Astrology

మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!

Soujanya Gangam  |  Jul 25, 2019
మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!

జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం ప్రతి ఒక్కరికీ ఓ రాశి (zodiac sign) ఉంటుంది. మీ రాశిని బట్టి మీ వ్యక్తిత్వం కూడా ఉంటుంది. అలాగే బలాలు, బలహీనతలు కూడా ఉంటాయి. భగవంతుడు కొన్ని విషయాల్లో కొందరికి ఎక్కువ, మరికొందరికి తక్కువ ఇస్తుంటాడు. ఇలా ప్రతి ఒక్కరూ విభిన్నంగా ఉంటారు. ఇలా దేవుడు మనకిచ్చిన బలాలు.. మన జీవన ప్రయాణంలో ఎంతగానో తోడ్పడతాయి.

మనకు తెలిసి మనం పెంపొందించుకున్న బలాలతో పాటు.. మనకు తెలియకుండా కూడా మనలో కొన్ని బలాలుంటాయి. అవి మన పుట్టుకతో వచ్చినవి. అంతేకాదు.. కొందరికి పుట్టుకతో వచ్చిన బలహీనతలు కూడా ఉంటాయి. వాటి గురించి కష్టపడి తెలుసుకొని మార్చుకుంటే తప్ప.. అవి జీవితాంతం అలాగే ఉంటాయి. ఈ  క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశుల ఆధారంగా.. వ్యక్తుల బలాలు బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

giphy

మేషం (Aries)

ఈ రాశి వారు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. వీరిలో చాలా శక్తి దాగి ఉంటుంది. ఇదే తమ బలం. కానీ వీరు కేవలం తమ గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించుకుంటారు.ఈ ఒక్క విషయంలో ఇతరులు వీరిని పెద్దగా ఇష్టపడరు. ఇదే వీరిలోని బలహీనత.

వృషభం (Tarus)

ఈ రాశి వారు చాలా ఎక్కువగా కష్టపడుతుంటారు. అదే వీరి బలం. ఎంతటి కష్టమైన పనైనా సరే.. రెండోసారి ఆలోచించకుండా చేసేస్తారు. అయితే వీరి మనస్తత్వం అంతే కఠినమైనది. ఈ కఠినమైన మనస్తత్వంతో ఇతరుల మనసులను గాయపరుస్తారు.

మిథునం (Gemini)

ఈ రాశి వారి ముఖ్యమైన బలం వారి మాటకారితనమే. తమ మాటలతో ఎలాంటి కష్టాన్నైనా ఇట్టే అధిగమించేస్తారు. కానీ ఈ మాటకారి వ్యక్తులు.. ఎదుటి వ్యక్తి మాటలు విని వారిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. ఇదే వారి అతి పెద్ద బలహీనత.

కర్కాటకం (Cancer)

ఈ రాశి వారికి ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవే వారిని మిగిలిన వారితో పోలిస్తే విభిన్నంగా మారుస్తాయి. అయితే వీరికి ఎక్కువగా నిరాశావాద ధోరణి ఉంటుంది. ఇది వారిని జీవితంలో ఎదగకుండా చేస్తుంది. వారి జీవితం పట్ల ఆనందం లేకుండా చేస్తుంది. ఇదే వారి బలహీనత.

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

giphy

సింహం (Leo)

ఈ రాశి వారి బలం వారిలోని నాయకత్వ లక్షణాలు. వీరిలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది వారిని ఇటు పర్సనల్ లైఫ్‌లోనూ.. అటు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ అందరిలో ప్రత్యేకంగా నిలుపుతుంది. వీరి అతి పెద్ద బలహీనత డబ్బు. వీరికి లగ్జరీగా జీవించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వీరి విషయంలో తక్కువ.

కన్య (Virgo)

ఈ రాశి వారిని నిశితమైన పరిశీలనా శక్తి ఉంటుంది. వీరు చేసే పరిశీలనకు పెద్ద పెద్ద పజిల్స్.. చిన్న ఆటల్లాగా తోస్తాయి. అయితే వీరు తమ గురించి ఎలాంటి చెడు వినడానికి ఇష్టపడరు. ఇదే వారి పెద్ద బలహీనత. ఎవరైనా తమ గురించి తప్పుగా మాట్లాడితే వీరికి కోపం వచ్చేస్తుంది.

