కన్నడ నటుడు సుదీప్ (Sudeep), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఈగ, బాహుబలి వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సుదీప్ తాజాగా “సైరా”లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ట్విటర్‌లో అమితాబ్‌తో దిగిన ఫోటోని షేర్ చేశారు.
“తొలిసారిగా ‘రణ్’ అనే చిత్రంలో బిగ్ బి అమితాబ్ గారితో పనిచేశాను. ఆ సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత మళ్లీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం దక్కింది. సినిమా కోసం, అభిమానుల కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన బిగ్ బితో మరోసారి నటించడం అనేది.. నిజంగానే నాకు మధురమైన క్షణం. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన రామ్ చరణ్‌కు, సుధీర్ రెడ్డికి ధన్యవాదాలు. నా పై చూపిన ప్రేమకు అమితాబ్ గారికి థ్యాంక్స్” అని తెలిపారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ ‘సైరా’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా.. నయనతార కథానాయికగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ పనిచేయడం విశేషం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను అందిస్తుండగా.. అమిత్ త్రివేది సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రధానమైన అవుకు రాజు పాత్రలో సుదీప్ నటించడం గమనార్హం. 1997లో ‘బ్రహ్మ’ అనే కన్నడ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన సుదీప్, అనతికాలంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకున్నారు.
ఆ తర్వాత ఫూంక్, రణ్, రక్త చరిత్ర లాంటి హిందీ చిత్రాలలో కూడా నటించి బాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ‘ఈగ’ చిత్రం సుదీప్ కెరీర్‌ను బాగా మలుపు తిప్పిందని చెప్పవచ్చు.
ఆ తర్వత అడపాదడపా తెలుగు చిత్రాలలో నటిస్తూ వస్తున్నారాయన. ముంబయిలోని రోహన్ తనేజా యాక్టింగ్ స్కూలులో నటన శిక్షణ తీసుకున్న సుదీప్.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించారు. కిచా క్రియేషన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. అలాగే సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో కర్ణాటక బుల్డోజర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు సుదీప్.
ప్రస్తుతం ‘సైరా’ చిత్రంపై అనేక ప్రత్యేక వార్తలు వస్తున్నాయి. దాదాపు నాలుగు భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్న చిత్రంగా ఈ సినిమాను పేర్కొనవచ్చు. నరసింహారెడ్డి జీవితంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ నటిస్తుండగా.. వీరారెడ్డి పాత్రలో జగపతి బాబు, పాండి రాజా పాత్రలో విజయ్ సేతుపతి, అవుకు రాజు పాత్రలో సుదీప్ నటిస్తుండడం గమనార్హం. ఈ పాత్రలకు సంబంధించిన క్యారెక్టర్ లుక్స్‌ని ఇప్పటికే నిర్మాతలు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి
నా 14 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఒక అందమైన కల: అనుష్క శెట్టి
తమిళ స్టార్ విజయ్ తెర పైనే కాదు.. నిజ జీవితంలో కూడా ఆయన ఫ్యాన్స్‌కి హీరోనే!
“సైరా” చిత్రంలో.. కథను మలుపు తిప్పే మెగా డాటర్..?