హైదరాబాద్ (hyderabad) లో బిర్యాని, హలీం ఎంత ఫేమస్సో అదే స్థాయిలో పాయా (paya) కూడా అంతే ఫేమస్ (famous). ఓల్డ్ సిటీ లో విరివిగా లభించే ఈ వంటకం (recipe) గురించి తెలియని భోజన ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి చలికాలంలో ఈ వంటకాన్ని రుచి చూడడానికి ఎక్కువగా మక్కువ చూపుతుంటారు, బయట ఉండే చల్లటి వాతావరణానికి ఇది తింటే ఆ చలిని తట్టుకునేందుకు ఇది మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది. జలుబు, జ్వరం వంటివి కూడా తగ్గిస్తుంది.అంతేకాదు.. ఎముకలు విరిగిన వారు కూడా ఈ పాయా తప్పనిసరిగా తినాలి అని చెబుతుంటారు. కారణం ఆ పాయా సూప్.. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి కూడా అని..
హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా అనోఖి ఖీర్ టేస్ట్ చేయండి..!
మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ రుచికరమైన పదార్ధాన్ని ఎలా తయారుచేసుకోవాలో మీకు తెలుసా? దీని తయారీ చాలా సింపుల్. మరి, మనం దీన్ని ఇంట్లో తయారుచేసుకోవడానికి కావాల్సిన వస్తువులు, తయారీ పద్ధతి తెలుసుకుందాం.
పాయా చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు
* మేక కాళ్ళు – 4 (మీడియం గా కట్ చేసినవి)
* పసుపు
* ఉప్పు
* ఉల్లిపాయలు
* అల్లం వెల్లులి పేస్ట్
* కారం
* ధనియాల పొడి
* జీలకర్ర పొడి
* మిరియాల పొడి
* గరం మసాలా పొడి
* పెరుగు
* కొబ్బరి పొడి
పాయా తయారీ విధానం –
పాయా తయారీకి ముందుగా మేక కాళ్ళని పసుపు & ఉప్పు వేసి బాగా రుద్దుకోవాలి. అలా రుద్ది వాటిని ఒక 20 నిముషాలు పాటు అలాగే ఉండనివ్వాలి. 20నిమిషాల తరువాత వీటిని నీటితో శుభ్రంగా కడగాలి.
ఇక ఇప్పుడు పాయా తయారీ ప్రారంభమవుతుంది. అయితే ఈ పాయా చేయడానికి ప్రెజర్ కుక్కర్ ని వాడడం మంచిది. ఎందుకంటే ప్రెజర్ కుక్కర్ లో అయితేనే మేక కాళ్ళు పూర్తిగా ఉడకడానికి & వంటకం రుచికరంగా అవ్వడానికి వీలుంటుంది. అలా ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ మోతాదులో నూనె పోసుకుని, అది మరిగాక అందులోకి అంతకుముందే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
రంజాన్ సీజన్ స్పెషల్.. హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??
అందులోనే రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లులి పేస్ట్ & పసుపు వేసుకుని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మేక కాళ్ళని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత అందులో ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని కుక్కర్ మూతని పెట్టేయాలి. ఇక ఈ ప్రెజర్ కుక్కర్ ని దాదాపు 7 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు అలాగే ఉంచాలి.
ఇక 8 విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆపేసి, కుక్కర్ మూత తీసి చూస్తే.. కాళ్ళకి మసాలా బాగానే పట్టుకుంటుంది కాని ఆ కాళ్ళ పైన ఉన్న మాంసం ఇంకా ఎముక నుంచి విడిపోయి ఉండదు. కాళ్ళ పైన ఉన్న మాంసం ఎప్పుడైతే బాగా ఉడికి ఎముక నుంచి ఊడిపోయేలా అవుతుందో అప్పుడే మీరు పాయా సిద్ధమైనట్టుగా భావించాలి.
కుక్కర్ మూత తీసిన తరువాత అందులో మూడు టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకుని, మళ్లీ రెండు లేదా మూడు గ్లాసుల నీటిని మిశ్రమంలో పోసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత రుచికి అనుగుణంగా ఉప్పుని వేసుకుని, కుక్కర్ మూత పెట్టి మళ్లీ సుమారు 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. అలా 7 విజిల్స్ తరువాత కుక్కర్ మూత తీసేసి స్టవ్ పైనే ఇంకొక 20 నిముషాల పాటు ఉడికించాల్సి ఉంటుంది.
ఈ 7 విజిల్స్ వచ్చే లోపు మనం రెండు టీ స్పూన్ల పెరుగులో రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడిని మిక్సీ పట్టుకోవాలి. ఇక ఆ 7 విజిల్స్ పూర్తయి స్టవ్ పైన ఉడుకుతున్న మిశ్రమంలో ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి & పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది, మేక కాళ్ళ పైన ఉన్న మాంసం ఊడిపోయేలా ఉందొ లేదో అని.. ఒకవేళ అప్పటికి కూడా అలా అవ్వకపోతే మరొక 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైనే ఉంచుకోవాలి. అలా ఉడికితే చాలు.. కనిపిస్తే మీరు ఎంతో ఇష్టపడి & కష్టపడి చేసిన పాయా సిద్దమైనట్లే.
ఆఖరుగా ఈ పాయాని వడ్డించే ముందు చక్కగా తురిమిన కొత్తిమీరని వంటకం పైన చల్లితే అది పాయాకి మరింత రుచిని అందిస్తుంది. ఈ వంటకం చేయడానికి దాదాపు ఒక గంట నుండి రెండు గంటల సమయం పడుతుంది. మేక కాళ్ళు ఉడకడం బట్టే ఈ వంటకం పూర్తవుతుంది. కాబట్టి కాస్త లేతగా ఉన్న మేక కాళ్లు తీసుకోవడం మంచిది.
ఇలా సిద్ధమైన పాయాని రోటి , బటర్ రోటి , జొన్న రొట్టె వంటి వాటితో తింటే దీని రుచి స్పష్టంగా తెలుస్తుంటుంది. రుచికరమైన, ఆరోగ్యాన్ని పెంచే పాయా తయారీ విధానం తెలిసింది కదా . మరింకెందుకు ఆలస్యం.. ఈ చల్లటి వాతావరణంలో మీరు కూడా ఇంటిలో ఈ వేడి వేడి పాయా సిద్ధం చేసుకుని హాయిగా ఆరగించండి.
హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!
Read More From Family Trips
హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్ గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు…
Sandeep Thatla
మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. దీని వేలం వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
Sandeep Thatla