హైదరాబాద్‌లోని (Hyderabad) ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ.. ఈ సంవత్సరం నగరంలోని గణేశ్ చతుర్థి ఉత్సవాలను చాలా విభిన్నమైన రీతిలో ప్లాన్ చేసింది. ఇటీవలే ఇస్రో అంతరిక్షంలోకి పంపిన “చంద్రయాన్ 2 (Chandrayaan 2)” నౌకను ప్రేరణగా తీసుకొని వినాయకుడి విగ్రహానికి రూపకల్పన చేసింది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేపట్టిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక “చంద్రయాన్ 2”. దాదాపు రూ.960 కోట్లను ఈ నౌక తయారీకి ప్రభుత్వం వెచ్చించిందట.
ఈ సందర్భంగా ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ నిర్వాహకులు మాట్లాడుతూ “వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మేము 5 అడుగులు ఎత్తైన గణేశుడి విగ్రహానికి రూపకల్పన చేశాం. ఆ విగ్రహాన్ని శాటిలైట్ ఆకారం మధ్యలో కనిపించేలా డిజైన్ చేశాం. ఈ క్రమంలో ఒక లుక్ తీసుకురావడానికి.. దాదాపు 23.5 అడుగుల ఎత్తైన శాటిలైటును తయారుచేయాల్సి వచ్చింది. ఈ శాటిలైట్‌ను మొత్తం ఇనుముతో తయారుచేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే.. దీని బరువు దాదాపు 650 కేజీలు ఉంటుంది” అని తెలిపారు.
మిషన్ మంగళ్ చిత్రం కోసం.. “ఇస్రో శాస్త్రవేత్తలు”గా మారిన స్టార్ హీరోయిన్స్
“ఈ సారి వినాయక చవితి సందర్భంగా.. విద్యార్థులకు ఏదైనా ఒక కొత్త విషయం పట్ల ఆసక్తిని పెంచితే బాగుంటుందని భావించాం. అందుకే ఈ చంద్రయాన్ 2 కాన్సెప్ట్ ఎంచుకున్నాం. “చంద్రయాన్ 2″ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నంలో.. ఇస్రో శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. వారందరికీ మా శుభాకాంక్షలు. నిజాయతీగా శ్రమించిన వారి కష్టానికి ప్రతిఫలమే.. ఈ చంద్రయాన్ 2 నౌక” అని ఈ సందర్భంగా ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు.
అయితే “చంద్రయాన్ 2” థీమ్‌తో గణేశ్ విగ్రహాలను నెలకొల్పడం కేవలం హైదరాబాద్‌లోనే జరగలేదు. పూణె, ముంబయి, జార్ఖండ్ లాంటి ప్రాంతాలలో కూడా ఈ మాదిరి విగ్రహాలనే నెలకొల్పారు. ముంబైలోని లాల్‌బాగ్చా రాజా గణేష్ మండపంలో చంద్రయాన్ థీమ్‌తో మండపాలు డెకరేట్ చేశారు. అలాగే ఖుంటీ (జార్ఖండ్)లో రాకెట్ నమూనాలో ఒక గణేశ్ మండపాన్ని రెడీ చేశారు. భారత ప్రభుత్వం.. చంద్రయాన్ 2 ద్వారా సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుడుతోందని ఈ సందర్భంగా పలువురు అంటున్నారు.
ఇస్రో శాస్త్రవేత్త నంబి పాత్రలో మాధవన్
కాగా.. ప్రస్తుతం చంద్రయాన్ విజయావకాశాలపై అంతా సందిగ్ధత నెలకొంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్‌ను సాక్షాత్తు నరేంద్ర మోదీ దగ్గరుండి వీక్షించారు. ఇస్రో మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ ప్రాంగణం నుండి ఆయన ల్యాండింగ్‌ను సునిశితంగా గమనించారు. ల్యాండర్ నుండి సిగ్నల్స్ తెగిపోయిన తర్వాత.. ఆయన శాస్త్రవేత్తలతో మాట్లాడారు. శనివారం ఉదయం 1 గంట 38 నిముషాలకు చంద్రయాన్ 2 ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత 1 గంట 48 నిముషాలకు.. ల్యాండర్ వేగం తగ్గుతూ వచ్చింది. తర్వాత లోకల్ నావిగేషన్ జరిగింది.
మల్లేశం మూవీ రివ్యూ – ఇది ఓ సామాన్యుడి అసామాన్య ప్రయాణం
శాస్త్రవేత్తలు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు ఉదయం 1 గంట 53 నిముషాలకు చంద్రయాన్ 2 చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ సిగ్నల్స్ తెగిపోవడంతో.. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ అంతుబట్టలేదు. చంద్రయాన్ 1.. చందమామపై నీటి జాడల్ని కనుగొంటే.. చంద్రయాన్ 2 చంద్రుడి పై మట్టిని విశ్లేషించి.. అక్కడ జల ఆవిర్భావం గురించి తెలుసుకొనే లక్ష్యంతో అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
కాగా.. ఈ రోజు చంద్రయాన్ 2 సాఫ్ట్ లాంచ్‌లో అవాంతరం ఏర్పడిన తర్వాత.. ఇస్రో నుంచి భారత ప్రధాని మోదీ తన ఆలోచనలను పంచుకున్నారు. సైన్స్‌లో వైఫల్యం ఉండదని.. ప్రయోగాలు మాత్రమే ఉంటాయని.. మళ్లీ పైకి లేచి..సరికొత్త విజయాలను అందుకుంటామని తెలిపారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.