Friends

ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ ( Friendship Day Gift Ideas In Telugu)

Sandeep Thatla  |  Jul 16, 2019
ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ ( Friendship Day Gift Ideas In Telugu)

ఇంకొక రెండు వారాల్లో స్నేహితుల దినోత్సవం (Friendship Day) రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే మీ ప్రియా నేస్తానికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలనే తపనతో ఉన్నారా? ఎలాంటి బహుమతి ఇస్తే.. అది మీ స్నేహానికి  తీపిగుర్తుగా నిలుస్తుందని ఆలోచిస్తున్నారా ? అయితే మీలాంటి వారి కోసమే ఈ కథనం

ఈ కథనంలో మేం ఎలాంటి బహుమతులు.. ఎలాంటి స్నేహితులకు ఇస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయంతో.. వివిధ వర్గాలుగా వారిని విభజించాం. 

మీరు ఈ క్రింది బహుమతుల జాబితా చూస్తే.. అందులో మీ అభిరుచికి తగిన బహుమతి లభించే అవకాశం కచ్చితంగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం… క్రిందకి స్క్రోల్ చేస్తూ ఇక్కడ పేర్కొన్న బహుమతులను చూసేయండి. 

ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్స్ – గర్ల్ ఫ్రెండ్స్ కోసం (Friendship Day Gift Ideas In Telugu For Your Girl Friends)

మీ ప్రియమైన స్నేహితురాళ్లకి.. ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ జాబితాలోని ఏదైనా ఒక బహుమతిని మీరు అందించవచ్చు.

పూలు ఇష్టపడిన అమ్మాయిలుంటారా? ఒకవేళ ఉన్నా కూడా అది చాలా తక్కువ శాతమే. అందుకనే అమ్మాయిలకి ఏదైనా బహుమతి ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు.. ముందుగా మనకి ఠక్కున గుర్తొచ్చేవి పూలు. ఇక అందులోనూ ప్రత్యేకంగా కానుకగా ఇవ్వాల్సి వస్తే, గులాబీ పూల బొకే.. అలాగే దానితో పాటుగా ఒక చాక్లెట్ బాక్స్ ఇవ్వండి. ఎందుకంటే చాక్లెట్లు, పూలు చాలా చక్కటి కంబినేషన్ కాబట్టి…

* రోజా పూలు & చాక్లేట్ బాక్స్ (Rose Flowers & Chocolate Box)

* కాఫీ మగ్ (Coffee Mug)

చక్కటి టీ లేదా చిక్కటి కాఫీతో మన రోజు మొదలవుతుంది. అలా మొదలయ్యే రోజుని మనమిచ్చిన కాఫీ మగ్ లేదా టీ మగ్‌తో మన స్నేహితులు మొదలుపెడుతుంటే.. కచ్చితంగా మనం వారికి గుర్తుండిపోతాం. ఈ బహుమతిని కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు.

* కేక్ (Cake)

ఏదైనా మంచి మాట విన్నా లేదా శుభకార్యం గురించి ప్రస్తావించినా.. సాధారణంగా నోటిని తీపి చేయాలంటారు. చాలామంది తమ స్నేహబంధానికి గుర్తుగా.. ఇలాంటి సందర్భాల్లో ఒకరికొకరు కేక్‌ని తినిపించుకుంటూ.. నోటిని తీపి చేసుకుంటారు. అలాగే ఫ్రెండ్‌షిప్ డే రోజున కేక్‌ను బహుమతి ఇవ్వడం కూడా మంచి ఆలోచనే.

* లిప్ గ్లాస్ (Lip Gloss)

సాధారణంగా అమ్మాయిల సౌందర్యానికి.. మరింత సొబగులు అద్దేవి అధరాలు (పెదాలు). సహజంగానే అందంగా ఉన్న వీటిని మరింత ఆకర్షణీయంగా చూపించేందుకు ఉపయోగపడేది లిప్ గ్లాస్. ఈ లిప్‌గ్లాస్‌ను కూడా స్నేహితుల దినోత్సవం రోజున బహుమతిగా ఇవ్వచ్చు. ఇది కూడా ఒక మంచి ఆలోచనే.

* టీ – షర్ట్ (T-Shirt)

ఈమధ్య కాలంలో దుస్తుల విషయంలో.. మునుపటితో పోలిస్తే చాలా రకాల డిజైన్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. అలాగే వయసును బట్టి కూడా ఫ్యాషన్ హంగులు మారుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ అలా ఉంది. ముఖ్యంగా టీషర్ట్స్ విషయంలో కూడా విభిన్న డిజైన్స్.. యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. మీరు కూడా మీ స్నేహితురాలి అభిరుచికి తగట్టుగా ఒక కూల్ టీ – షర్ట్ లేదా స్వెట్ షర్ట్‌ని బహుమతిగా ఇవ్వొచ్చు.

