కొత్త ఏడాది ప్రారంభం కాగానే చాలామంది తీసుకునే తీర్మానాల్లో ఆరోగ్యం గురించే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన (healthy) ఆహారం తీసుకోవడం వంటివి ప్రారంభించాలని తీర్మానం తీసుకోవడం సులభమే. కానీ దాన్ని ఫాలో అవ్వడం అనుకున్నంత సులభమేమీ కాదు. రోజువారీ హడావిడి లైఫ్‌స్టైల్లో ఉదయం పరుపరుగున వెళ్లడం, సాయంత్రం అలసిపోయి రావడం సహజం. ఇలాంటప్పుడు ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం హెల్తీ స్నాక్స్ (snacks) చేసుకోవడానికి సమయం ఎక్కడిది.. అందుకే వారాంతంలో తయారుచేసుకొని.. రోజూ తీసుకోగలిగే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ గురించి తెలుసుకుందాం రండి..
1. ఫ్రూట్ యోగర్ట్
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునేవారు బజార్లో దొరికే ఫ్రూట్ యోగర్ట్ బౌల్ కొనుక్కొని తీసుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఇందులో చక్కెర ఎక్కువగా ఉండడంతో పాటు.. ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అందుకే దీని బదులుగా వారానికోసారి ఇంట్లోనే ఫ్రూట్ యోగర్ట్ తయారుచేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. రోజూ ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి వీలుంటుంది. ఇందులో గ్రనోలా, ఓట్స్, క్వినోవా.. ఇలా మనకు నచ్చిన ఆరోగ్యకరమైన పదార్థాలతో పాటు పండ్లను కూడా వేసుకోవడం వల్ల సహజమైన తీపిదనం పొందవచ్చు.
2. చిలగడదుంప చిప్స్
చాలామందికి సాయంత్రాలు టీవీ చూస్తూ చిప్స్ తినడం అలవాటు. బంగాళాదుంప చిప్స్ అలా తినీ తినీ లావయిపోతూ ఉంటారు. ఇలాంటివారు బంగాళాదుంపకు బదులుగా.. చిలగడదుంప చిప్స్ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటిని కూడా నూనెలో వేయించకుండా బేక్ చేయాల్సి ఉంటుంది. సింపుల్‌గా త్వరగా చేసుకోదగిన ఈ చిప్స్‌ని గాలిచొరబడని డబ్బాలో ఉంచితే కొన్నివారాల పాటు నిల్వ ఉంటాయి.
3. హమ్ముస్
ఉదయాన్నే శాండ్‌చిచ్ లేదా బ్రెడ్ జామ్ తినేస్తున్నామని చాలామంది అనుకుంటారు. కానీ అది ఎంతవరకూ ఆరోగ్యకరమో ఆలోచించరు. శాండ్ విచ్‌లో వేసుకొనే నోరూరించే సాస్‌లతో పాటు.. మనం తినే జామ్‌లు మన శరీరానికి మంచివి కావు. అందుకే కనీసం వారానికోసారి హమ్ముస్ తయారుచేసి పెట్టుకుంటే కేవలం శాండ్‌విచ్‌లకే కాదు.. ఏదైనా చిప్స్ లేదా సలాడ్ తినాలన్నా కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు.
4. బరిటో ఇన్ జార్
ఆరోగ్యకరమైన కూరగాయలు, ఇతర పదార్థాలతో చేసే బరిటో రోల్స్ గురించి మనకు తెలిసిందే. చాలామంది వీటిని భోజనంలో భాగం చేసుకోవడం కూడా మనం చూస్తుంటాం. మీరూ వీటిని తినాలనుకుంటే దాన్ని జార్‌లోనే ముందుగా తయారుచేసి పెట్టుకోండి. సాల్సాలాగా కూరగాయలు, సాస్‌తో సిద్ధంచేసి పెట్టుకొని కావాలంటే చపాతీతో రోల్ చేసి తినండి. లేదంటే అలాగే తిన్నా రుచికరంగానే ఉంటుంది. పైగా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. సోర్ క్రీమ్ వంటివి రుచిని పెంచితే.. ఇందులో కిడ్నీ బీన్స్, కూరగాయలు శరీరానికి పోషకాలను అందిస్తాయి.
5. నోరూరించే సలాడ్
రోజూ కనీసం ఒకపూటైనా ఆరోగ్యకరమైన సలాడ్ తీసుకుంటే మంచిదని చాలామంది భావిస్తారు. కానీ కొంతమందికి సలాడ్ తయారుచేసుకోవడానికి కూడా సమయం ఉండదు . ఒకవేళ సమయం ఉన్నా ఒక్కోసారి అలసట వల్ల కూడా.. అప్పటికప్పుడు సులువుగా చేసుకునే ఫాస్ట్‌ఫుడ్‌పై ఆధారపడతారు. అందుకే నోరూరించే సలాడ్‌ని ఇలా మేసన్ జార్లలో వారానికోసారి తయారుచేసి పెట్టుకుంటే ప్రయాణాల్లో కూడా సులువుగా వీటిని తీసుకోవచ్చు.
6. పాప్‌కార్న్ బ్రొకొలీ
బ్రొకొలీ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. కానీ దీన్ని చాలామంది ఇష్టపడరు. అయితే ఈ బోరింగ్ వంటకాన్ని కూడా రుచికరంగా మార్చుకొని తీసుకోవచ్చు. దీన్ని కూడా వారానికోసారి చేసుకొని రోజూ తీసుకోవచ్చు.
మీకు జిలేబీలు అంటే ఇష్టమా..? అయితే ఈ టాప్ 10 వెరైటీలు ట్రై చేయండి
7. వేయించిన శెనగలు
చాలామంది పాప్‌కార్న్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది ఆరోగ్యకరమైనదే అయినా.. ఇందులో చేర్చే ఫ్లేవర్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే పాప్‌కార్న్‌కి బదులుగా వేయించిన శెనగలు తీసుకోవడం మంచిది. దీనికోసం నానబెట్టిన శెనగలను నూనెలేకుండా లేదా చాలా తక్కువ నూనె వేసి వేయించుకోవాలి. మసాలా వేసి తీసుకుంటే మీరు సాయంత్రం సమయంలో తీసుకునేందుకు ఆరోగ్యకరమైన స్నాక్ సిద్ధం.
మీరు సమోసా ప్రియులా.. అయితే ఈ టాప్ 10 స్పెషల్స్ వెంటనే టేస్ట్ చేసేయండి..!
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.