Lifestyle

మాంసాహార ప్రియులకు ప్రత్యేకం.. ఈ “నెల్లూరు చేపల పులుసు” ..!

Babu Koilada  |  Sep 20, 2019
మాంసాహార ప్రియులకు ప్రత్యేకం.. ఈ “నెల్లూరు చేపల పులుసు” ..!

(Recipe of Nellore Chepala Pulusu – Fish Curry)

తెలుగు రాష్ట్రాలలో చేపల పులుసుకు ఉన్నంతమంది అభిమానులు.. వేరే రాష్ట్రాలలో లేరంటే అతిశయోక్తి కాదు. చేపల కూర అనేది మన సంప్రదాయంలోనే ఉంది. ఇక చేపల పులుసు అంటే పడిచచ్చే భోజన ప్రియులు మనకు ఇక్కడ వేలాది మంది కనిపిస్తారు. చిత్రమేంటంటే.. చేపల పులుసును వండడం ఒక ఎత్తైతే.. దానిని ఎంతో రుచికరంగా తయారుచేయడం మరో ఎత్తు.

ఇక మంచి రుచి, రంగుతో పాటు గుభాళించే వాసన కూడా దానికి తోడైతే..  ఆ మజాయే వేరు కదా. అయితే చేపల పులుసుకి సంబంధించి.. ఒక స్పెషాలిటీని, స్టైల్‌ని తనకుంటూ ఏర్పరచుకున్న “నెల్లూరు చేపల పులుసు” గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.

భోజ‌న‌ప్రియులైనా.. వంట రాక‌పోతే ఎలా ఉంటుందో మీకు తెలుసా?

ఎందుకంటే “నెల్లూరు చేపల పులుసు”  అలాంటిలాంటి చేపల పులుసు కాదు. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకురావడం కోసం.. నెల్లూరులో ప్రత్యేకంగా తయారయ్యే మామిడికాయలను ఉపయోగిస్తారు. ఎంతో పుల్లగా ఉంటాయవి. అవే ఈ చేపల పులుసుకు ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తున్నాయి.

సాధారణంగా ఏదైనా చేపల పులుసు పెట్టేటప్పుడు.. 40 నుండి 50 గ్రాముల చింతపండు మిశ్రమాన్ని కలుపుతారు. కానీ ఈ నెల్లూరు చేపల పులుసు తయారీకి మాత్రం 20 నుండి 30 గ్రాముల చింతపండు వాడితే సరిపోతుంది. ఎందుకంటే.. మిగతా పులుపు అంతా మామిడికాయల నుండే వస్తుంది. 

ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే.. మీరే కిచెన్ క్వీన్ ..!

ఈ చేపల పులుసు తయారీకి ఎలాంటి చేపలనైనా వాడచ్చు. కానీ కొరమీను చేపలను వాడితే ఆ రుచి వేరుగా ఉంటుంది. ఇక దీని తయారీకి కావాల్సిన దినుసుల వివరాలివే.

చింతపండు – 200 గ్రాములు

పచ్చి మిర్చి పొడి – 100 గ్రా.

రిఫైండ్ ఆయిల్ – 50 గ్రా.

కరివేపాకు – కొద్దిగా.

టమోటాలు – 2 పెద్దవి

పచ్చి మిరపకాయలు – 3

నెల్లూరు మామిడి కాయ – 1 పెద్దది

మిరియాలు – కొద్దిగా

వెల్లుల్లి – 5 రెబ్బలు

పసుపు  – 1.5 టి స్పూన్

ఉప్పు – తగినంత

ఆవాలు – 1 స్పూన్

మెంతులు – 1 స్పూన్

ఉల్లిపాయలు – 2 పెద్దవి

దనియాలు – 1 స్పూన్

జీలకర్ర – 1 స్పూన్

ఈ చేపల పులుసు తయారీ కోసం ముందు చేపలను బాగా కడిగి.. తర్వాత ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండును నీటిలో బాగా నానబెట్టి.. తర్వాత దాని రసం తీసి ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి. 

ఆ తర్వాత ఒక బాణలి తీసుకొని.. అందులో నూనె వేయకుండా దినుసులను బాగా వేయించాలి. మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్రలను సువాసన వచ్చేవరకు బాగా వేయించి.. తర్వాత పొడి చేసుకోవాలి. 

మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యార‌డైజ్ బిర్యానీ

తర్వాత ఒక పెద్ద బాణలి తీసుకొని.. అందులో నూనె పోయాలి. ఆ నూనె బాగా కాగే వరకూ ఆగాలి. తర్వాత అదే నూనెలో బాగా తరిగిన మిరపకాయలు, కరివేపాకు, టమోటలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత ఆవాలు కూడా వేసి వేయించాలి.

అవి బాగా వేగాక.. అదే మిశ్రమంలో ఇంతకు క్రితం స్టోర్ చేసుకున్న చింతపండు రసాన్ని పోయాలి.  తర్వాత నెల్లూరి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి.. ఉడుకుతున్న మిశ్రమంలో వేయాలి. పులుసు బాగా మరిగాక.. ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న దినుసుల పొడి లేదా మసాలా పొడిని వేసి బాగా కలపాలి. 

ఆ తర్వాత.. చేప ముక్కలను ఈ పులుసులో వేయాలి. తర్వాత ఆ ముక్కలు ఉడికేవరకూ.. పులుసును గమనిస్తూనే ఉండాలి. తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి.. కొంచెంసేపు ఆగాక.. పులుసును దించేయాలి. 

ఇంకేం.. నెల్లూరు చేపల పులుసు రెడీ.

Featured Image: Instagram.com/QuriosEATY and Instagram.com/AromasofAndhra

 

 

 

Read More From Lifestyle