* టోటే బ్యాగ్ (Tote Bag)

మనం మన స్నేహితులకి ఏదైనా వారి అవసరాలకి తగట్టుగా.. ఒక బహుమతిని ఇస్తే దానిని వారు ఎప్పటికి మర్చిపోలేరు. అటువంటి ఒక బహుమతే – టోటే బ్యాగ్. ఈ బ్యాగ్‌లో దాదాపు అయిదారు వస్తువులు తీసుకెళ్లేందుకు వీలుంటుంది. అందుకే మనమిచ్చే ఈ బహుమతి వారికి ప్రతిరోజు మనల్ని గుర్తుచేస్తూనే ఉంటుంది.

* మొబైల్ ఫోన్ కవర్ (Phone Cover)

ఈ మొబైల్ జమానాలో ఆకర్షణీయమైన ఫోన్ వాడడమే కాదు.. ఆ ఫోన్‌ని అత్యంత ఆకర్షణీయంగా మార్చుకోవడం కూడా ఒక ట్రెండే. అందుకోసం చాలా మంది దాదాపు నెల లేదా రెండు నెలల సమయంలో ఒక మొబైల్ కవర్‌ని మారుస్తుంటారు. ఇలా నెల లేదా రెండు నెలలకి మొబైల్ కవర్స్ మార్చే వారిలో మీ స్నేహితులుంటే.. వెంటనే మీరు ఒక మొబైల్ ఫోన్ కవర్‌ని వారికి బహుమతిగా ఇవ్వొచ్చు. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ బహుమతి రోజంతా వారి చేతుల్లోనే ఉంటుంది.

* ప్రింటెడ్ కుషన్స్ (Cushion Cover)

చాలామందికి ఇంట్లో ఉండే సమయంలో ఎక్కువగా కుషన్స్‌ని పట్టుకుని కూర్చుంటారు. అలాంటి కుషన్స్ పై మీకు నచ్చిన వారి ఫోటో లేదా ఏదైనా మీకు నచ్చిన కొటేషన్ ఉంటే ఎంత బాగుంటుంది?  మీకు ఇఫ్టమైన వ్యక్తిని  లేదా ఇష్టమైన మాటని ఆ కుషన్ ప్రతిక్షణం గుర్తుకి తెస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రింటెడ్ కుషన్స్ కవర్ ఒక ట్రెండ్‌గా మారింది.

‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి…!

ఫ్రెండ్ షిప్ డే గిఫ్ట్స్ – బాయ్ ఫ్రెండ్స్ కోసం (Friendship Day Gifts Fpor Boy Friends)

స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఉన్న బాయ్స్‌కి మీరు ఇవ్వగలిగే గిఫ్ట్స్ గురించిన వివరాలు మీకోసం…

* బీర్ మగ్ (Beer Mug)

మీ స్నేహితుడికి గనుక బీర్ సేవించే అలవాటు ఉంటే.. వారికి మీరు బీర్‌మగ్‌ని బహుమతిగా ఇవ్వచ్చు. అయితే ఈ బీర్ మగ్స్‌లో కూడా వివిధ డిజైన్స్ ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్నాయి.

* వాచ్ (Men’s Watch)

ఫార్మల్ గా ఉన్నా లేదా క్యాజువల్స్ వేసుకున్నా చేతికి గడియారం పెట్టుకుంటే సదరు వ్యక్తి ఒకరకంగా పర్ఫెక్ట్ గా కనిపిస్తాడు అని అంటారు. అయితే ఈరోజుల్లో మొబైల్ ఫోన్స్ వచ్చాక చేతికి వాచ్ పెట్టుకునేవారు తగ్గిపోయారు. అయినాసరే ఇప్పటికి కూడా చేతికి వాచ్ లేనిదే బయటకి వెళ్లనివారు కూడా ఎక్కువమంది ఉన్నారు. ఆ కోవలోకి చెందిన వారు మీ స్నేహితుడైతే కచ్చితంగా ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక వాచ్ ని బహుమతిగా ఇవ్వండి.

