ADVERTISEMENT
home / DIY Life Hacks
ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే.. మీరే కిచెన్ క్వీన్ ..!

ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే.. మీరే కిచెన్ క్వీన్ ..!

చాలామందికి వంట చేయడం (Cooking) అంటే చాలా ఇష్టం. కానీ వంట చేసేటప్పుడు  చాలా పదార్థాలు అనుకున్నట్లుగా రావు. ఉదాహరణకు ఆలూ పరాఠా చేద్దామంటే లోపలున్న మిశ్రమం బయటకొచ్చేస్తుంది. కూరలో ఉప్పో, కారమో ఎక్కువైపోతుంది. రైతా చేస్తే చాలా పుల్లగా అనిపిస్తుంది. మీరూ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే.. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ అద్భుతమైన టిప్స్ (Tips) చక్కని పరిష్కారం చూపించడమే కాదు.. వంటకానికి చక్కని రుచి వచ్చేసేలా చేసి అందరినీ మెప్పిస్తాయి కూడా..

1. కూరలో ఉప్పు ఎక్కువైతే..

సాధారణంగా కూర ఎలా ఉన్నా ఫర్వాలేదు.. కానీ ఉప్పో, కారమో ఎక్కువో తక్కువో అయితే మాత్రం తినలేం. తక్కువైనా కాస్త పై నుంచి జల్లుకోవచ్చు. కానీ ఎక్కువైతే దాన్ని తొలగించడం చాలా కష్టం.

కానీ దాన్ని తగ్గించేందుకు కూడా ఓ చిట్కా ఉందండోయ్.. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కూరలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు లేదా చపాతీ తయారుచేయడానికి సిద్ధం చేసిన పిండి ముద్దలు అందులో వేసి కాసేపు ఉంచేయాలి.

ADVERTISEMENT

ఇవి ఉప్పును పీల్చేసుకుంటాయి కాబట్టి కూరలో ఉప్పు తగ్గుతుంది. ఆ తర్వాత కూర వడ్డించేటప్పుడు వీటిని తీసేస్తే సరిపోతుంది. ఫ్రైలలో ఉప్పు ఎక్కువైతే కాస్త శనగపిండిని నీళ్లలో కలిపి అందులో పోస్తే ఉప్పు తగ్గుతుంది.

1a633be2b1cb866d-japanese-cooking-gifs-get-the-best-gif-on-giphy

2. పాస్తా అతుక్కుపోతే..

సాధారణంగా వేడి నీటి నుంచి తీసి.. చల్లని నీటిలో వేసి ఉంచితే పాస్తా అంత త్వరగా అతుక్కోదు. అయినా అది అతుక్కుందంటే.. మీరు తయారుచేసే సమయంలో ఏదో తప్పు చేశారు అన్నమాట. పాస్తా అతుక్కోకుండా రావాలంటే.. అది ఉడకబెట్టిన నీళ్లలో కొన్ని చుక్కల నూనె వేయాలి. అది కాస్త ఉడికిన వెంటనే వేడి నీళ్ల నుంచి తీసి చన్నీళ్లతో కడిగి పెట్టుకోవాలి. ఇలా చేస్తే అచ్చం మార్కెట్లో దొరికే పాస్తాలాగే అనిపిస్తుంది.

3. తోడు లేకపోయినా పెరుగు కావాలంటే..

ఇంట్లో పెరుగు తోడు లేకపోతే మనం పక్కింటివాళ్లను అడగడం మనకు తెలిసిందే. ఇప్పుడు మార్కెట్లో పెరుగు ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉండడం వల్ల చాలామంది దీన్ని పట్టించుకోకపోయినా ఇంటి పెరుగు రుచి వేరు. అందుకే చాలామంది దీన్నే ఇష్టపడతారు. తోడు లేకపోతే పాలను గోరువెచ్చగా చేసి అందులో రెండు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి.. పన్నెండు గంటలు అస్సలు కదపకుండా పక్కన పెట్టాలి. మంచి గడ్డపెరుగు మీకు దొరుకుతుంది.

4. వెల్లుల్లి రుచి కోసం..

చాలామంది వెల్లుల్లిని కూరల్లో కట్ చేసి వేయడం మనం చూస్తుంటాం. కానీ దీని బదులు పేస్ట్ వేయడం వల్ల వెల్లుల్లి రుచి, వాసన ఆ వంటకానికి అందుతుంది.

ADVERTISEMENT

5. టీ పొడిని పడేయకండి..

అదేదో సినిమాలో టీ పొడితో టూత్ పౌడర్ చేసుకున్న పిల్లోడి గురించి మనం చూశాం. ఇది నిజమే.. టీ పొడి మీ పళ్లనే కాదు.. అద్దాలను కూడా మెరిపించగలదు. అందుకే టీ పెట్టిన తర్వాత టీ పొడిని పక్కన పెట్టి దాంతో అద్దాలు, చెక్కతో చేసిన వస్తువులు శుభ్రం చేయడం వల్ల అవి మెరుస్తాయి.

6. అన్నం పొడిగా రావాలంటే..

సాధారణంగా అన్నం ప్రతి మెతుకు పొడిపొడిగా అంటుకోకుండా ఉండడం మనలో చాలామందికి ఇష్టం. దీని కోసం చేయాల్సిన పని చాలా సింపుల్. అన్నం వండేటప్పుడు అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల మెతుకులు అతుక్కోకుండా వస్తాయి.

e1fb7fd43faa649840489466f5b981dc

7. నిమ్మరసం ఎలా చేయాలంటే..