తుల (Libra)

ఈ రాశి వారు అన్ని విషయాల్లోనూ బ్యాలన్స్‌డ్‌గా ఉండాలనుకుంటారు. ఎవరికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఉండరు. ఈ రాశివారు అనుకున్న లక్ష్యాలను చేరుకొని.. సక్సెస్‌ఫుల్‌గా జీవిస్తారు. అయితే అందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి బలహీనత బద్ధకం. దీనిని వదిలించుకుంటేనే గాని సక్సెస్ వీరి దరిచేరదు.

వృశ్చికం (Scorpio)

ఈ రాశి వారు తమ పనులను రహస్యంగా చేసేందుకు ఆసక్తి చూపుతారు. పని జరిగిన తర్వాత వచ్చిన సక్సెస్ మాత్రమే మాట్లాడాలి తప్ప.. తాము మాట్లాడకూడదన్నది వీరి భావన. అదే వీరి బలం కూడా. ఇక బలహీనత విషయానికొస్తే ఈ రాశి వారు ఎప్పుడూ నిజమే మాట్లాడాలనుకుంటారు. సమయానికి తగినట్లుగా మాట్లాడలేకపోవడం వీరి బలహీనత. దీనివల్ల చాలామంది.. వీరితో తమ గురించి రహస్యాలు చెప్పడానికి వెనుకాడతారు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

giphy

ధనుస్సు (Saggitarius)

ఈ రాశి వారికి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుందట. దీంతో బోరింగ్‌గా అనిపించే పనిని కూడా వాళ్లు చాలా క్రియేటివ్‌గా మార్చి ప్రత్యేకంగా చేసి చూపిస్తారు. ఇక వీరి బలహీనత విషయానికొస్తే పందేలు కాయడం వీరిలోని ప్రధాన లోపం. తాము చేసే పనుల గురించి లేదా ఇతరుల చేసే పనుల గురించి పందేలు కాయడానికి వీరు ఆసక్తి చూపుతారట.

మకరం (Capricorn)

మకర రాశి వారికి పాజిటివ్ ఆలోచనా ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఇదే వారి బలంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాజిటివ్‌గా ఆలోచించి అనుకున్నది సాధించడం వీరి తత్వం. అయితే వీరికున్న బలహీనత మాత్రం ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నా.. ఆనందంగా ఉండలేకపోవడం. దానికి కారణం ఈర్ష్య పడే తత్వం. ఇతరుల ఆనందంలో వీరు పాలు పంచుకోలేరు. బయటకు ఆనందంగా ఉన్నట్లు నటించినా.. లోపల మాత్రం వారు బాధపడుతూ ఉంటారు.

కుంభం (Aquarius)

ఈ రాశి వారు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినా.. తొణకకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి దశలోనూ తమకు తామే తోడుగా ముందుకు సాగుతారు. జీవితం ఎలా ఉన్నా ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రేమలో పడితే మాత్రం.. ఈ రాశి వారు ఇంకేమీ పట్టించుకోరు. తాము ప్రేమించిన వారికోసం ఏదైనా చేస్తారు. కానీ ఇలా అతి ప్రేమ చూపినా.. చాలాసార్లు వారికి ప్రేమలో మోసమే జరుగుతుంది.

మీనం (Pisces)

మీన రాశి వారు చాలా ఆదర్శవంతంగా ఆలోచిస్తారట. ఇది చాలామందిని ఆకట్టుకుంటుంది. ఈ ఆలోచనా తీరు వల్లే వారు ఇటు పర్సనల్ లైఫ్‌లోనూ.. అటు ప్రొఫెషనల్ జీవితంలో విజయం సాధిస్తారు. అయితే భావోద్వేగాలకు దాచుకోలేకపోవడం వీరి బలహీనత. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని వీరిని ఏడిపించాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

Read More From Astrology