ADVERTISEMENT
home / Bollywood
మిషన్ మంగళ్ చిత్రం కోసం.. “ఇస్రో శాస్త్రవేత్తలు”గా మారిన స్టార్ హీరోయిన్స్

మిషన్ మంగళ్ చిత్రం కోసం.. “ఇస్రో శాస్త్రవేత్తలు”గా మారిన స్టార్ హీరోయిన్స్

భారతీయ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ‘మామ్’కి (మార్స్ ఆర్బిటర్ మిషన్)  ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో తయారుచేసిన ఈ శాటిలైట్‌ ఇది. మార్స్ గ్రహం చుట్టూ తిరుగుతూ అక్కడి సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగపడుతుంది.

మామ్ (MOM) మిషన్‌ని ఇస్రో శాస్త్రవేత్తలు దిగ్విజయంగా ప్రయోగించిన టీంలో.. అయిదుగురు మహిళలు కీలక శాఖల్లో పనిచేశారు. వారి పాత్రల ఆధారంగా ‘మిషన్ మంగళ్’ పేరిట హిందీలో ఒక చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో మహిళా శాస్త్రవేత్తలుగా విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సి పన్ను, కీర్తి కుల్హారి, నిత్యా మేనన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా; ఈ టీంకి ప్రాజెక్ట్ డైరెక్టర్ పాత్రలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో.. మనకు కనిపించే 5 ‘ఇస్మార్ట్’ విషయాలు..!

‘మిషన్ మంగళ్’ (Mission Mangal) చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు మామ్ ప్రాజెక్ట్‌ని ఎన్ని ప్రతికూలాంశాల మధ్య విజయవంతంగా లాంచ్ చేశారనేది కనిపిస్తుంది. అయితే వీటన్నిటినీ ఎదుర్కొని మన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని ఎలా విజయవంతం చేశారు అన్నది ఈ చిత్రంలో మనం చూడచ్చు.

ADVERTISEMENT

ఈ ట్రైలర్‌లో మరొక ఆసక్తికరమైన డైలాగ్‌ని అక్షయ్ కుమార్ పాత్ర చేత చెప్పించారు దర్శకులు. అదేంటంటే – “ప్రయోగం లేకపోతే సైన్స్ లేదు, అలాగే ప్రయోగాలు చేయకుండా మనల్ని మనం శాస్త్రవేత్తలు అని చెప్పుకోవడానికి అర్హులం కాము”.

ఈ ట్రైలర్‌లో అక్షయ్ కుమార్ పాత్ర పలికే డైలాగ్ ఇది. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఇలాంటి ప్రేరణ కలిగించే డైలాగ్స్ ఆయన పాత్ర చేత ఇంకా చాలా చెప్పించారట. ఆయన టీం‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు శక్తివంచన లేకుండా చేసే ప్రయత్నాలు అన్నీ మనం ఈ సినిమాలో చూడవచ్చు.

ఈ ట్రైలర్ లాంచ్‌లో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ – “ఇటువంటి ఒక చిత్రంలో నటించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలు తీసుకున్న వారిలో ఒకడిని నిలవడం కూడా నాకు గర్వంగా ఉంది. ఇంతటి ప్రేరణాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నానన్న ఆనందం నాకు ఎప్పటికీ ఉండిపోతుంది. అలాగే మామ్ ప్రాజెక్ట్ వ్యయం నేను నటించిన రోబో 2.0 చిత్రం బడ్జెట్ కన్నా.. 50 కోట్ల రూపాయలు తక్కువ అని తెలిసి చాలా ఆశ్చర్యపోయా. కచ్చితంగా ఇటువంటి అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని నేను మనసారా కోరుకుంటున్నాను..’’ అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు.

సాహోలో ఆ ఒక్క సీన్ కోసం.. ఎంత ఖర్చు చేశారో తెలిస్తే ఔరా అనకమానరు..!

ADVERTISEMENT

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న నటీమణులు కూడా ఈ కథ తమ వద్దకు వచ్చినప్పుడు.. ఎలాంటి సంకోచాలు లేకుండా నటించేందుకు పచ్చ జెండా ఊపేశారట. వీరిలో నిత్యామేనన్‌కి హిందీలో తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అంతేకాదు.. ఈ సినిమాలో నటిస్తోన్న కథానాయికల పాత్రలు దేనికవే ప్రాధాన్యమున్నవి కావడం మరో విశేషం.

‘మిషన్ మంగళ్’ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ వద్ద సహాయకుడిగా పనిచేసిన జగన్ శక్తి దర్శకత్వం వహించారు. జగన్ శక్తి సోదరి ఇస్రోలో శాస్త్రవేత్తగా పని చేసేవారట. మామ్ ప్రయోగానికి సంబంధించిన వివరాలు ఆమె ద్వారా తెలుసుకున్నారట. తర్వాత అదే అంశాన్ని కథగా మలిచి సినిమాగా తెరకెక్కించాలని భావించారట.

‘మిషన్ మంగళ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకి ఆగష్టు 15వ తేదీన రానుంది. ఇంతకుముందు ప్రభాస్ నటించిన సాహో చిత్రంతో ఇది పోటీ పడుతుంది అని అంతా భావించారు. కానీ కొన్ని కారణాల రీత్యా సాహో చిత్రం విడుదల వాయిదా పడడం.. ఈ చిత్రానికి కాస్త కలిసి వచ్చే అంశంగానే భావించవచ్చు.

ఐదుగురు మహిళా శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మక “మామ్” ప్రాజెక్టులో ప్రత్యేక పాత్ర పోషించి.. అతి తక్కువ ఖర్చుతో శాటిలైట్‌ని రూపొందించి భారతదేశ ఖ్యాతిని పెంచడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ గుర్తింపు సంపాదించారు. ఇలాంటి అద్భుతమైన కథతో మన ముందుకు వస్తోన్న ‘మిషన్ మంగళ్’ను వీక్షించేందుకు ఈ ఆగస్టు 15న మీరూ సిద్ధమైపోండి మరి..

ADVERTISEMENT

అందుకే తొందరగా పెళ్లి చేసుకున్నా: అనుష్క శర్మ 

18 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT