దీపావళి పండగ పేరు గుర్తుకు రాగానే వెంటనే మనసులో మెదిలేది దీపాల వెలుగులు, టపాసుల చప్పుడ్లు & అందాల బొమ్మల కొలువులు సందడ్లు. అలాంటి దీపావళి పండుగని మనము ఎందుకు జరుపుకుంటాము అని అంటే, అందుకు కారణంగా రెండు రకాలైన సంఘటనలు చెబుతుంటారు.
Table of Contents
అందులో ఒకటి శ్రీకృష్ణుడికి – నరకాసురుడికి జరిగిన యుద్ధంలో నరకాసురుడిని.. సత్యభామ సంహరించడంతో ప్రజలు ఆనందోత్సాహాలని దీపాలతో జరుపుకోగా అది దీపావళి పండుగకి అంకురార్పణ జరిగింది. ఇంకొకటి ఏంటంటే – సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని అంతమొందించి రాముడు తన భార్య & తమ్ముడితో కలిసి అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా అయోధ్య ప్రజలు తమ ఆనందాన్ని పండుగ రూపంలో జరుపుకోగా అదే దీపావళి అయిందని చెబుతుంటారు.
బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!
అలా ఈ రెండు నేపధ్యాల కారణంగా దీపావళి పండుగకి అంకురార్పణ జరిగింది. ఇక ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా ఇంటిలో పిండి వంటలు, తీపి పదార్ధాలు చేసి వాటిని దేవుడికి నైవేధ్యంగా పెట్టడం జరుగుతుంటుంది. అలాగే ఈ దీపావళి సందర్భంగా చాలామంది భక్తులు లక్ష్మి పూజ చేస్తుంటారు. లక్ష్మి దేవి తమ పట్ల కరుణ చూపాలని ప్రార్ధించే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఇక చిన్న పిల్లలు ఎక్కువగా టపాసుల పండుగగానే ఈ దీపావళి పండుగని చూస్తారు. టపాసులు పేల్చుతూ దీపావళి రోజున ఆనందంగా గడుపుతుంటారు.
ఇక ఈ వెలుగుల పండుగ సందర్భంగా మీ ఆత్మీయులకు, బంధువులకి & సామజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలిపేందుకు కావాల్సిన సందేశాల్ని & కొటేషన్స్ ని ఈ క్రింద తెలపడం జరిగింది. ఒకసారి ఈ క్రింద చూడవచ్చు.
Happy Diwali Greetings (In English)
దీపావళి శుభాకాంక్షలు (Diwali Wishes)
దీపావళి పండుగని పురస్కరించుకుని తెలపగలిగే 15 రకాల శుభాకాంక్షలు ఇవే…
1. మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు
2. ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
3. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ… దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
4. దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
5. దీపావళికి పెట్టె దీపాల కాంతులతో మీ ఇల్లు శోభాయమానంగా వెలిగిపోవాలని ఆశిస్తూ.. మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.
6. ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ మనస్సులో ఉన్న చీకటి పోయి ఆ స్థానంలో వెలుగు నిండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
7. ఈ దీపావళి పండుగను మీ పిల్ల పాపలతో హాయిగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
8. దీపావళి సందర్భంగా వెలిగించే దీపాలు మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.
9. దీపావళి అంటే వెలుగులు పంచె పండుగ అని ఎన్నటికి మర్చిపోకండి.
10. దీపావళి రోజు మీరు వెలిగించే దీపాలు మీ ఒక్కరి జీవితాల్లోనే కాకుండా మీ పక్కవారి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కోరుకుందాం.
11. ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకునేవారందరికి మా హృదయావూర్వక శుభాకాంక్షలు.
12. ఈ దీపావళి పండుగ మీకు అన్నివిధాలుగా కలిసి రావాలని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
13. దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఆ వెలుగుల్లో మీ జీవితాలు మరింత ప్రకాశవంతంగా అవ్వాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
14. వెలుగులతో నిండిన ఈ దీపావళి వేళ, మీరందరూ ఆనందాల్లో మునిగితేలాలని మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నాము.
15. ఈ దీపావళి సందర్భంగా వెలిగించే దీపాల వెలుగులు మీకు జీవితంలో సరైన మార్గాన్ని చూపెట్టాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
ఇవి దీపావళి పండుగ సందర్భంగా తెలిపే శుభాకాంక్షలు.
తెలుగులో దీపావళికి అవుట్‌ఫిట్ ఐడియాస్ కూడా చదవండి
దీపావళి కొటేషన్స్ (Diwali Quotes)
దీపావళి పండుగ సందర్భాన్ని & ఈ పండుగ యొక్క విశిష్టతని తెలిపేందుకు సంబందించిన కొటేషన్స్ ని ఇక్కడ చూడవచ్చు.
1. నరకాసురుని వధించి
నరులందరి జీవితాలలో వెలుగును నింపిన
మాత సత్య శౌర్యానికి
చెడు పై మంచి విజయానికి ప్రతీక
ఈ దీపావళి
2. దీపావళి అనగానే మీకు గుర్తుకురావాల్సింది టపాసులు కాదు దీపాల వెలుగులు. ఆ వెలుగులతోనే మీ ఇంటికి అందమైన కళ వస్తుంది.
3. ప్రతి పండగ మనలో ఆనందాన్ని నింపితే, ఈ దీపావళి పండుగ మాత్రం ఆనందంతో పాటు వెలుగుని కూడా నింపుతుంది.
4. చీకటి వెలుగుల రంగేళి జీవితమే దీపావళి.
5. మన జీవితాలలో వెలుగును నింపే నిత్య సంతోష సరగావళి ఈ దీపావళి
6. తీయని నేతి మిఠాయిలతో, వెలుగొందే టపాసులతో, అందరూ కలిసి నవ్వుతూ ఉండే పండుగే ఈ దీపావళి.
7. అనురాగలరళి – ఆనందాల రవళి
ప్రతిఇంట జరగాలి – ప్రభవించే దీపావళి
8. మనలోని అజ్ఞాన చీకట్లని పారద్రోలి మన జీవితాల్లో వెలుగులు నింపేదే ఈ దీపావళి.
9. జీవితంలో ఉండే అజ్ఞానాంధకారములని తోలిగిస్తు… వాటి స్థానంలో చిరుదివ్వెలు వెలిగించడమే దీపావళి.
10. దీపావళి అంటేనే దీపకాంతుల జ్యోతులు, సిరిసంపద రాసులు, టపాసుల వెలుగులు.
11. దీపాల వరుస దీపావళి, నవ్య ఆనంద అరావళి, మన జీవితాలలో వెలుగు నింపే సంతోషాల సారావళి… ఈ దీపావళి.
12. అంధకార చీకట్లని తరిమి నూతన వెలుగులకు స్థానమిద్దాం… మన హృదయాంతరాల్లో గూడుకట్టుకున్న చీకటిని ఈ వీలుగులతో పారద్రోలుదాం.
13. వెలుగంటే చీకటికి భయం… అందుకే మన మనసులో ఉన్న చీకటి అనే భయాన్ని దీపావళి వెలుగుతో పోగొడదాం.
14. చీకటి పై వెలుగు విజయమే ఈ దీపావళి…. మనసులోని చెడుని పారద్రోలి మంచిని పెంపొందించడమే ఈ దీపావళి పండుగ ప్రత్యేకత.
15. దీపావళి అంటే టపాసుల శబ్దాలే కాదు దీపాల వెలుగులు కూడా!!
ఇవి దీపావళి పండుగ సందర్భంగా.. ఈ పండుగ విశిష్టతని తెలిపే కొటేషన్స్.
ఈ ప్రముఖ జలపాతాలు.. భారతదేశంలో ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా?
దీపావళి సందర్భంగా స్నేహితులకి పంపించే సందేశాలు (Diwali Messages For Friends)
దీపావళి పండుగ సందర్భంగా మన మిత్రులకి & బంధువులకి పంపదగిన పండుగ శుభాకంక్షాలు ఇవే –
1. కోటి మతాబుల కాంతి కళ్ళలో నింపుకుని నా ఎదురుగా నువ్వుంటే…
ఇంకా వేరే దీపావళి నాకెందుకు ప్రియ…
2. నీ ముఖంలోని వెలుగులు… ఈ దీపంతల వెలుగులు నాకు ఒకేలా అనిపిస్తున్నాయి. నాకు ఒకేరోజు రెండు దీపావళిలు చేసుకుంటున్నటుంది.
3. మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు ఈ దీపావళి వెలుగుల్లో కనుమరుగవ్వాలని కోరుకుంటూ మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.
4. దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు.. సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు..- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
5. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి. – మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
6. ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు.. సరికొత్త వెలుగులతో మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ..
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
7. ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు.. ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం! – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
8. ఈ దీపావళి మీ ఇంట.. కురిపించాలి సిరులు పంట.. మీరంతా ఆనందంగా ఉండాలంట.. అందుకోండి మా శుభాకాంక్షల మూట..
9. దివ్య కాంతుల వెలుగులు.. అష్టైశ్వర్యాల నెలవు.. ఆనందాల కొలువు.. సర్వదా మీకు కలుగు.. – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
10. అజ్ఞాన చీకట్లను పారద్రోలి.. మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
11. దీప కాంతుల జ్యోతులతో.. సిరిసంపదల రాశులతో… టపాసుల వెలుగులతో … మీ ఇల్లు కళకళలాడాలని కోరుకుంటూ మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.
12. ఈ దీపావళి మీ ఇంట వెలుగులతో పాటు ఆనందం కూడా నింపాలని ఆకాంక్షిస్తూ మీ ఇంటిల్లిపాదికి వెలుగుల పండుగ శుభాకాంక్షలు.
