Home & Garden

నెయిల్ పాలిష్‌తో నెయిల్ ఆర్ట్ మాత్రమే కాదు.. ఈ పనులు కూడా చేయొచ్చు..

Lakshmi Sudha  |  Mar 12, 2019
నెయిల్ పాలిష్‌తో నెయిల్ ఆర్ట్ మాత్రమే కాదు.. ఈ పనులు కూడా చేయొచ్చు..

గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి, చక్కగా నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి మనం నెయిల్ పాలిష్ ఉపయోగిస్తాం. ప్రతి అమ్మాయి దగ్గర రంగురంగుల నెయిల్ పాలిష్‌లు ఉంటాయి. అయితే వాటిలో కొన్నింటిని ఉపయోగించకపోవడం వల్ల నిరుపయోగంగా మారిపోతాయి. మరి వాటిని అలా వదిలేయడమేనా? ఆ అవసరం లేదండి. కొన్ని గృహావ‌స‌రాల‌ను తీర్చ‌ుకోవడానికి నెయిల్ పాలిష్‌ను (Nail Polish)  ఉపయోగించవచ్చు.

సూదిలో దారం ఎక్కించడానికి మనం పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. దారం ఎక్కించడం మన వల్ల కాకపోతే.. పక్కవారికైనా ఇచ్చి ఆ పని పూర్తి చేయిస్తాం. నెయిల్ పాలిష్ ఉపయోగిస్తే ఈ పని చాలా సులువుగా అయిపోతుంది. దీని కోసం దారం చివర కొద్దిగా నెయిల్ పాలిష్ రాసి కొన్ని సెకన్ల పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల దారం స్టిఫ్‌గా తయారవుతుంది. దీంతో సులువుగా సూదిలో దారం ఎక్కించవచ్చు.

మనం కొన్న ఆర్టిఫిషియల్ జ్యుయలరీ కొంత కాలం తర్వాత రంగు మారిపోతుంది. ఇలా రంగు మారిపోకుండా ఉండాలంటే.. ట్రాన్సపరెంట్ కలర్‌లో ఉన్న నెయిల్ పాలిష్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ నెయిల్ పాలిష్‌తో జ్యుయలరీపై పలుచగా కోటింగ్ వేస్తే అవి ఎక్కువ కాలం మన్నుతాయి.

మీకు సరికొత్త లుక్ ఇచ్చే డిజైనర్ నగల గురించి ఇక్కడ చదవండి.

Image: Instagram

ముత్యాల మాదిరిగా ఉండే తెల్లని పూసలు.. కొన్ని రోజుల తర్వాత వాటిపై తెల్లని పొర ఊడిపోయి కళావిహీనంగా తయారవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. వాటికి ట్రాన్సపరెంట్ నెయిల్ పాలిష్ వేయడం మంచిది.

స్టోన్ జ్యుయలరీ అంటే మహిళలకు మక్కువ ఎక్కువ. కొన్నిసార్లు స్టోన్స్ రాలిపోతుంటాయి. నెయిల్ పాలిష్ ఉపయోగిస్తే వాటిని తిరిగి అతికించవచ్చు. దీని కోసం ట్రాన్సపరెంట్ రంగులో ఉన్న నెయిల్ పాలిష్ ఉపయోగించాల్సి ఉంటుంది.

అల్మరా తలుపులు లేదా ఇతర ఫర్నిచర్ స్క్రూలు కొన్ని సందర్భాల్లో వదులుగా తయారవుతాయి. వీటిని ఎన్నిసార్లు బిగించినా పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. ఇలాంటప్పుడు నెయిల్ పాలిష్ ఉపయోగిస్తే స్క్రూని బిగుతుగా మార్చుకోవచ్చు. దీని కోసం వదులుగా అవుతున్న స్క్రూను బయటకు తీసి దానికి నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. ఆరిన తర్వాత దాన్ని బిగిస్తే సరిపోతుంది.

ఒకే కీచెయిన్‌కి ఐదారు తాళం చెవులుంటాయి. అందులోనూ అవన్నీ చూడటానికి ఒకేలా ఉంటే.. ఏ తాళానికి ఏ చెవి పనిచేస్తుందో గుర్తించడం అంత సులభం కాదు. అందుకే వాటికి వివిధ రంగుల్లోని నెయిల్ పాలిష్ వేస్తే.. దానిని గుర్తించడం సులభమవుతుంది.

Image: Instagram

అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు ఆహారంలో భాగం చేసుకొంటున్నారా? అయితే సాల్ట్ షేకర్‌కి నెయిల్ పాలిష్ అప్లై చేస్తే సరిపోతుంది. అదెలా? చాలా సింపుల్. సాల్ట్ షేకర్ మూతకు ఉన్న కొన్ని రంధ్రాలకు నెయిల్ పాలిష్ కాస్త మందంగా అప్లై చేసి మూసేస్తే సరి.

ఖాళీ గాజు సీసాలు, గాజు గ్లాసులను నెయిల్ పాలిష్‌తో అందంగా పెయింట్ చేసి డెకరేటివ్ పీసెస్‌గా ఉపయోగించుకోవచ్చు. నెయిల్ పాలిష్‌తో రంగు వేసిన గాజు గ్లాస్‌ను కాండిల్ హోల్డర్‌గా ఉపయోగించవచ్చు.

Image Source: Instagram

కళ్లజోడుకున్న స్క్రూలు కొన్నిసార్లు వదులుగా తయారవుతాయి. ఆ స్క్రూలు బిగిస్తే తప్ప వాటిని ధరించడానికి ఉండదు. కొన్నిసందర్భాల్లో ఆప్టీషియన్ దగ్గరకు వెళ్లేంత సమయం కూడా మ‌న వ‌ద్ద‌ ఉండదు. అలాంట‌ప్పుడు నెయిల్ పాలిష్ ఉపయోగిస్తే సరిపోతుంది. స్క్రూలకు కొద్దిగా నెయిల్ పాలిష్ అప్లై చేసి తిరిగి బిగిస్తే సరిపోతుంది.

గోర్లు చివర్లు పగిలినట్లుగా తయారైతే.. అవి విడిపోకుండా ఉండటానికి నెయిల్ క్లిప్పర్స్  ఉపయోగిస్తారు. అయితే నెయిల్ క్లిప్పర్స్‌కి బదులుగా నెయిల్ పాలిష్ ఉఫయోగించవచ్చు. వాడేసిన టీ బ్యాగ్‌ను కాస్త చింపి.. గోరు పగిలిన చోట దాన్ని ఉంచి నెయిల్ పాలిష్ అప్లై చేస్తే సరిపోతుంది.

Featured Image: Pixabay.com

Also Read:

బ్యూటీ రిజల్యూషన్స్: సులభమైన చిట్కాలతో అందం మీ సొంతం..

అమ్మాయిలూ.. యోని విషయంలో ఈ అపోహలను తొలగించుకోండి!

Read More From Home & Garden