* పెర్ఫ్యూమ్ (Perfume+ Deo Set)

పెర్ఫ్యూమ్ అనేది ఉపయోగించే వారికే కాదు.. వారి పక్కన ఉన్నవారికి కూడా ఒకరకమైన మంచి వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రధానంగా కొంతమంది శరీరం నుండి చెమట ఎక్కువగా వస్తుంటుంది. అది కొందరి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ సమయంలో మనకి .. మనతో కలిసి పనిచేసే వారికి అదే చెమట వల్ల కాస్త ఇబ్బంది కలగొచ్చు. ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈ పెర్ఫ్యూమ్ ఉపయోగపడుతుంది. మీ స్నేహితుడికి ఈ బహుమతి అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది.

* ప్రింటెడ్ టీ – షర్ట్ (Printed T-Shirt)

ఈమధ్య కాలంలో ప్రింటెడ్ టీ షర్ట్స్ రూపంలో మార్కెట్‌లోకి సరికొత్త మోడల్స్ వస్తున్నాయి. సదరు వ్యక్తి మనస్తత్వానికి తగ్గట్టుగా.. వారికి సరిపోయే వ్యాఖ్యలతో టీ షర్ట్స్ దొరుకుతున్నాయి. లేదంటే మనకి కావాల్సిన వ్యాఖ్యలని సదరు టీ షర్ట్స్ పైన ప్రింట్ చేయించి గిఫ్ట్‌గా కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతం ఇది బహుమతులలో ఒక కొత్త ట్రెండ్‌గా రూపాంతరం చెందింది. 

* గ్లాసెస్ (Sunglasses)

గ్లాసెస్ అంటే ఒక స్టైల్ స్టేట్మెంట్‌కు ప్రతీక. బైక్ పైన వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా విహార ప్రాంతాన్ని పర్యటించడానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ గ్లాసెస్‌ని ఉపయోగిస్తుంటారు.  మీ స్నేహితులకి కూడా గ్లాసెస్‌ అంటే మక్కువ ఉంటే.. మీరు కూడా కచ్చితంగా ఈ బహుమతిని అందించవచ్చు. 

* వాలెట్ (Men’s Wallet)

వాలెట్ (పర్స్) లేనిదే మనం బయటకి వెళ్లలేము. ఎందుకంటే మనకి కావాల్సినవి ఎన్నో వాలెట్‌లో ఉంటాయి. ఒకరకంగా వ్యాలెట్ లేకపోతే.. మన రోజు గడవడం చాలా కష్టం. అందుకనే ఒక మంచి వాలెట్‌ని బహుమతిగా ఇస్తే మీ స్నేహితుడు లేదా స్నేహితురాలితో ఎప్పుడూ అది ప్రయాణిస్తునే ఉంటుంది. 

* కీ – చైన్ (Keyring)

చాలా మందికి కీ – చైన్స్‌ని సేకరించడం ఒక ప్రత్యేకమైన హాబీ. మరికొంతమంది తాము ఉపయోగించే కీ – చైన్ విషయంలో కూడా ఒక మంచి టేస్ట్ కలిగి ఉంటారు. అటువంటి వారు మీ స్నేహితులైతే.. ఒక మంచి కీ – చైన్‌ని వారికి బహుమతిగా ఇవ్వండి.

* సెంటెడ్ క్యాండిల్స్ (Scented Candles)

మనం పీల్చే గాలి మన మూడ్‌ని సెట్ చేస్తుంది అంటారు. ముఖ్యంగా రాత్రి పడుకునే సమయాల్లో చికాకుగా ఉంటే.. మన గదిలో మంచి సెంటెడ్ క్యాండిల్‌ని వెలిగిస్తే భలేగా ఉంటుంది. ఆటోమేటిక్‌గా ఆ సువాసనతో మన మూడ్ మారిపోతుంది. ఇది అందరూ తప్పక ట్రై చేయాల్సిన వస్తువు. ఇక ఇటువంటిది మీకు గనుక బహుమతిగా ఇస్తే.. మీ స్నేహితుడు లేదా స్నేహితురాలి మూడ్‌ని సెట్ చేసిన వారవుతారు. 

ఫ్రెండ్‌షిప్ గిఫ్ట్స్ – మీ తల్లిదండ్రుల కోసం (Gifts For Mom And Dad)

చాలామంది తమ తల్లిదండ్రులనే బెస్ట్ ఫ్రెండ్స్‌గా చూస్తుంటారు. ఎందుకంటే వారికి ఎటువంటి సమస్య ఎదురైనా.. వారు తల్లిదండ్రులుగా కాకుండా మంచి స్నేహితుల్లా మనకి అండగా నిలబడుతుంటారు. అటువంటి వారికి ఈ స్నేహితుల దినోత్సవం రోజున.. ఎటువంటి బహుమతి ఇస్తే బాగుంటుందో మనమూ ఈ క్రింది ఆప్షన్ల ద్వారా తెలుసుకుందాం.

