నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత లక్ష్యాలను సాధించుకోండి..!

నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత లక్ష్యాలను సాధించుకోండి..!

ఈ రోజు (ఏప్రిల్ 25) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – మీరు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ప్రారంభించినా అది త్వరగా పూర్తి కావడం మాత్రమే కాదు.. తప్పకుండా సక్సెస్ అవుతుంది. అలాగే మీ బంధాలకు సంబంధించి కూడా ఒక శుభవార్త వింటారు. ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి.


వృషభం (Tarus) – మీ ఆరోగ్యం త్వరలోనే మెరుగవుతుంది. మీ ఆలోచలను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రయత్నించండి. మీకున్న ఆత్మబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. అప్పుడే విజయం మీ సొంతమవుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి


మిథునం (Gemini) – మీ భవిష్యత్తు త్వరలో మారనుంది. అయితే అది ఏ విధంగా అయినా కావచ్చు. కానీ వచ్చే మార్పు మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి అనారోగ్యకరమైన బంధాల నుంచి దూరం జరగండి.


కర్కాటకం (Cancer) – మీరు త్వరలోనే ఒక శుభవార్త వింటారు. ప్రస్తుతం మీకు అంతా శుభసమయం నడుస్తోంది. కాబట్టి కొత్త వ్యాపారం లేదా ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఇది సరైన సమయం.


సింహం (Leo) – మీ క్రియేటివిటీ మీకు విజయాన్ని అందిస్తుంది. కాబట్టి మీ వద్దకు వచ్చే ప్రతి అవకాశంపై ఓ కన్నేసి ఉంచండి. కొత్త కెరీర్ ప్రారంభించడానికి మార్గాన్ని సుగమం చేసుకోండి. అయితే ఈ విషయంలో కాస్త సహనం కూడా ఉండడం ముఖ్యమే. అది మిమ్మల్ని అత్యవసరమైన పరిస్థితుల్లో కాపాడుతుంది.


క‌న్య (Virgo) – మీ చుట్టూ ఉన్న పరిస్థితులను త్వరగా అర్థం చేసుకొని.. వాటిని సద్దుమణిగేలా చేసేందుకు తగిన నిర్ణయం తీసుకోవడంలో మీరు సిద్ధహస్తులు. అయితే రానున్న రోజుల్లో మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండండి.


తుల (Libra) – మీరు తప్పించుకోలేని ఒక పరిస్థితి మీకు ఎదురుకానుంది. ప్రమాదం లేదా ట్రాప్ లేదా స్కామ్.. ఏదైనా కావచ్చు. మీరు ఓ విపత్కరమైన పరిస్థితిలో చిక్కుకోనున్నారు. అయినా అధైర్యపడవద్దు. సాధ్యమైనంత వరకూ నిజాయతీగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. మీ తప్పు లేనప్పుడు.. ఎక్కడా రాజీ పడవద్దు. మీ చేతుల్లో లేని అంశం ఒకటి మీ జీవితాన్ని ప్రభావితం చేయనుంది. జాగ్రత్త..


వృశ్చికం (Scorpio) – మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు త్వరలోనే అందనుంది. అంతేకాదు.. త్వరలోనే మీరు ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించనున్నారు. సమస్యలకు మీరు కోరుకునే పరిష్కారాలు లభిస్తాయి.


ధనుస్సు (Saggitarius) – మీరు వెళ్లే దారిలో సవాళ్లు ఉండవచ్చు. కానీ మీ లక్ మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. దానిపై ఆధారపడే మీరు చేసే పనుల ఫలితం ఉంటుంది. అయితే ప్రణాళిక ప్రకారం పని చేయండి. తప్పకుండా చక్కని ఫలితం ఉంటుంది.


మకరం (Capricorn) – చిన్న చిన్న విషయాల్లో విజయం సాధించడం ద్వారా కలిగే ఆనందాన్ని ఆస్వాదించండి. మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు అందించే సహాయ, సహకారాలతో ముందుకు వెళ్లండి. మీరెప్పుడూ ఒంటరి కాదని గుర్తించండి.


కుంభం (Aquarius) – మీరు ప్రస్తుతం చాలా సంతోషకరమైన సమయాన్ని గడుపుతున్నారు. మీకు అందుతున్న అవకాశాలు, వద్ద ఉన్న వనరులు అన్నింటిలో మీకు బాగా నచ్చినవి, మీరు రుణపడి ఉండే వాటి గురించి రోజూ లిస్ట్ రాయండి. మున్ముందు మరింత సంతోషాన్ని పొందుతారు.


మీనం (Pisces) – మీ కంటూ కొన్ని కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాకారం చేసుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించండి. రిస్క్ తీసుకోండి. ఏదైనా కొత్తగా ప్రయత్నించడం వల్ల మీలో కూడా నూతన ఉత్సాహం కూడా వచ్చి చేరుతుంది.


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ రోజు రాశిఫలాలు వీక్షించండి - మీ లక్ష్యసాధనలోని ఆటంకాలను తొలిగించుకోండి


ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!


పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా...?