(Important Things to know about Eyebrow Threading)
నయనాలు.. మగువ ముఖానికి నిజమైన అందాన్ని తీసుకొస్తాయి. కళ్లకు అందంగా మేకప్ వేసుకుంటే చాలు.. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మీకో సీక్రెట్ తెలుసా..? అందమైన కనుబొమ్మలు ముఖ వర్చస్సును మరింత పెంచుతాయి. కనుబొమ్మలు ఒత్తుగా, ఒంపు తిరిగి విల్లులా కనిపించడం వల్ల.. ముఖం సైతం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందుకే.. త్రెడింగ్ చేయడం వల్ల మరీ సన్నగా అయిపోకుండా కనుబొమ్మలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ క్రమంలో మనం కూడా త్రెడింగ్ చేసేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలను గురించి తెలుసుకుందాం..
* ఐబ్రో త్రెడింగ్ ముఖ్య ఉద్దేశం.. కనుబొమ్మలను అడ్జస్ట్ చేసి వాటిని అందంగా కనిపించేలా చేయడం. ముఖంపై ఎక్కువగా ఉన్న జుట్టును ఇది తొలగిస్తుంది.
* ఐబ్రో త్రెడింగ్ వల్ల వెంట్రుకల పెరుగుదల కూడా తగ్గుతుంది. కాబట్టి అందంగా కనిపించే వీలుంటుంది.
* ఒకసారి త్రెడింగ్ చేయించుకున్న తర్వాత.. కొన్ని నెలల పాటు దాన్ని ఎవరూ మరోసారి చేయించుకోరు. కానీ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మళ్లీ బలంగా పెరుగుతాయి. కాబట్టి కనీసం నెలకోసారైనా త్రెడింగ్ చేయించుకోవడం మంచిది.
* త్రెడింగ్ చేయడానికి ముందు మీ ముఖాన్ని నీటితో బాగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై ఎక్కువగా ఉన్న నూనె తొలిగిపోతుంది. నీటితో కడుక్కున్న తర్వాత.. కాటన్ వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది.
* మొదటిసారి త్రెడింగ్ చేయించుకున్నప్పుడు చాలామందికి కనుబొమ్మలు ఉబ్బుతాయి. ఇది వెంట్రుకలను బలంగా లాగడం వల్ల జరుగుతుంది. ఇది కొందరిలో రెండు రోజుల వరకూ నిలుస్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు.
* త్రెడింగ్ తర్వాత నొప్పిగా అనిపించే కనుబొమ్మల దగ్గర.. కోల్డ్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను రాసుకోండి. వెన్న, బాదం నూనె, ఆలివ్ నూనె వంటివి మంట, నొప్పిని తగ్గిస్తాయి. ఐస్ అప్లై చేయడం వల్ల కూడా ఈ నొప్పి, వాపు తగ్గుతాయి.
* రోజూ కనుబొమ్మలకు నూనె లేదా ఆముదం రుద్ది మసాజ్ చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఒత్తుగా పెరగడం వల్ల మీ ముఖంలో అందం మరింత ఎక్కువగా పెరుగుతుంది. పొడవాటి ముఖం ఉన్నవారు కనుబొమ్మలు కాస్త పొట్టిగా ఉండేలా చూసుకోవాలి. చతురస్రాకారంలో ముఖం ఉన్న వారు ఆర్క్ (వంపు తిరిగి ఉండేలా) మాదిరిగా షేప్ చేయించుకోవాలి. ఇక ఓవల్ షేప్‌లో ఉన్న వారు సాఫ్ట్ యాంగిల్ షేప్‌లో ఉండేలా చేసుకోవాలి. గుండ్రని ముఖం ఉన్నవారికి .. గుండ్రగా కంటి రెప్ప చివరి వరకూ ఉండేలా కనుబొమ్మలు ఉంటే అందంగా ఉంటుంది.
* సాధారణంగా పార్లర్ వాళ్లు పదిహేను రోజులకోసారి త్రెడింగ్ చేసుకోవాలని చెబుతుంటారు. కానీ మరీ అంత తరచుగా త్రెడింగ్ చేయించుకోవడం కూడా సరికాదు. దీనివల్ల కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతుంటాయి.
* కొంతమందికి అలర్జీ, రాషెస్ వంటివి ఉంటాయి. ఇలాంటి వారు త్రెడింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.
* త్రెడింగ్ చేసే వారి చేతుల నుంచి మీ ముఖానికి ఇన్ఫెక్షన్ రావచ్చు. అందుకే త్రెడింగ్ లేదా ఏ బ్యూటీ ట్రీట్ మెంట్ చేసే ముందైనా బ్యూటీషియన్‌ని చేతులు బాగా కడుక్కోమని చెప్పాలి.
* త్రెడింగ్ చేసిన తర్వాత ముఖంపై.. ఎలాంటి ట్రీట్‌మెంట్ చేయించుకోకూడదు. క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం లేదా మేకప్ వేసుకోవడం వెంటనే చేయకూడదు. కనీసం రెండు మూడు గంటలైనా ఆగాల్సిందే. లేకపోతే కనుబొమ్మల దగ్గర చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి.
* చాలామంది త్రెడింగ్ చేయించుకోవడానికి ముందే వెంట్రుకలు వస్తే వాటిని ప్లకర్ సాయంతో తొలగిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ ఐబ్రో షేప్ పాడవుతుంది. ఇలా చేయకపోవడం మంచిది.
* వేడినీటితో స్నానం చేయడం వల్ల కుదుళ్లు బలహీనంగా మారతాయి. ఆ తర్వాత త్రెడింగ్ చేయడం వల్ల నొప్పి చాలా తక్కువగా ఉంటుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.