Astrology

మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ ఫ్యాక్టర్ ఎలా ఉందో చూడండి..!

Sridevi  |  Apr 26, 2019
మీ రాశిఫలాలు వీక్షించండి.. మీ లక్ ఫ్యాక్టర్ ఎలా ఉందో చూడండి..!

ఈ రోజు (ఏప్రిల్ 27) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

 

మేషం (Aries) –  మీరు కన్న కలలను సాకారం చేసుకునే శక్తి, సామర్థ్యాలు మీ సొంతం. అయితే వాటిని ఎలా నిజం చేయాలన్నది మాత్రం ముందుగా మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మీ ప్రయత్నాన్ని బట్టే ఫలితం సిద్ధిస్తుందనే విషయాన్ని మీరు నమ్మాలి.

వృషభం (Tarus) – మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీరు పొందుతారు. అది మీకు విజయాన్ని, సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. మీ లక్ష్యాన్ని మాత్రం వీడకండి.

మిథునం (Gemini) – మీకున్న ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దానిని ఇతరులకు పంచడం కూడా మీరు ప్రారంభిస్తారు. అయితే మీరు మరిన్ని విజయాలు సాధించడమే కాదు.. మరింత నాలెడ్జ్ కూడా పొందాల్సి ఉంది. ఎందుకంటే ఏ విషయమూ పూర్తిగా ఏదీ తెలుసుకోండా… ఇతరులకు సలహాలు ఇవ్వడం వల్ల చిక్కులొస్తాయి. కనుక నిజాయతీగానే మీ టాలెంట్‌కు సాన పెట్టండి.

కర్కాటకం (Cancer) – ఇటీవలే జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి మీ మెదడులో అనేక ప్రశ్నలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మీలో ఏదో మార్పు వచ్చినట్లు మీరు భావిస్తున్నారు. ఒంటరిగా సమయం గడిపి ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే ఓ స్పష్టత వస్తుంది. ఆ తర్వాత.. మీ వివేకమైన నిర్ణయం తీసుకోగలుగతారు. 

సింహం (Leo) – మీ విషయంలోనే కాదు.. ఇతరుల విషయంలో కూడా సహనంతో వ్యవహరించినప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. అన్నింటినీ మీరు కంట్రోల్ చేయాలని ప్రయత్నించకండి. అది సరికాదు. కొన్నిసార్లు మన ఓర్పు మాత్రమే మనల్ని కాపాడుతుంది. 

క‌న్య (Virgo) – మిమ్మల్ని ఓ విషయం బాధించవచ్చు. కానీ దాని గురించే పదేపదే ఆలోచిస్తూ బాధపడకుండా .. దానిని అంతటితో వదిలేయడం మంచిది. అలా చేయడం ద్వారా మీ మనసుకు సాంత్వన లభిస్తుంది. 

తుల (Libra) – మీ ఈగోని పూర్తిగా పక్కన పెట్టండి. అలాగే మీ పాత అలవాట్లు కూడా కొన్నింటిని తప్పకుండా మార్చుకోవాలి. అప్పుడే మీ జీవితానికి అవసరమైన ఒక పాజిటివ్ పునాదిని మీరు నిర్మించుకోగలరు. మీ గమనానికీ బాటలు వేసుకోగలరు. 

వృశ్చికం (Scorpio) – మీ వ్యక్తిగత లేదా ఉద్యోగ జీవితాన్ని మీరు ప్రారంభిస్తున్నారా? ఇంతకు ముందెన్నడూ చేయని పని చేయడం ద్వారా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి.

ధనుస్సు (Saggitarius) – మీ జీవితంలో ఇప్పుడు ఏమీ మార్చుకోవద్దు. మీ కెరీర్, ఫైనాన్స్, ప్రేమ.. అన్నీ సక్రమంగా సాగుతున్నాయి. మీరు సరైన దిశలోనే వెళ్తున్నారు. ఇలాగే కొనసాగించండి.

మకరం (Capricorn) – మీరు ఇప్పటివరకు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకునే సమయం వచ్చింది. మీరు కోరుకునే ప్రమోషన్, గౌరవమర్యాదలు, సంపద.. అన్నీ మిమ్మల్ని చేరుతాయి. ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత మంచి సమయం మొదలైంది. కానీ దానిని నిలబెట్టుకొనే అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంది. 

కుంభం (Aquarius) – మీరు చేసే పనుల ప్రకారమే మీకున్న లక్ష్యాలను చేరుకునే వీలుంటుంది. కాబట్టి మీ వద్ద ఉన్న సమయం, శక్తిసామర్థ్యాల మేరకే పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మల్టీటాస్కింగ్ జోలికి వెళ్లకండి.

మీనం (Pisces) – మిమ్మల్ని భయపెట్టే వాటి నుంచి దూరంగా పారిపోవడం కాకుండా వాటిని సవాల్‌గా స్వీకరించి అధిగమించడానికి ట్రై చేయండి. మీరు చేయాలనుకున్న పనులను భయం కారణంగా వెనకడుగు వేస్తూ చేయడం ఆపేయకండి.

Credit: Asha Shah

ఇవి కూడా చదవండి

నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత లక్ష్యాలను సాధించుకోండి..!

ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి – మీ లక్ష్యసాధనలోని ఆటంకాలను తొలిగించుకోండి

నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత లక్ష్యాలను సాధించుకోండి..!

Read More From Astrology