* కపుల్ మగ్ (Couple Mug Set)

రోజు ఉదయాన్నే లేచి.. మీ అమ్మానాన్నలు కాఫీ లేదా టీ తాగడం సర్వసాధారణమే. ఆ సమయంలో వారి చేతిలో ఉండే మగ్స్‌ని మీరు కొనిస్తే ఎంతో బాగుంటుంది. పైగా ఆ మగ్స్ పైన వారి ఫోటోలు లేదా ఏవైనా మంచి కొటేషన్స్ ఫ్రేమ్ చేయించవచ్చు.

* వాల్ క్లాక్ (Wall Clock)

ప్రతి ఇంటిలో వాల్ క్లాక్ అనేది తప్పనిసరి. అటువంటిది ఒక స్పెషల్ వాల్ క్లాక్‌ని మీరు కొనిస్తే.. అది చూసినప్పుడల్లా మీ తల్లిదండ్రులకి మీరే గుర్తుకి వస్తారు. పైగా ఈ వాల్ క్లాక్స్‌లో కూడా మీ తల్లిదండ్రుల ఫోటోలని ఫ్రేమ్ చేయించవచ్చు.

* నెక్ పీస్ (Pendant Necklace With Chain)

మీ తల్లే మీ ప్రియమైన స్నేహితురాలైతే … మీరు ఆమెకి ఎంతో ఇష్టమైన జ్యువెలరీని బహుమతిగా ఇవ్వచ్చు. ఎందుకంటే జ్యువెలరీని ఇష్టపడని ఆడవారు అతి తక్కువగా ఉంటారు. మీ అమ్మగారు బహుశా ఆ కోవకి చెందని వారై ఉంటారని అనుకుంటున్నాం.

* డైరీ (Diary)

జీవితంలో అప్పటికే ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మన తల్లిదండ్రులు.. వారి ప్రయాణంలో ఎదురైన మధురస్మృతులను అప్పుడప్పుడు అక్షరీకరిస్తుంటారు. తమ భావాలను పేపర్ పై పెడుతుంటారు.  అలాంటి తల్లిదండ్రులు మీకూ ఉంటే.. ఓ చక్కటి డైరీని వారికి బహుమతిగా ఇవ్వచ్చు.

* కపుల్ వాచెస్ (Pair Of Watch)

మీ తల్లిదండ్రులకి చేతి గడియారమంటే మక్కువ ఉందా? అయితే ఇప్పుడు మార్కెట్‌లో కపుల్ వాచెస్ ఎన్నో ఆకర్షణీయమైన రూపాల్లో లభిస్తున్నాయి. వాటిని కూడా మీ తల్లిదండ్రులకి స్నేహితుల దినోత్సవం సందర్భంగా బహుమతిగా అందించవచ్చు. 

ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్స్ – మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం (Gift Ideas For Your Best Friend)

మనకి స్నేహితులు ఎందరైనా ఉండచ్చు. కాని వారిలో ఎవరో ఒక్కరే.. మనకి అత్యంత ప్రియమైన స్నేహితుడు/స్నేహితురాలుగా ఉంటారు. అది సహజమే. అటువంటి వారి కోసం ఈ క్రింది చెప్పిన వాటిల్లో ఏదైనా ఒకదాన్ని బహుమతిగా అందివ్వండి. 

* పుస్తకం (Book)

ఒక మంచి పుస్తకాన్ని స్నేహితుడితో సమానంగా పోలుస్తుంటారు. అటువంటిది మనకి ఇష్టమైన స్నేహితుడికి ఒక మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇస్తే అంతకు మించిన బహుమతి ఇంకొకటి ఉండదు.

* ఫోటో క్యాలెండర్ (Photo Calendar)

మన ఇళ్ళల్లో క్యాలెండర్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆ క్యాలెండర్‌ని బట్టే మనం పనులని విభజించుకుంటూ, ప్లాన్ చేసుకుంటూ ముందుకి వెళుతుంటాము. అంతటి ప్రాధాన్యం ఉన్న క్యాలెండర్‌‌‌లో కూడా వివిధ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.  అందులో ఒకటి ఫోటో క్యాలెండర్. మీకు ఇష్టమైన వారి ఫోటోతో ప్రింట్ చేసిన.. ఫోటో క్యాలెండర్‌ని వారికి బహుమతిగా ఇవ్వచ్చు.

