
ఈ రోజు రోల్డు గోల్డు నగలు లేదా గిల్టు నగలకు భారతదేశంలో ఉన్న మార్కెట్ అంతా ఇంతా కాదు. మేలిమి పసిడి ఆభరణాలను సైతం తలదన్నే రీతిలో ఈ గిల్టు నగలు తయారవుతున్నాయి. అలాగే మహిళలను కూడా విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మచిలీపట్నంలోని చిలకలపూడి కేంద్రంగా నడుస్తున్న గిల్టునగల పరిశ్రమ దాదాపు సంవత్సరానికి రూ.22 కోట్ల టర్నోవర్‌ని కలిగి ఉండడం విశేషం. ముఖ్యంగా సినీ పరిశ్రమతో పాటు ఫ్యాషన్ స్టూడియోల నుండి వీరికి వస్తున్న ఆర్డర్ల సంఖ్య ఎక్కువ.
బెనారసీ చీర గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?
ఒకప్పుడు ఈ నగలను సంప్రదాయ కళాకారులు తయారుచేసినా.. ఆ తర్వాత అధునాతన సాంకేతిక నైపుణ్యం పెరగడంతో ఇమిటేషన్ జ్యుయలరీకి సంబంధించిన కార్యకలాపాలు విస్తరించాయి. దాదాపు మచిలీపట్నంలోనే పదివేలకు పైగా కుటీర పరిశ్రమలు ఇమిటేషన్ జ్యుయలరీ తయారీకి శ్రీకారం చుట్టడం గమనార్హం. రూ. 50 నుండి రూ.1000 ధరలలో.. ఇక్కడ అన్ని రకాల గిల్టు నగలు లభించడం విశేషం. మారుతున్న కాలాన్ని బట్టి.. కొత్త ట్రెండ్‌కి తగిన విధంగా కూడా ఇక్కడ నగల రూపకల్పన జరుగుతుంది.
పెళ్లి సమయంలో ధరించే దుస్తులు, నగలు ఎలా ఉండాలంటే..? (నవ వధువుల చిట్కాలు)
చిలకపూడిలో తయారైన గిల్టు నగలు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. దాదాపు వందేళ్ల నుండే చిలకలపూడిలో ఈ పరిశ్రమ ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అనేకమందికి తమ తల్లిదండ్రుల నుండి వారసత్వంగా కూడా ఈ గిల్టు నగల వ్యాపారం రావడం విశేషం. ఈ నగల తయారీలో రాగి, ఇత్తడి లేదా జింక్‌ను ప్రధానంగా వాడతారు. అలా తయారైన నగలకు గోల్డ్ కోటింగ్ కూడా వేస్తారు.
ఈ గిల్టు నగలకు మెరుపు వచ్చేందుకు ఒక ప్రత్యేకమైన ద్రావకాన్ని వాడతారు. సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ వంటి రసాయనాలలో వీటిని కడుగుతారు. అనేకమంది స్వచ్ఛమైన బంగారానికి అచ్చమైన ప్రత్యమ్నాయంగా.. ఈ గిల్టు నగలను భావిస్తారు. ముక్కు పుడక దగ్గర నుండి కంఠాభరణాలు, హస్తాభరణాలు, వడ్డాణాల వరకు చిలకపూడి గిల్టు నగల షాపులలో అన్నీ లభిస్తాయి. అలాగే డ్రామా కంపెనీల కోసం ప్రత్యేకంగా కిరీటాలు, విల్లంబులాలు కూడా ఇక్కడ తయారుచేస్తారు.
మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ గురించి.. అమ్మ చేసే కామెంట్లు ఎలా ఉంటాయంటే..!
ఇటీవలి కాలంలో మచిలీపట్నం గిల్టు నగల తయారీదారుల సంఘం GI (Geographical Indicator) ట్యాగింగ్ కోసం దరఖాస్తు చేసింది. ప్రపంచంలోని ప్రఖ్యాత ప్రదేశాలను టూరిస్టులు లేదా సాధారణ జనం కనుగొనేందుకు ఈ GI ట్యాగింగ్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అయితే జీఐ రిజిస్ట్రీ ఆ దరఖాస్తును తిరస్కరించింది. సరైన చారిత్రక ఆధారాలు, రుజువులు చూపించే విషయంలో ఫెయిల్ అయన కారణంగా జీఐ ట్యాగింగ్ ఇవ్వలేమని రిజిస్ట్రీ తెలిపింది.
Featured Image: Indiamart.com
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.