ఫెర్మారింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఉగాది ఫెస్టివల్ 2019 కు వెళ్లాల్సిందే. ఈ ఫెస్టివల్ లో ఉగాది వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ ఫెస్టివల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా? పంచాంగ శ్రవణం, అంత్యాక్షరి, ర్యాంప్ వాక్  ఏర్పాటు చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా బారిష్టర్ పార్వతీశం నాటకం ప్రదర్శించనున్నారు. నృత్య‌ ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఫుడ్ స్టాల్స్ సైతం ఏర్పాటు చేయనున్నారు. ఉగాది పచ్చడి, ఆరు రకాల పిండి వంటలతో భోజనం వడ్డించనున్నారు.

వేదిక: నృత్య‌ ఫోరం ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్, రోడ్ నెంబర్ 2, బంజారాహిల్స్

తేదీ: ఏప్రిల్ 6

సమయం: మధ్యాహ్నం 1 గం. నుంచి సాయంత్రం 7 వరకు

ఎంట్రీ టికెట్: రూ. 599(భోజనం, ఉగాది సంబరాలతో సహా)

ఫుడ్ ఎంట్రీ టికెట్: రూ 249 (భోజనానికి మాత్రమే)

ఉగాది సంబరాల ఎంట్రీ టికెట్: రూ. 349

ఈ సంబరాల్లో పాల్గొనడానికి ముందుగా టిక్కెట్టు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు 9966862800 సంప్రదించండి.

Images: Shutterstock

ఇవి కూడా చదవండి:

ఫ్యాషన్ అప్డేట్: ఈ కుర్తాలు పండగ ప్రత్యేకంగా మీకోసం

ధోనీ ఫ్యాన్ మూమెంట్: బామ్మా ఓ సెల్ఫీ తీసుకొందామా..

హెయిర్ కేర్ టిప్స్: చిట్కాలు చిన్నవే కానీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి

అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.

Read More From Lifestyle