* పెన్ (Personalised Sleek Pen)

చాలామందికి పెన్స్ అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. అందుకనే ధర కాస్త ఎక్కువైనా.. తమకి నచ్చిన పెన్ కోసం ప్రాకులాడుతుంటారు. అలా పెన్స్ అంటే ఇష్టం చూపించే మీ స్నేహితుడు/స్నేహితురాలికి మంచి పెన్‌ని గిఫ్ట్ గా ఇవ్వండి.

* పసుపు రంగు రోజా పూలు (Bouquet Of Roses)

పసుపు రంగు రోజా పూలని స్నేహానికి చిహ్నంగా ఉదహరిస్తుంటారు. అందుకోసమే స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ రంగు పూలని మీ స్నేహితులకి అందించేయండి.

స్నేహమేరా జీవితం: ఫ్రెండ్‌షిప్ విలువను తెలియజెప్పే 40 కొటేషన్లు

* చాక్లెట్ బాక్స్ (Chocolates)

చాక్లెట్లని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు! పైగా ఫ్రెండ్స్ మధ్యలో చాక్లెట్స్ షేరింగ్ అనేది సర్వసాధారణం. అందుకనే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా.. మంచి పసందైన చాక్లెట్ బాక్స్‌ని బహుమతిగా ఇస్తే మీ స్నేహితుడు/స్నేహితురాలు ఎంతో ఆనందిస్తారు.

* పెర్ఫ్యూమ్ (Perfume)

పెర్ఫ్యూమ్ అనేదాన్ని ఈనాడు దాదాపు అందరూ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈరోజుల్లో అది రోజువారీ ఉపయోగించే వస్తువులలో ఒకటిగా మారిపోయింది. దానికి తోడుగా ఈ పెర్ఫ్యూమ్‌లు రకరకాల బ్రాండ్స్‌లో లభిస్తున్నాయి. ఇవేకాకుండా వివిధ రకాల ఫ్లేవర్స్‌లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. అందుకనే మీ స్నేహితుడు/స్నేహితురాలు మెచ్చిన ఫ్లేవర్డ్  పెర్ఫ్యూమ్‌ని బహుమతిగా ఇవ్వండి.

* వాచ్ (Watch)

చాలామంది చేతికి గడియారం పెట్టందే.. బయటకి ఒక్క అడుగు కూడా వేయలేరు. అందుకు అనుగుణంగానే రకరకాల మోడల్స్‌లో మనకి వాచెస్ (చేతి గడియారాలు) మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే వివిధ బ్రాండ్స్ కూడా.. ఈ చేతి గడియారాల రంగంలోకి అడుగుపెట్టాక.. లక్షల రూపాయల మొత్తంలో కూడా ఇవి లభిస్తున్నాయి. ఇక మీరనుకున్న బడ్జెట్‌లో మీ స్నేహితుడికి ఒక చక్కటి వాచ్‌ని బహుమతిగా ఇవ్వచ్చు.

* ఫోటో ప్రింటెడ్ కేక్ (Chocolate Photo Cake)

ఈ కాలంలో ఏదైనా శుభవార్తను పంచుకోవాలంటే.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అందుకే కేక్ తయారీలో కూడా చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అలా వచ్చిన ఒక మార్పు ఫోటో ప్రింటెడ్ కేక్. ఇప్పుడు ఈ ఫోటో ప్రింటెడ్ కేక్ ట్రెండ్ నడుస్తోంది. స్నేహితుల దినోత్సవం నాడు మీ బెస్ట్ ఫ్రెండ్‌కి.. వారి ఫోటోతో తయారు చేయించిన కేక్ బహుమతిగా ఇవ్వచ్చు.

* బ్యాక్ ప్యాక్ (Backpack)

తేలికపాటి లేదా తక్కువ మొత్తంలో వస్తువులు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేదే బ్యాక్ ప్యాక్. ప్రస్తుతం దీని వాడకం జనసామాన్యంలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే, సమీప దూరంలో ఉన్న ప్రాంతాలకి ఈ బ్యాక్ ప్యాక్స్‌తో ప్రయాణం చేయడం చాలా సులువుగా ఉండడమే. ఈ బ్యాక్ ప్యాక్స్ అటు మగవారికి.. ఇటు ఆడవారికి ప్రత్యేకంగా లభిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీ స్నేహితుడు/స్నేహితురాలికి దీనిని గిఫ్ట్‌గా ఇవ్వండి.