నిమ్మరసం చేసేటప్పుడు రసంతో పాటు నిమ్మ చెక్కలను కూడా అందులోనే వేసి కాసేపు ఉంచడం వల్ల.. మంచి ఫ్లేవర్, రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి.

8. డ్రై ఫ్రూట్స్ పాడవకుండా..

డ్రై ఫ్రూట్స్ ఎక్కువ సమయం స్టోర్ చేయడం వల్ల వాటికి పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

9. రైతా పుల్లగా కాకుండా..

సాధారణంగా మనం తినే సమయానికి కొన్ని గంటల ముందే రైతా తయారుచేసి పెట్టేస్తాం. దీని వల్ల రైతా పుల్లగా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా పెరుగులో కూరగాయలు.. మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. కానీ ఉప్పు మాత్రం వేయకూడదు. దాన్ని సర్వ్ చేసే ముందు మాత్రమే ఉప్పు వేయడం వల్ల పుల్లగా కాకుండా ఉంటుంది.

10. ఆలూ పరాఠా ఎలా చేయాలంటే..

చాలామంది ఆలూ పరాఠా చేసేటప్పుడు వత్తుతుంటే లోపలి మిశ్రమం బయటకు వస్తుంది. ఇలా కాకుండా చేయాలంటే నెమ్మదిగా వత్తాలి. అది కూడా అంచుల వద్ద కాకుండా మధ్యలో వత్తుతూ.. తర్వాత అంచుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చేస్తే పరాఠాలు పగిలే అవకాశం తక్కువ.

11. అల్లం పేస్ట్ కోసం..

సాధారణంగా అల్లం పేస్ట్‌ను ఎప్పటికప్పుడు తాజాగా చేయడంతో పాటు కొంత స్టోర్ చేసి కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఇది పాడవకుండా ఉండేందుకు అందులో చెంచా ఆవాల నూనె వేయాలి. ఇలా చేయడం వల్ల అల్లం పేస్ట్ పాడవకుండా ఉంటుంది.

tenor

12. గుడ్లు పగలకుండా..

గుడ్లు ఉడకబెట్టినప్పుడు పగిలిపోతుంటే ఈ చిట్కా పాటించండి. గుడ్లను ఉడకబెట్టే నీటిలో ముందు అర చెంచా ఉప్పు వేయండి. ఆ తర్వాత గుడ్లు నెమ్మదిగా అందులో వేసి ఉడికించండి. ఇలా చేస్తే అవి పగలకుండా బాగా ఉడుకుతాయి.

ADVERTISEMENT

13. మాడిపోయిన గిన్నెలు శుభ్రం..

వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోవడం సహజం. వీటి మాడును తొలగించేందుకు ఇందులో కాస్త టీ పొడి, నీళ్లు పోసి కాస్త సమయం పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత శుభ్రం చేస్తే గిన్నెలు మెరుస్తాయి.

14. మెత్తని ఇడ్లీలు ఇలా..

ఇడ్లీలు మెత్తగా పువ్వుల్లా రావాలంటే పిండి పట్టిన తర్వాత అందులో అన్నం మిక్సీ పట్టి వేయాలి. లేదా బేకింగ్ సోడా లేక ఈనో కూడా వేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

c

16. కన్నీళ్లు లేకుండా ఉల్లి కోయాలంటే..

ఉల్లిపాయను సరైన పద్ధతిలో కోస్తే ఎప్పుడూ కన్నీళ్లు రావు. దీని కోసం చేయాల్సిందల్లా ఉల్లి కోసేటప్పుడు పై భాగాన్ని పక్కన పెట్టి ముందు దాన్ని కోసేసి ఆ తర్వాత మిగిలిన భాగాన్ని కోయాలి. లేదంటే తొక్క తీసి కొంత సమయం పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత కోస్తే కన్నీళ్లు రావు.

17. రాజ్మా ఛోళే చేయడానికి..

సాధారణంగా ఛోళే చేయాలంటే రాజ్మా, శెనగలు, బఠానీలు ఇలా వేటినైనా రాత్రంతా నానబెట్టాల్సి ఉంటుంది. అంత సమయం మీకు లేకపోతే మరుగుతున్న నీటిలో వీటిని వేసి నానబెట్టడం వల్ల గంటలోనే అవి నానిపోయి ఉడకబెట్టడానికి సిద్ధంగా తయారవుతాయి.

ADVERTISEMENT

18. బెండకాయ కరకరలాడాలంటే..

బెండకాయ కూర మెత్తగా కాకుండా కరకరలాడుతూ రావాలంటే.. కూర ఉడుకుతున్నప్పుడే ఉప్పు వేయకుండా మొత్తం ఉడికి కూర తయారైన తర్వాత ఉప్పు వేయండి. ఉప్పుతో పాటు నిమ్మకాయ రసం కూడా వేయడం వల్ల బెండకాయ ముక్కలు కరకరలాడుతూ ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి.

ఇవి కూడా చదవండి.

ఈసారి ఎవ‌రైనా బ‌రువు పెరిగావ‌ని చెబితే.. వారికి ధీటుగా బ‌దులివ్వండిలా..!

ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

ADVERTISEMENT

ఆయుర్వేదం.. మేని అందానికి చక్కటి ఔషధం..!

06 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT