DIY Life Hacks

బద్ధకస్తులు అయితే.. ఈ చిట్కాలతో భలే ప్రయోజనాలు పొందవచ్చు..!

Soujanya Gangam  |  Dec 28, 2019
బద్ధకస్తులు అయితే.. ఈ చిట్కాలతో భలే ప్రయోజనాలు పొందవచ్చు..!

(Life Hacks (Tips) for a Lazy Woman)

శీతాకాలం వేళ.. ఉదయాన్నే చల్లని చలి గిలిగింతలు పెడుతుంటే నిద్ర లేవాలని కూడా అనిపించదు. మీరు కూడా ప్రతిరోజూ ఉదయం ఇలాగే ఆలోచిస్తున్నారా? మళ్లీ రాత్రి ఎంత తొందరగా అవుతుంది..  ఎప్పుడు పడుకుందామా? అని వేచి చూస్తున్నారా? అయితే తమరూ నాలాంటివారే అన్నమాట. అవునండీ.. నేను చాలా బద్ధకస్తురాలిని. ఈ విషయం ఒప్పుకోవడానికి నాకేమీ ఇబ్బంది లేదు. కానీ  నా బద్దకం గురించి అందరికీ తెలియదు. అలాగే మీరు కూడా ఒక బద్ధకస్తురాలనే ఫీలింగ్‌ను ఎదుటివారికి కల్పించకుండా.. పనులను వేగంగా చేయాలంటే ఇలాంటి చిట్టిపొట్టి చిట్కాలు పాటించేయండి.

1. స్నానం చేయాలనిపించట్లేదా?

మీకు ఎప్పుడైనా స్నానం చేయాలనిపించలేదా? అయితే డ్రై షాంపూ, వెట్ వైప్స్‌లతో స్నేహం చేయండి. ఇవి చాలా తక్కువ సమయంలో మిమ్మల్ని శుభ్రంగా మార్చేస్తాయి. అందుకే బద్ధకంగా పడుకున్న తర్వాత సడన్‌గా బయటకు వెళ్లాల్సి వస్తే.. వీటిని ఉపయోగించి నిమిషాల్లో అద్భుతంగా సిద్ధమైపోవచ్చు.

2. కిచెన్ ఇలా శుభ్రం

మీ ఫ్రిజ్ పై ఉతకడానికి వీలుగా ఉండే మ్యాట్స్, కిచెన్ శ్లాబ్ పై ప్లాస్టిక్ ఫాయిల్స్.. ఇలా వంటగదిని సులువుగా శుభ్రం చేసేందుకు వీలుగా అన్నీ అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల క్లీనింగ్ చాలా సులువవుతుంది. వంట కూడా చాలా సులువుగా పూర్తవుతుంది.

3. ఇంటిని ఇలా..

నేను బద్ధకస్తురాలిని కాబట్టి.. నా గది శుభ్రంగా ఉండదు అనుకుంటే అది తప్పు. అయితే నేను ఇంటిని శుభ్రం చేయాలనుకున్నప్పుడు.. ఒక్కో గది శుభ్రం చేయడం కాకుండా.. ఒకసారి డస్టింగ్, మరో రోజు అన్నీ సర్ది పెట్టడం, మరో రోజు శుభ్రంగా తుడిచి పెట్టడం వంటివి చేస్తుంటాను. ఇలా చేయడం వల్ల సులువుగా పనైపోతుంది.

4. స్నూజ్ బటన్..

బద్ధకస్తులందరికీ అత్యంత ఇష్టమైన పని బాగా నిద్రపోవడం. కానీ ఎంత వద్దనుకున్నా పని చేయక తప్పదు కాబట్టి.. పని ఉన్న రోజు మీరు లేవడానికి ఓ పావు గంట ముందు అలారం పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల  మీకెంతో ఇష్టమైన స్మూజ్ బటన్ వత్తే అవకాశం మీకు దొరుకుతుంది.

మీకూ ఇలాంటి కలలు వస్తుంటాయా? అయితే వాటి అర్థాలేమిటో తెలుసుకోండి

5. ఓ మంచి స్వెట్ షర్ట్..

మన దినచర్యలో భాగంగా చేసే అత్యంత ముఖ్యమైన పని.. అలాగే అత్యంత సమయం పట్టే పని బట్టలు సెలెక్ట్ చేసుకోవడం. చలికాలం అయితే వీటి కోసం మంచి చిట్కాలు ఉపయోగించి పరిష్కారం చూపించవచ్చు. నాలుగైదు అందమైన స్వెట్ షర్ట్స్ కొనుక్కొని వాటిని ఉపయోగిస్తే సరి. మీరు ఎలాంటి దుస్తులు వేసుకున్నా సరే.. అంత ఇబ్బంది ఉండదు.  అలాగే చలివేయకుండా కూడా ఉంటుంది. 

6. నో మేకప్ లుక్..

ఇది జోక్ కాదు.. నేను మేకప్ పెద్దగా ఉపయోగించను. కేవలం ఐ లైనర్, మస్కారా, లిప్ స్టిక్ మాత్రమే వాడతాను. రెండు నిమిషాల్లో అద్భుతంగా కనిపించేందుకు ఇవి చక్కగా నప్పుతాయి. బద్ధకస్తులు మాత్రమే కాదు.. మేకప్ వేసుకోవడానికి ఇష్టం లేని వారు కూడా దీన్ని వాడవచ్చు. 

7. ఐరన్ చేయండి.

దుస్తులు ఐరన్ చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. సులువుగా అయిపోవాలంటే దాన్ని హ్యాంగర్‌కి వేలాడదీసి హెయిర్ స్ట్రెయిటనర్ సాయంతో ఐరన్ చేస్తే సరి. సులువుగా పని అయిపోతుంది. బద్ధకస్తులు మాత్రమే కాదు.. ఎవరైనా ఈ చిట్కా పాటించవచ్చు. 

ఉదయాన్నే మొబైల్ ఫోన్ చూసే అలవాటు మీకుందా? అయితే ఇది చదవాల్సిందే..

8. బ్లో డ్రై చేసేయండి..

బద్ధకస్తులు కదా అని ఫిట్ నెస్ పై శ్రద్ధ వహించకుండా ఉంటామని ఎవరు చెప్పారు? వర్కవుట్ మాత్రం తప్పనిసరి. ఎన్ని పనులున్నా.. దాన్ని మాత్రం మానేదే లేదు. కానీ సాయంత్రం వర్కవుట్ చేసి ఆ తర్వాత నైటవుట్ లేదా పార్టీకి వెళ్లాల్సి వస్తే అదే తడి, చెమట జుట్టుతో వెళ్తే ఏం బాగుంటుంది? అందుకే వర్కవుట్ తర్వాత పార్టీకి వెళ్లాల్సి వస్తే.. మీ జుట్టును ఓసారి బ్లో డ్రై చేస్తే చాలు. దీనివల్ల మీ జుట్టు చెమట వాసన లేకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు డ్రై షాంపూ ఉపయోగించడం మంచిది కాదు.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

Read More From DIY Life Hacks