* మేకప్ కిట్ (Makeup Box For Women)

మేకప్‌కిట్ అంటే ప్రాణంగా చూస్తారు మగువలు. తమకి నచ్చిన ఒక అయిదు వస్తువుల పేర్లు చెప్పమంటే అందులో మేకప్‌కిట్ కచ్చితంగా ఉంటుంది. అంతటి ప్రాముఖ్యతని ఇచ్చే ఆ మేకప్ కిట్‌ని.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా బహుమతిగా ఇస్తే.. మీ స్నేహితురాలి ఆనందానికి అవధులే ఉండవు.

ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్స్ – హ్యాండ్ మేడ్ (Handmade Friendship Day Gifts)

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీ స్నేహితులకి బహుమతిగా ఇవ్వాలనుకొనే గిఫ్ట్స్.. ఎక్కడో కొనే కంటే సొంతంగా తయారుచేసి ఇవ్వడానికే కొంతమంది ఆసక్తి చూపుతుంటారు. అయితే వారికి సొంతగా చేయాలన్న తపన ఉన్నా.. చేసే విధానం తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం ఈ క్రింది కొన్ని ట్యుటోరియల్స్ ఇవ్వడం జరిగింది. అవి చూస్తే మీరు కూడా సొంతంగా ఆయా గిఫ్ట్స్‌ని చేసేయవచ్చు.

* ఫ్రెండ్‌షిప్ డే బ్యాండ్స్ (Friendship Bands)

ఫ్రెండ్‌షిప్ డే బ్యాండ్స్ బయట కొనడం కన్నా.. సొంతంగా చేసుకుంటేనే ఆ కిక్కు ఉంటుందని అనుకునేవారు ఈ వీడియో చూడాలి.

* అగ్గి పెట్టతో ఫోటో ఫ్రేమ్ చేయడం చూస్తారా.. (How To Make Photo Frame)

అగ్గిపెట్టెని ఉపయోగించి ఒక చిన్నటి ఫోటో ఫ్రేమ్ ఎలా తయారుచేయాలన్నది.. ఈ క్రింది వీడియోలో చూడండి.

* ఫ్రెండ్ షిప్ డే ‘హార్ట్’ కార్డ్ ఐడియా (Friendship Day Heart Shaped Card)

ఫ్రెండ్‌షిప్ డే విషెస్ చెప్పడానికి రంగుల పేపర్లు ఉపయోగించి.. ‘హార్ట్’ కార్డ్ ఎలా చేయాలో ఈ క్రింది వీడియోలో చూసి తెలుసుకోండి.

* ఐస్ క్రీమ్ పుల్లలతో ‘ఫ్రెండ్ షిప్’ డే కార్డ్ (Friendship Day Card Using Pulses)

మనకి విరివిగా లభించే ఐస్‌క్రీమ్ పుల్లలతో ఫ్రెండ్‌షిప్ డే కార్డ్ ఎలా చేశారు అనేది.. ఈ క్రింది వీడియోలో చూడచ్చు.

* బెలూన్స్ & కార్డ్ బోర్డు బాక్స్‌తో పార్టీ పూపర్ (Party Pooper With Balloons )

బెలూన్స్, కార్డ్ బోర్డులని ఉపయోగించి పార్టీ పూపర్‌ని తయారుచేయడం.. మీరు ఈ వీడియోలో చూడవచ్చు.

* డ్రాయింగ్ షీట్‌తో స్మైలీస్ (Box Of Joy)

డ్రాయింగ్ షీట్‌ని ఉపయోగిస్తూ రకరకాల స్మైలీస్ ఎలా చేయాలో  ఈ క్రింది వీడియోలో మీరు చూడచ్చు.

* కీ రింగ్స్‌ని తయారు చేయడం ఎలా? (Keyrings)

బంక మట్టిని ఉపయోగించి ‘కీ రింగ్స్’ని తయారుచేసే విధానం.. ఈ క్రింది వీడియోలో మీ కోసం

* బెస్టిస్ హెయిర్ బ్యాండ్స్ (Haircut)

సాధారణ హెయిర్ బ్యాండ్‌లని ఉపయోగించి.. బెస్టిస్ హెయిర్ బ్యాండ్స్‌ని ఎలా తయారు చేయవచ్చనేది ఈ వీడియోలో చూడవచ్చు.

