Wedding

అతివల అందానికి నగిషీలు దిద్దే “ఏడు వారాల నగలు” .. వీటి రహస్యం మీకు తెలుసా..?

Babu Koilada  |  Nov 22, 2019
అతివల అందానికి నగిషీలు దిద్దే “ఏడు వారాల నగలు” .. వీటి రహస్యం మీకు తెలుసా..?

(Secret behind Seven Week Jewellery)

ఏడు వారాల నగలు. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ? తర తరాల నుండీ నవ గ్రహాల అనుగ్రహాన్ని పొందడానికి.. అలాగే ఆరోగ్య సిద్దిని కైవసం చేసుకోవడానికి ఈ నగలు ధరించేవారట. చిత్రమేంటంటే.. స్త్రీ, పురుషులిద్దరూ ఈ నగలు ధరించడానికి మొగ్గుచూపించేవారట. ఆదివారం నుండి శనివారం వరకు.. ఒక్కో వైవిధ్యమైన నగను ధరించడం ఈ సంప్రదాయంలోని ప్రత్యేకత. నవ గ్రహాల ఇష్టతను బట్టి కంఠహారములు, గాజులు, ముక్కు పుడకలు, కమ్మలు, వంకీలు, ఉంగరాలను ఈ క్రమంలో ధరించేవారు. 

మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ గురించి.. అమ్మ చేసే కామెంట్లు ఎలా ఉంటాయంటే..!

ఆదివారం – ఈ రోజు ఆ సూర్య దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కెంపులు, కమ్మలు, హారాలు ధరించడం ఆనవాయతీగా వస్తోంది. 

సోమవారం – ఈ రోజు చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి హారాలు, గాజులు ధరిస్తారు.

మంగళవారం – ఈ రోజు కుజుడిని ప్రసన్నం చేసుకోవడానికి పగడాల దండలు, ఉంగరాలు ధరించడం ఆనవాయతీగా వస్తోంది.

బుధవారం – ఈ రోజు బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి పతకాలు, గాజులను కచ్చితంగా ధరించాలి.

గురువారం – ఈ రోజు గురుడిని ప్రసన్నం చేసుకోవడానికి పుష్య రాగం, కమ్మలు, ఉంగరాలు ధరిస్తుంటారు.

శుక్రవారం – ఈ రోజు శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి వజ్రాల హారాలు, ముక్కుపుడకలు ధరిస్తారు. 

శనివారం – ఈ రోజు శని ప్రభావం పడకుండా నీలమణి హారాలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. 

ఈ ఏడు వారాల నగలను ధరించే సంప్రదాయం మనకు చక్రవర్తుల కాలం నుండీ వస్తోంది. ఒకప్పుడు రాణులు, పట్టమహిషులు మాత్రమే ఈ నగలను ధరించేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ దేవతా అనుగ్రహాన్ని పొందడం కోసం.. వ్యాపారులు, సామాన్య జనం కూడా ఈ నగలను చేయించి భద్రపరుచుకోవడం విశేషం. స్వర్ణకారులు ఎంతో నైపుణ్యంతో ఈ నగలను తయారుచేస్తారని అంటారు. ఇక ఏడు వారాల నగలలో కాసుల పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. టెంపుల్ జ్యుయలరీలో కూడా ఒక విభిన్నమైన స్థానాన్నే కైవసం చేసుకుంది. 

పెళ్లి సమయంలో ధరించే దుస్తులు, నగలు ఎలా ఉండాలంటే..? (నవ వధువుల చిట్కాలు)

 

ఒకప్పుడు అమ్మవారి దేవాలయాలకు భక్తులు ఈ ఏడువారాల నగలను కానుకలుగా కూడా సమర్పించేవారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో కూడా.. అమ్మవారి కోసం ప్రత్యేకంగా చేయించిన ఏడు వారాల నగలున్నాయి. అలాగే నవరత్నాలు పొందిన ఏడు వారాల నగలను కలిగియుండడం ఏ అతివకైనా స్టేటస్ సింబలే. ఈ మధ్యకాలంలో ఈ నగలను కొనుగోలు చేసే కస్టమర్స్ కోసం బంగారు షాపులు పలు ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి. ఖరీదైన వజ్ర, వైడూర్యాలతో కూడిన నగలను వివిధ డిజైన్లలో సరఫరా చేస్తున్నాయి. 

బంగారాన్ని తలదన్నే గిల్టు నగలు కావాలా.. అయితే ఛలో మచిలీపట్నం..!

నిండుగా కనిపించాలనే కోరికతో.. ఈ ఏడు వారాల నగలను ఒకే రోజు ధరించేవారు కూడా ఉన్నారు. అలాగే సెలబ్రిటీ ఫోటో షూట్లకు, జ్యుయలరీ ఫ్యాషన్ షోలకు కూడా అప్పుడప్పుడు ఈ నగలను వాడుతున్నారు. ఏదేమైనా.. ఒక సంప్రదాయానికి, కళకి, సంస్కృతికి ఈ నగలు ఆలవాలమని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ రోజు గ్రహాల అనుకూలం కోసం రాళ్లను, ఉంగరాలను వాడుతున్నారు. కానీ ఈ సంప్రదాయం కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏడు వారాల నగలతో ప్రారంభమైందంటే అతిశయోక్తి కాదు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.                                       

Read More From Wedding