Lifestyle

మీ సెక్స్ మూడ్‌ని.. రొమాంటిక్‌గా మార్చే విషయాలివే..!

POPxo Team  |  Apr 24, 2019
మీ సెక్స్ మూడ్‌ని.. రొమాంటిక్‌గా మార్చే విషయాలివే..!

సెక్స్ ఎడ్యుకేషన్ (Sex) అనేది నేడు.. పెళ్లయ్యాక ఎంతోమందికి తెలిసీ, తెలియని విషయాల సమాహారంగా మారిపోతోంది. ఇలాంటి సందర్భంలో సెక్స్ గురించి కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే.. నవ దంపతులుగా మీరూ తప్పకుండా సెక్స్‌లో పాల్గొనాలని ఆశించడం సహజం. సెక్స్ గురించి అంతా తెలుసు అనుకున్న చాలామందికి కూడా తెలియని విషయాలి ఉంటాయి. మీరు సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉన్నా.. లేకపోయినా సరే.. ఈ విషయాలు (Facts) తెలుసుకొని ఉండడం మంచిది. 

ప్రస్తుతం మీరు చదవబోయే విషయాలు.. సెక్స్‌కి సంబంధించిన బేసిక్స్ తెలిసినవారికే ఇవి అర్థమవుతాయి. కాబట్టి ముందుగా సెక్స్ గురించి కాస్త అవగాహన ఉంటే వీటి గురించి తెలుసుకోవడం మంచిది. ఇందులో చాలా విషయాలు ఎవరూ విని ఉండరనేది మాత్రం నిజం. అవేంటో తెలుసుకోవాలంటే ఇది చదివి చూడండి..

1. ప్రత్యేక పవర్‌కి కారణమేంటంటే..

సాధారణంగా ఓ మహిళ యోని (vagina) రెండు నుంచి మూడు అంగుళాలు ఉంటుంది. కానీ దానికి 200 శాతం వరకూ వెడల్పుగా మారే శక్తి ఉంటుంది. సెక్స్ సమయంలో.. ప్రసవం అవుతున్నప్పుడు యోని వెడల్పుగా మారుతుంది. 

2. ఆర్గాజమ్ ఆరోగ్యానికి మంచిది..

ఆర్గాజమ్ వల్ల స్త్రీ, పురుషులిద్దరికీ మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పురుషుల్లో ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటే.. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులను ఇది తగ్గిస్తుంది.

3. ఒత్తిడిని తగ్గిస్తుంది.

సెక్స్ రోజువారి జీవనంలో ఎదురయ్యే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మన గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించి నెలసరి సమయంలో నొప్పి రాకుండా చేస్తుంది. యాంగ్జైటీ వంటి సమస్యలు తగ్గించేలా ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేస్తుంది.

4. గుమ్మడికాయ వాసన మత్తెక్కిస్తుంది..

సాధారణంగా ఒక్కొక్కరికీ మూడ్ రావడానికి ఒక్కో మార్గం ఉంటుంది. కానీ గుమ్మడి కాయ వాసన మాత్రం అందరిలో పనిచేస్తుందట. ఇది జననాంగాలకు రక్త ప్రసరణను పెంచి మూడ్ వచ్చేలా చేస్తుంది.

5. ఆర్గాజమ్ రావాలంటే..

చాలామందిలో చనుమొనలు రుద్దితే ఆర్గాజమ్ వస్తుంది. దీన్నే నిపుల్గాజమ్ అంటారు. మహిళలందరిలో కాదు కానీ.. ఆ భాగం సెన్సిటివ్‌గా ఉండే కొందరు మహిళల్లో మాత్రం నిపుల్స్ ముట్టుకుంటే తప్పనిసరిగా మూడ్ వస్తుంది.

6. అరగంట సెక్స్ = 150 క్యాలరీలు

అరగంట పాటు యాక్టివ్‌గా సెక్స్ చేస్తే 150 క్యాలరీలు కరిగించవచ్చు. ఇది చాలా మంచి వ్యాయామం కదా.

7. పిరియడ్స్ రెగ్యులర్ అవుతాయి..

రోజూ సెక్స్‌లో పాల్గొనే వారికి ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్య చాలా తక్కువగా ఉంటుంది.

8. చర్మాన్ని మెరిపిస్తుంది..

రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల చర్మం మెరుస్తుంది. మొటిమలు తగ్గుతాయి. మొత్తంగా చర్మ సమస్యలన్నీ దూరమవుతాయి. ఆనందంతో పాటు అందం కూడా. మరింక మనకేం కావాలి చెప్పండి?

9. మగవాళ్లూ నటిస్తారు..

చాలామంది స్త్రీలు సెక్స్ సమయంలో మూడ్‌లో ఉన్నట్లుగా నటిస్తుంటారని మనం వింటాం. కానీ మగవాళ్లు కూడా ఇలా చేయగలరట తెలుసా?

10. వర్కవుట్ తర్వాత సెక్స్ అద్భుతం..

సెక్స్‌లో పాల్గొనడానికి మంచి సమయం ఏదంటే అది వర్కవుట్‌లో పాల్గొన్న తర్వాతేనట. వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మన జననాంగాల వద్ద ఉండే రక్త ప్రసరణ వేగం ఎక్కువగా ఉంటుందట. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందే వీలుంటుంది.

11. సెక్స్ జలుబు, తలనొప్పులను తగ్గిస్తుంది.

సెక్స్‌లో పాల్గొంటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. జలుబు ప్రభావం తగ్గించడానికి దాన్ని వేగంగా తరిమికొట్టేందుకు కూడా సెక్స్ ఉపయోగపడుతుంది. సెక్స్ మన రోగనిరోధక శక్తిని కూడా మరింత బలోపేతం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలేవీ మనల్ని చుట్టుముట్టకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి.

సెక్స్ విషయంలో.. అబ్బాయిలకు ఉండే కలలు, కోరికలు ఇవే..

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

ఉమ్మడి కుటుంబంలో.. ఆలుమగలకు లైంగిక జీవితం కాస్త ఇబ్బందికరమేనా..?

Read More From Lifestyle