13. కష్టాలలో మా వెన్నంటే ఉండి… మా జీవితాల్లో వెలుగులు నింపిన మీకు ఈ వెలుగుల పండగైన దీపావళి శుభాకాంక్షలు.
14. దీపావళి అనగానే గుర్తొచ్చే దీపకాంతులు… మంచి మనుషులు అనగానే గుర్తొచ్చేది మీ కుటుంబసభ్యులు… ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటి వారంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు పండగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
15. పేరుకి స్నేహితుడివే అయినా…. నా ప్రతి కష్టంలో నేను అడగకుండానే, నా వెన్నంటే ఉన్నావు… నేను కోరకుండానే నా వెనుక నిలబడ్డావు… అటువంటి నీవు జీవితంలో ఎల్లప్పుడూ వెలుగులు ఉండాలని కోరుకుంటూ నీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.
ఇవి దీపావళి పండుగ సందర్భంగా మన స్నేహితులకి, బంధువులకి పంపించగలిగే పండుగ శుభాకాంక్షలు.
దీపావళి సందేశాలు (Diwali Status For WhatsApp)
దీపావళి పండుగ పురస్కరించుకుని మీ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోదగిన 15 సందేశాలు ఇవే …
1. లక్ష్మి మీ ఇంట నర్తించగా, సంతోషం పాలై పొంగగా దీపకాంతులు వెలుగునీయగా ఆనందంగా జరుపుకోండి దీపావళి పండుగ…
2. ఈ దీపావళి మీ ఇంట కురిపించాలి సిరులపంట.. ఆ సిరులు మీ జీవితాల్లో నింపాలి ఆనందాల హేల…
3. దుష్టశక్తులను పారద్రోలి కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే ఈ వెలుగుల రోజే దీపావళి పండుగ…
4. టపాసులు కాల్చుతూ.. దీపాలు వెలిగిస్తూ… అంగరంగవైభవంగా ఈ దీపావళి పండుగ జరుపుకోండి.
5. ఈ దీపావళి రోజున.. దీపాల వెలుగులతో పాటుగా అందాల బొమ్మల కొలువుతో మా ఇల్లు కళకళలాడుతుంది.
6. ఈ దీపావళి పండుగ సందర్భంగా.. దీప కాంతులతో మీ ఇల్లు దేదీప్యమానంగా వెలుగుతుండాలని ఆశిస్తున్నాను.
7. దీపావళి పండుగ శుభవేళ, మీరంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.
8. దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. ఈ వెలుగులు మీ ఇంటిలోనే కాకుండా మనస్సులో సైతం వెలుగులు ప్రసరింప చేయాలని
9. అందాల బొమ్మల కొలువులు, దీపాల వెలుగులు & టపాసులు సందడ్లు.. మీ దీపావళిని మరింత ఆనందంగా జరిగేలా చూడాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
10. మీ జీవితంలో కాంతులు నింపడానికి వచ్చేదే ఈ దీపావళి పండుగ… అటువంటి ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ కుటుంబసభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు.
11. ఈ దీపావళి సందర్భంగా మీరు జీవితంలో సాధించాలి అని అనుకున్నవి మీకు లభించాలి అని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
12. ఈ దీపావళికి వెలిగించే దీపాలు.. మీకు ప్రశాంతతో పాటుగా ఆనందాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
13. దీపావళి పండుగ సందర్భంగా వినిపించే టపాసుల శబ్దం మీలోని భయాన్ని పారద్రోలితే… వెలిగించే దీపాలు మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని ఆశిస్తూ మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
14. దీపావళి పండుగ అంటేనే ఠక్కున గుర్తిచేది దీపాల వెలుగులు. మరి ఆ దీపాల వెలుగులు మీ జీవితంలో ఉండే సమస్యలకి ఒక పరిష్కార మార్గం చూపుతాయని ఆశిస్తూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
15. దీపాల వెలుగులు, టపాసుల సందడ్లు, బొమ్మల కొలువుల ఆనందాలు.. ఈ దీపావళి పండుగ రోజున మీకు అమితమైన ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
ఈ దీపావళి పండుగ సందర్భంగా వాట్సాప్ స్టేటస్ కి సంబందించి 15 రకాల సందేశాలు పైన తెలపడం జరిగింది.
ఆఖరుగా ఈ కాంతులు నింపే దీపావళి పండుగ మీ జీవితాల్లో కూడా అనేక కాంతులు నింపాలని మనసారా కోరుకుంటూ… మరొక్కమారు మీ అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు మా POPxo తెలుగు తరపున తెలియచేస్తున్నాము.
పూలను పూజించే బతుకమ్మ.. శక్తిని ఆరాధించే దసరా (Everything about Bathukamma and Dussehra)