రూ 500 కంటే తక్కువ ధరలో లభించే.. ఫ్రెండ్ షిప్ డే గిఫ్ట్స్ (Friendship Day Gifts Below Rs.500)

ఈ ఫ్రెండ్‌షిప్ డేకి మీ స్నేహితుడు/స్నేహితురాలికి బహుమతి ఇవ్వాలని మనసులో ఉన్నా సరే… ఖరీదైన బహుమతి ఇవ్వలేకపోతున్నామనే బాధలో ఉన్నవారు .. కేవలం రూ. 500 లోపే ఒక మంచి బహుమతిని ఇవ్వచ్చు. ఈ క్రింది తెలిపిన అయిదు బహుమతులలో ఏదైనా ఒకటి మీ స్నేహితుడు/స్నేహితురాలికి అందివ్వండి

* స్పైరల్ బుక్ (Friendship Day Notebook)

మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనులు మర్చిపోతుంటే.. ఒక పుస్తకంలో వాటిని రాసి పెట్టుకుంటే మంచిది. అప్పుడు అదే పుస్తకం మీకు రిఫరెన్సు కోసం పనిచేస్తుంది. ఈ రోజులలో స్పెషల్‌గా డిజైన్ చేసిన స్పైరల్ బుక్స్ మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిని మీ స్నేహితుడు/స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వచ్చు.

* మొబైల్ కవర్ (Phone Cover)

ఈరోజుల్లో మొబైల్ ఫోన్ వాడడమే కాదు, ఆ ఫోన్‌ని అందంగా ఉంచుకోవడం కూడా ప్రధానమైపోయింది. అందుకోసమే ఫోన్ బ్యాక్ కవర్స్‌కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందులో భాగంగానే మార్కెట్‌లో వివిధ రకాల ఫోన్ కవర్స్ అందుబాటులోకి వచ్చాయి. అలా ఒక మంచి ఫ్యాన్సీ బ్యాక్ కవర్‌ని మీ స్నేహితుడు/స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వండి.

* పోస్టర్స్ (Poster)

పోస్టర్స్ అనగానే సినిమా పోస్టర్స్ అనుకోకండి. ఇంటిలోని గోడకి తగిలించుకునే చిన్నపాటి పోస్టర్స్ గురించి చెబుతున్నాం. మంచి కొటేషన్స్ కలిగిన పోస్టర్స్ లేదా మీ స్నేహితుడు/స్నేహితురాలి ఫోటోలతో తయారుచేయించిన పోస్టర్స్‌ని కూడా.. మీ బెస్ట్ ఫ్రెండ్‌కి అతితక్కువ ధరలో కొనుగోలు చేసి ప్రజెంట్ చేయవచ్చు.

* ల్యాప్ టాప్ స్కిన్ (Laptop Skin)

ఈకాలంలో ల్యాప్ టాప్స్ వాడని యువతరం ఉండరు కదా! అలా ల్యాప్ టాప్స్‌కే కాదు.. వాటి అనుబంధంగా ఉండే వస్తువులకు కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఉదాహరణకి ల్యాప్ టాప్ కవర్ (స్కిన్). ఈ ల్యాప్ టాప్ స్కిన్స్ ఇప్పుడు ఫ్యాన్సీగా లభిస్తున్నాయి. అవి యువతని పెద్ద ఎత్తున ఆకర్షించడం కూడా జరుగుతోంది. 

* ప్రింటెడ్ కాఫీ మగ్ (Personalized Color Changing Mug)

కాఫీ మగ్స్‌తో మనకి పరిచయమే. అయితే ఈమధ్యకాలంలో మనకి నచ్చిన వారి ఫోటోస్ పెట్టి.. కాఫీ మగ్ పైన ఫ్రేమ్ చేయించి ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. అతితక్కువ ధరలో మనకి నచ్చిన వారి ఫోటోస్‌తో ప్రింట్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చేయవచ్చు.

ఫ్రెండ్‌షిప్ డే గ్రీటింగ్ కార్డ్స్ (Friendship Day Greeting Cards)

ఫ్రెండ్‌షిప్ డే రోజున స్నేహితులకి బహుమతులతో పాటుగా.. తమ స్నేహాన్ని తెలియజేసేలా పలురకాల గ్రీటింగ్ కార్డ్స్‌ని కూడా ఇస్తుంటారు. అందుకే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా గిఫ్ట్స్‌తో పాటుగా.. గ్రీటింగ్ కార్డ్స్‌కి సైతం డిమాండ్ ఉంటుంది.

* భర్తే బెస్ట్ ఫ్రెండ్‌గా మారే వేళ.. అతనికి ఇచ్చే గ్రీటింగ్ కార్డ్ (Card For Husband)

మన జీవితంలోకి వచ్చిన భర్త.. ఆ తరువాత కాలంలో బెస్ట్ ఫ్రెండ్‌గా మారితే… అంతకుమించిన అదృష్టం మరొకటి లేదు. అలాంటి భర్తకి తప్పకుండా ఇవ్వవలసిన గ్రీటింగ్ కార్డ్ ఇది.

