పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల (Arranged marriage)లో కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి పెళ్లికి ముందు అబ్బాయి గురించి అమ్మాయి, అమ్మాయి గురించి అబ్బాయి తెలుసుకునేంత సమయం కూడా ఉండకపోవచ్చు. కానీ పూర్తిగా వివరాలు తెలియని ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాలంటేనే చాలా ఇబ్బంది ఫీలవుతూ ఉంటారు అమ్మాయిలు. అలాంటిది తొలిరేయి నాడు వారితో శారీరకంగా కలిసే క్రమంలో ఇంకెంత ఇబ్బందిగా అనిపిస్తుంది?
అలాగని ఎక్కువ కాలం వారి నుంచి దూరంగా ఉండలేరు కదా! తొలిరేయి నాడైనా లేక కొద్ది రోజుల తర్వాత అయినా సరే.. ఆలుమగలిద్దరూ కలిసి సంతోషంగా తమ జీవితాన్ని ప్రారంభించాల్సిందే! ఇందుకోసం దంపతుల్లో ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించుకోవాల్సిందే. రెడిట్‌లో కొందరు మహిళలు తమ తొలిరేయి అనుభవాల గురించి పంచుకున్నారు. అయితే వీరి వివాహాలు పెద్దలు కుదిర్చినవే కావడం విశేషం. మరి, ఆ అనుభవాలేంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..
అంతా స్మూత్‌గా జరిగిపోయింది
రెడిట్‌లో హనీమూన్ సూట్ ఇచ్చిన జవాబు: మా పెళ్లికి మూడు నెలల ముందు నేను నా భర్తను కలిశాను. మా తొలిరేయి అనుభవం గురించి మీరు నన్ను అడిగితే అది చాలా బాగా జరిగిందనే చెప్తాను. ఆ రోజు పెళ్లి తంతు అంతా ముగిసిన తర్వాత ఇద్దరం బాగా అలసిపోయాం. ముందు ఆయన స్నానం చేసి వచ్చారు. ఆ తర్వాత నేనూ స్నానం చేశా. అప్పటికే సమయం అర్ధరాత్రి 2 గంటలు కావస్తోంది. అయితేనేం.. మా కలయిక అప్పుడే మొదలైంది.. నాకు కూడా ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. కాకపోతే కాస్త బాధగా మాత్రం అనిపించింది అంతే..!
మెల్లమెల్లగా ఒక్కటయ్యాం..
బ్రైడ్ త్రో ఎవే2 రెడిట్‌లో చెప్పిన జవాబు: మా తొలిరాత్రి నేను ఊహించినంత ఇబ్బందికరంగా ఏమీ జరగలేదు. కానీ కాస్త సాధారణంగా అనిపించింది. నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. మా శోభనం రోజు ఇద్దరం ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడం, వేళ్లను కలపడం, మెల్లగా హత్తుకోవడం.. ఇవే జరిగాయి. ఇక, మా ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందుల అడ్డుగోడలు తొలగించుకొని పూర్తిగా ఇద్దరం ఒక్కటి కావడానికి కొన్ని వారాల సమయం పట్టింది. ఎందుకంటే దాదాపు 3 నెలల వరకు ఆయన ముందు నా బట్టలు తొలగించాలంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ క్రమంగా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి.
పెళ్లైన వారం తర్వాత..
పేరు రాయని వ్యక్తి రెడిట్‌లో ఇచ్చిన సమాధానం: మా పెళ్లికి కొద్ది వారాల ముందే మేమిద్దరం ఒకరిని ఒకరం వ్యక్తిగతంగా కలిశాం. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడింది. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాం అంటారు కదా! అలాగన్నమాట!! ఇక మా తొలి సెక్స్ అనుభవం గురించి చెప్పాలంటే పెళ్లైన వారం తర్వాత.. మేం తొలిసారి శారీరకంగా కలిశాం. వియన్నాలో ఒక మినీ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అక్కడ సమయమంతా పడక గదిలోనే గడిపేశాం. మొత్తంగా నా తొలిరేయి అనుభవం అద్భుతం అని చెప్తా. అదొక మ్యాజిక్‌లా అనిపించింది. మా పెళ్లై ఇప్పటికి 5ఏళ్లు కావస్తోంది. అయినా సరే.. ఆయన ప్రేమకు నేనిప్పటికీ దాసోహమైపోతా.
పోర్న్ సినిమాలు చూసి..
సారాస్లేయర్ రెడిట్‌లో చెప్పిన సమాధానం: మాకు అధికారికంగా నిశ్చితార్థం జరిగినంత వరకు మేమిద్దరం అంతగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. అయితే మా నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్యలో వచ్చిన గ్యాప్‌లో మాత్రం ఇద్దరం అప్పుడప్పుడూ కలుసుకునేవాళ్లం. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అలా ఒకరి గురించి మరొకరం చాలా వరకు వ్యక్తిగతంగా పూర్తి వివరాలు తెలుసుకోగలిగాం. ఈ క్రమంలోనే అతన్ని ఇష్టపడడం కూడా మొదలుపెట్టా.
అయితే ప్రేమించానని మాత్రం చెప్పలేదులెండి! అతను నన్ను చూసుకున్న విధానం, నా పట్ల తీసుకున్న జాగ్రత్త.. ఇవన్నీ ఆయనపై ఉన్న ఇష్టాన్ని మరింతగా పెంచేశాయి. మా పెళ్లయ్యే నాటికి ఇద్దరిలో ఎవరికీ సెక్స్ అనుభవం లేదు. అందుకే కొన్ని పోర్న్ సినిమాలు చూసి అందులో మాదిరిగా చేయడానికి ప్రయత్నించా. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. రోజులు గడిచే కొద్దీ ఇద్దరం ప్రాక్టీస్ చేస్తూనే సెక్స్‌లో ఉన్న ఆనందాన్ని పొందేవాళ్లం.
అదొక బ్లైండ్ డేట్ వంటిది..
రెడిట్‌లో మాయకలియ చెప్పిన జవాబు: 20 ఏళ్ల క్రితం నా భర్తను నేను సంప్రదాయ పద్ధతిలో తొలిసారి కలుసుకున్నా. ఇప్పుడు మాకు నలుగురు పిల్లలు సంతానం. ఆయనంటే నాకు ఎంతో ప్రేమ. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనే నా ప్రపంచం. అయితే మా తొలిరేయి మాత్రం ఒక బ్లైండ్ డేట్ లాంటిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి అది వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది మాకే తెలియలేదు. కానీ వర్కవుట్ అయ్యింది.
దీనికి సంబంధించిన పూర్తి త్రెడ్ ను మీరు ఇక్కడ చదవచ్చు.
GIFs: Giphy, Tumblr
ఇవి కూడా చదవండి
మొదటిసారి సెక్స్‌కి సంబంధించి.. మీకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానాలివే..!
ముద్దులోనూ ఎన్నో రకాలున్నాయి.. వాటి అర్థాలేంటో మీకు తెలుసా?
ఈ ట్రావెల్ రొమాన్స్ స్టోరీలు.. ప్రేమికులకు, ఆలుమగలకు ప్రత్యేకం..!