కంగనా రనౌత్ (Kangana Ranaut)- ఈ పేరు వింటేనే బాలీవుడ్ (Bollywood)లో చాలా మందికి అనేక వివాదాలు గుర్తుకు వస్తాయి. మరికొంత మందికి మాత్రం హిందీ పరిశ్రమలో వేళ్లూనికొని పోయిన కుటుంబాల ఆధిపత్యానికి చెక్ చెప్పే ఓ టాలెంటెడ్ నటి గుర్తుకు వస్తుంది. ఏదేమైనా కంగన అంటేనే ఓ ప్రత్యేకమైన నటి అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఈ కథానాయిక.
తాజాగా కంగన టైటిల్ రోల్ పోషించిన చిత్రం మణికర్ణిక – ది క్వీన్ అఫ్ ఝాన్సీ (Manikarnika – The Queen Of Jhansi) ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం నుండి మొన్నీ మధ్యనే విడుదలైన ట్రైలర్ వరకు.. ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడూ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది.
అందుకు కారణాలూ అనేకం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ మధ్యలోనే ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో.. ఈ సినిమా పైన నీలి నీడలు కమ్ముకున్నాయి.
క్రిష్ ఈ చిత్రాన్ని మధ్యలో వదిలేయడానికి కారణం “మణికర్ణిక” చిత్ర షూటింగ్‌లో ఏర్పడిన జాప్యం ఒకటైతే.. మరొకటి ఆయన బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఎన్ఠీఆర్ బయోపిక్ రెండు భాగాలకూ దర్శకత్వం వహించడం. క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్ఠీఆర్ కథానాయకుడు (NTR Kathanayakudu) చిత్రం కూడా ఈ నెలలోనే విడుదల కావడం గమనార్హం.
క్రిష్ “మణికర్ణిక” ప్రాజెక్టు నుండి తప్పుకున్నాక.. ఆ సినిమాకి పని చేస్తున్న ప్రధాన టెక్నీషియన్స్ అందరూ ఒక్కొక్కరిగా ఈ సినిమా నుండి బయటకి వచ్చేశారు. దాంతో అసలు ఈ సినిమా విడుదలవుతుందా లేదా అన్న ప్రశ్నలు కూడా ప్రేక్షకులను వెంటాడాయి. ఆ తరుణంలో కంగనా రనౌత్ తీసుకున్న నిర్ణయం ఈ చిత్రాన్ని ఒక సంచలనంగా మార్చేసింది. సగంలో ఆగిపోయిన సినిమాకి దర్శకత్వం వహించడానికి కంగన ముందుకు రావడం బాలీవుడ్‌లో నిజంగానే ఓ చర్చకు దారి తీసింది.
కంగన “మణికర్ణిక” చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకునే సమయానికి.. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతమే మాత్రమే పూర్తయింది. ఇక ఆ పరిస్థితి నుండి ఈ చిత్రాన్ని పూర్తిచేయడంతో పాటు.. ఇప్పుడు దానిని విడుదల చేసేందుకు సిద్ధం చేయడం వెనుక ఆమె పడిన శ్రమ, చేసిన కృషి ఎంతో ఉంది. ఒక నటిగానే కాకుండా.. ఈ చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచి తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం ద్వారా కూడా తనలోని సత్తాని చాటగలిగింది.
ఇక ఈ చిత్రానికి కథను “బాహుబలి” రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) అందివ్వగా కథనం-మాటలు ప్రసూన్ జోషి (Prasoon Joshi) అందించారు. దీనితో ఈ చిత్రం పై సినీ అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అదే సమయంలో.. ఇది ఒక వీర వనిత కథ అవ్వడంతో ఎటువంటి పొరపాటు లేకుండా చిత్రీకరించేందుకు యూనిట్ మొత్తం తమ శాయశక్తులా కృషి చేసింది.
ఇవ్వన్ని పక్కకి పెడితే, కంగన ఈ చిత్రంలో వీరనారి లక్ష్మీబాయి పాత్రని చేయడానికి పలు యుద్ధ విద్యలు నేర్చుకోవడంతో పాటు కత్తిసాములో (Sword FIghting) ప్రత్యేక తర్ఫీదు పొందింది. అలాగే గుర్రపు స్వారీలో (Horse Riding) కూడా పట్టు సాధించింది. ఇప్పటికే నటన పరంగా తన స్టామినా ఏంటో అందరికి చూపిన కంగనా.. ఇప్పుడు మరోసారి తన సత్తా ఏమిటో చూపేందుకు మణికర్ణిక రూపంలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
మణికర్ణిక చిత్రాన్ని ZEE స్టూడియోస్ సంస్థ పైన కమల్ జైన్ & నిశాంత్ నిర్మిస్తుండగా లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సంగీతం విషయానికి వస్తే శంకర్ -యెహసాన్-లాయ్ ఈ చిత్రానికి పాటలు సమకూర్చగా సంచిత & అంకిత్ నేపధ్య సంగీతాన్ని అందించారు. పైగా ఈ చిత్రంలో VFX షాట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, వాటికోసమే ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చినట్లు సమాచారం. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ కూడా విడుదలైంది.
ఈ చిత్రం 2019లో బాలీవుడ్‌లో విడుదలయ్యే మొదటి భారీ చిత్రం అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. ఈ చిత్ర విజయంతో.. కొత్త సంవత్సరానికి బాలీవుడ్ స్వాగతం పలుకుతుందా లేదా అనేది ఇంకొక మూడు వారాల్లో తేలిపోతుంది.
ఇవి కూడా చదవండి
కంగన రనౌత్ మణికర్ణిక చిత్రంపై వస్తున్న మెమ్స్ గురించి ఆంగ్లంలో చదవండి
కంగన రనౌత్ మణికర్ణిక చిత్రం గురించి మరిన్ని విశేషాలను ఆంగ్లంలో చదవండి
మణికర్ణిక కంగన రనౌత్‌తో అంకిత లోఖండే జరుపుకున్న బర్త్ డే పార్టీ గురించి ఆంగ్లంలో చదవండి
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.