* ఆఫీస్‌లోని బెస్ట్ ఫ్రెండ్‌కి ఇచ్చే గ్రీటింగ్ కార్డ్ (Card For Friend In Office)

ఆఫీస్‌లో చాలామందితో కలిసి పనిచేస్తుంటాం. కాని ఒక్కరితోనే చాలా సన్నిహితంగా మెలగగలం. అటువంటి వారికి ఈ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఫ్రెండ్ షిప్ డే విషెస్ చెప్పండి.

* ఫన్నీ ఫ్రెండ్‌కి ఇచ్చే.. గ్రీటింగ్ కార్డ్ (Card For Funny Friend)

మన ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఎంతమంది ఉన్నా సరే… ఫన్నీగా ఉంటూ అందరిని నవ్విస్తూ ఉండే  ఫ్రెండ్‌కి మాత్రం తప్పకుండా ఈ గ్రీటింగ్ కార్డు ఇచ్చేయండి

* మనకి దూరంగా ఉన్న స్నేహితుడు/స్నేహితురాలికి ఇచ్చే గ్రీటింగ్ కార్డ్ (Card For Long Distance Friend)

మనకి ఎంతగానో ఇష్టమైన స్నేహితుడు/స్నేహితురాలు దూరంగా ఎక్కడో ఉన్నప్పటికీ.. వారి గుర్తులు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలా దూరంలో ఉన్న వారికి ఇచ్చే గ్రీటింగ్ కార్డ్ ఇది.

* మన జీవితంలో.. ఆ ఒకానొక బెస్ట్ ఫ్రెండ్‌కి ఇచ్చే గ్రీటింగ్ కార్డ్ (Card For Best Friend)

జీవితంలో ఎంతోమంది ఫ్రెండ్స్ అవుతుంటారు. కాని ఒక్కరే మన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ అనే స్థానాన్ని చేరుకుంటారు. వారికి ఈ గ్రీటింగ్ కార్డు ప్రత్యేకం.

* బెస్ట్ ఫ్రెండ్ అయిన భార్యకి.. ఇచ్చే గ్రీటింగ్ కార్డ్ (Card For Wife)

మన లైఫ్‌లోకి బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్న అమ్మాయే భార్యగా వస్తే.. అంతకన్నా సంతోషం ఇంకెక్కడా ఉండదు. అలాంటి సతీమణికి తప్పకుండా.. మీ ప్రేమను వ్యక్తపరిచే కార్డు ఇచ్చే ఆశ్చర్యపరచండి. 

* కష్టసుఖాలు పంచుకునే స్నేహితుడికి.. ఇచ్చే గ్రీటింగ్ కార్డ్ (For A Terrific Friend)

మన జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో.. మన సమస్యని విని, అర్ధం చేసుకుని తగిన సలహాలు ఇచ్చే ఫ్రెండ్‌కి ఇవ్వవలసిన కార్డు “గ్రీటింగ్ కార్డు”. అందులో వివిధ డిజైన్లు మనకు లభిస్తున్నాయి.

* ఫ్రెండ్స్ గ్రూప్‌కి ఇచ్చే గ్రీటింగ్ కార్డ్ (Card For Friend’s Group)

ఫ్రెండ్‌షిప్ డే రోజున.. స్నేహితులకి బహుమతులతో పాటుగా తమ స్నేహాన్ని తెలియచేసేలా పలురకాల గ్రీటింగ్ కార్డ్స్‌ని కూడా ఇస్తుంటారు. అందుకే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా గిఫ్ట్స్‌తో పాటుగా గ్రీటింగ్ కార్డులకు సైతం డిమాండ్ ఉంటుంది.

చదివేసారుగా… రాబోయే స్నేహితుల దినోత్సవ సందర్భంగా.. మీ బెస్ట్ ఫ్రెండ్స్‌కి ఎటువంటి బహుమతులు అందించాలో.. ఒక అవగాహన వచ్చేసింది కదా. ఇవే కాకుండా మీరు కూడా మీకు తెలిసిన బహుమతులను మాకు సూచించవచ్చు. వాటి గురించి ఈ క్రింద కామెంట్ బాక్స్‌లో సూచించవచ్చు

फ्रेंडशिप डे स्टेटस

హైదరాబాద్ – సికింద్రాబాద్ బోనాలు 2019: జాతరలో భక్తులు సందర్శించే 6 టెంపుల్స్

 

Read More From Friends