Food & Nightlife

హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు రావడానికి కారణాలివే…

Sandeep Thatla  |  Nov 1, 2019
హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు రావడానికి కారణాలివే…

హైదరాబాద్ (hyderabad) మహా నగరం… దీన్ని ఒక మినీ ఇండియాగా వర్ణిస్తుంటారు. కారణం ఈ నగరంలో అనేక మతాలు, ప్రాంతాలు, కులాల వారు అలాగే విదేశీయులు కూడా ఎంతోమంది కలిసి జీవిస్తుంటారు. అందుకే దీనిని కాస్మోపాలిటన్ సిటీ అని కూడా పిలుస్తుంటారు. అలాగే మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి.. చాలా తక్కువ ఖర్చుతో నివసించగలిగే నగరాల్లో హైదరాబాద్ ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. 

హైదరాబాద్ లో ఉన్న ఈ ఫేమస్ బ్రెడ్ – ఆమ్లెట్ సెంటర్ గురించి మీకు తెలుసా?

ఏటా యునెస్కో (unesco) వారు ప్రపంచంలోని కొన్ని నగరాలని ఎంపిక చేసి వాటికి క్రియేటివిటీ సిటీ ట్యాగ్ (creative city tag) ని ఇస్తుంటారు. అలా ఈ సంవత్సరంకి గాను హైదరాబాద్ నగరానికి గ్యాస్ట్రనామి (gastronomy) విభాగం (category) కింద క్రియేటివిటీ సిటీ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇంతకి ఈ గ్యాస్ట్రనామి (gastronomy) ట్యాగ్ ఇవ్వడం అంటే ఇక్కడ రకరకాల వంటకాలు చేసే వ్యక్తులు ఉన్నట్లు లెక్క. వివిధ రకాలైన ఆహార పదార్ధాలు లభించే స్థలంతో పాటుగా ఇక్కడ అనేక రకాల సంస్కృతుల వారు.. అలాంటి వారు చేసిన వంటకాలని ఆరగించే వారు ఉన్నట్టు లెక్క.

అలా మన హైదరాబాద్ నగరానికి (city) ఇటువంటి ఒక ప్రత్యేక గుర్తింపు రావడం వెనుక ఉన్న బలమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

* హలీం వంటి మిడిల్ ఈస్ట్ వంటకానికి గాను ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఫేమస్ గా మారింది హైదరాబాద్.. 

* మాంసాహార ప్రియులని నోరూరించే అనేక వంటకాలు హైదరాబాద్ నగరంలో లభిస్తుండడం.. ఇందులో ఎక్కువగా ఇరానియన్ వంటకాలు ఉండడం విశేషం.

* హైదరాబాద్ నగరంలో లభించే వంటకాల పైన 12వ శతాబ్దంలో పరిపాలించిన కాకతీయ రాజుల ప్రభావం ఆ తరువాత ఈ నగరానికి వలస వచ్చిన టర్కిష్, ఇరానియన్స్ ప్రభావం ఉంటుంది. వారి తరువాత ఇక్కడ రాజ్య పరిపాలన చేసిన మొఘలుల ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది.

* ఇక మన దేశంలో మరెక్కడా కూడా లభించిన ఉస్మానియా బిస్కెట్స్ ఇక్కడే పుట్టాయి.. దేశం మొత్తంలో కూడా చాలా తక్కువ చోట్ల లభించే ఇరానీ టీ ఇక్కడ విరివిగా లభిస్తుంది.

* అలాగే ఇక్కడ ఆహారపు అలవాట్లు కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా భిన్నంగా మరియు వంటకాల తయారీ కూడా కాస్త వైవిధ్యంగా ఉంటుంటాయి.

* ఇవన్నీ పక్కకి పెడితే, ఇక్కడి ప్రజలు భోజన ప్రియులు అని చెప్పడానికి ఒక ఉదాహరణ – హైదరాబాద్ నగరంలో సగటున రోజుకి 7000 టన్నుల చికెన్ & 291 టన్నుల మటన్ ఇక్కడ అమ్ముడవుతుంది. ఇక ఏదైనా పండుగ వస్తే ఈ లెక్కలు పదిరెట్లు అవుతాయి. ఇక వెజిటేరియన్ రెసిపీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ ఖీర్ టేస్ట్ చేయండి..!

* ఇక ఇక్కడి భోజన ప్రియులని ఆకర్షించేందుకు జంటనగరాల్లో దాదాపు 10,000 వరకు రిజిస్టర్డ్ హోటల్స్ ఉన్నాయి. రిజిస్టర్ కానివి & స్ట్రీట్ ఫుడ తో కలిపి చూస్తే దాదాపు 1 లక్ష వరకు వివిధ రకాల వంటకాలని విక్రయించే వారు ఉన్నారు.

* అయితే ఇంత భారీ సంఖ్యలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారు ఉండడం విశేషమే.. ఇవన్నీ 1940 తరువాత నుండే మొదలయ్యాయి. అంతవరకు ఇలా వంటకాలు విక్రయించే పద్ధతి ఈ నగరంలో ఉండేది కాదు. అంటే దాదాపు 80 ఏళ్లలో ఇక్కడ పలు రకాల వంటకాలు సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రావడం జరిగింది.

ఇవి హైదరాబాద్ నగరాన్ని గ్యాస్ట్రనామి కేటగిరీ కింద యునెస్కో వారు ఎంపిక చేయడానికి కారణమైనవి. ఇది ఒకరకంగా ఇక్కడి ప్రజలకు & రకరకాల వంటకాలని శతాబ్దాలుగా చేస్తూ తమ సంస్కృతిని ఇక్కడివారితో పంచుకుంటున్న వారికి గర్వంగా భావించే రోజు అని చెప్పాలి. ఈ గుర్తింపు ఒక రకంగా హైదరాబాద్ నగరంలో మరిన్ని ప్రాచీన వంటకాలని గుర్తించి అందరికి అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ప్రేరణగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇదే సమయంలో ముంబై నగరానికి కూడా ఇటువంటి క్రియేటివ్ సిటీ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అయితే అది సినిమాల విభాగంలో ఇచ్చారు.

హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!

Read More From Food & Nightlife