Beauty

ఈ మేకప్ చిట్కాలు పాటిస్తే చాలు.. వర్షాకాలంలోనూ అందంగా కనిపించవచ్చు..!

Soujanya Gangam  |  Jul 24, 2019
ఈ మేకప్ చిట్కాలు పాటిస్తే చాలు.. వర్షాకాలంలోనూ అందంగా కనిపించవచ్చు..!

వర్షాకాలం (monsoon).. చాలా సరదాగా, రొమాంటిక్‌గా అనిపిస్తుంది. అయితే వర్షాలు అందంతో పాటు కాస్త చికాకునూ మూటగట్టుకొస్తాయి. వర్షాకాలంలో ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే చాలు.. గొడుగు, రెయిన్ కోట్ వంటివన్నీ తప్పనిసరి. ఇవన్నీ ఉన్నా సరే.. కొన్ని సార్లు వర్షం ధాటికి దుస్తులు పాడయిపోతాయి. అంతేకాదు.. అనుకోకుండా గొడుగు లేకుండా బయటకు వెళ్లామా?

అంతే.. మన దుస్తులతో పాటు కష్టపడి వేసుకున్న మేకప్ (makeup) మొత్తం పాడవుతుంది. జుట్టు చెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో పాడవకుండా మేకప్ వేసుకోవడం కాస్త సవాలే అని చెప్పుకోవాలి. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. ఫ్రెష్‌గా, అందంగా కనిపిస్తూనే మేకప్ చెరిగిపోకుండా జాగ్రత్త పడచ్చు.

1. ఫౌండేషన్ వద్దు

shutterstock

వర్షాకాలంలో వాతావరణంలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా తడిగా అనిపిస్తుంది. గాలిలోని ఈ తేమ మీ మేకప్ పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి చాలా లైట్‌గా మేకప్ చేసుకోవడం మంచిది. ఫౌండేషన్‌కి బదులుగా వర్షాకాలంలో బీబీ క్రీం లేదా సీసీ క్రీం ఉపయోగించడం వల్ల మీ ముఖంపై తేమ, నూనె వంటివి కనిపించకుండా ఫ్రెష్‌గా కనిపించే వీలుంటుంది.

2. ఫేస్ క్రీం కూడా..

ఫేస్ క్రీం కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు. దీని బదులు లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది. వాటర్ బేస్ ఉన్న మాయిశ్చరైజర్ ఎంచుకోవడం వల్ల.. వాతావరణానికి తగినట్లుగా మీ చర్మం కూడా అందంగా కనిపించే వీలుంటుంది. మ్యాట్ సన్ స్క్రీన్ లోషన్‌ని బేస్‌గా ఉపయోగిస్తూ.. మేకప్ చేసుకోవడం వల్ల చర్మంపై నూనె లేకుండా చూసుకోవచ్చు. ఇది పగలు, రాత్రి.. ఏ సమయానికైనా ఉత్తమమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు.

3. ప్రైమర్ అత్యవసరం

shutterstock

ఫేస్ క్రీం, ఫౌండేషన్ క్రీం అవసరం లేదు అన్నాం కదా అని.. మొత్తం మేకప్‌కే దూరంగా ఉండాలేమో అని భావించడం సరికాదు. వర్షాకాలం అయితేనేం..? మేకప్‌కి అదేదీ అడ్డు కాదు. అయితే వర్షాకాలంలో మేకప్ వేసుకోవాలనుకుంటే ముందుగా ప్రైమర్‌ని ఉపయోగించడం అవసరం. ఇది మీరు వేసుకునే మేకప్ చెరిగిపోకుండా చూస్తుంది.

వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండేందుకు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

4. ఐబ్రోస్ కోసం..

అందంగా కనిపించడంలో ముఖంలో అన్నింటికంటే ఎక్కువగా కళ్లదే ప్రాధాన్యత. కనుబొమ్మలు అందంగా తీర్చిదిద్దుకుంటే చాలు.. ముఖానికి సగం అందం వచ్చేసినట్లే. అయితే వానాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు తడిసిపోతారేమోనన్న భయం ఉంటే ఐబ్రో పెన్సిల్‌కి కూడా దూరంగా ఉండొచ్చు. దీనికి బదులుగా ఐబ్రో బ్రష్ తీసుకొని.. దానికి కాస్త హెయిర్ జెల్ అద్ది ఆ బ్రష్‌తో కనుబొమ్మలకు షేప్‌ని అందించేందుకు ప్రయత్నించండి. ఇది మీ కనుబొమ్మలకు మంచి షేప్ అందించడంతో పాటు.. వర్షం పడితే మీ కనుబొమ్మల నుంచి నల్లని రంగు కిందకు కారుతూ ఉండే ఇబ్బంది నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.

5. వాటర్ ప్రూఫ్ మ్యాట్ లిప్ స్టిక్

shutterstock

క్రీమీగా, గ్లాసీగా మెరుస్తూ ఉండే లిప్ స్టిక్‌లన్నీ ఎండాకాలం వేసుకోవడానికి పనిచేస్తాయి. వానా కాలం బయటకు వెళ్లేటప్పుడు మాత్రం మ్యాట్ కలర్స్ ఎంచుకోవడం మంచిది. అంతేకాదు.. లిప్ గ్లాస్‌కి కూడా దూరంగా ఉండాలి. అవి తొందరగా చెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

6. కాజల్, ఐలైనర్ కూడా..

సాధారణంగా కళ్లకు కాటుకను ఇష్టపడని అమ్మాయి ఉండదేమో.. మరి, వానాకాలంలో కాజల్, ఐ లైనర్ వేసుకోవడం ఎలా అనుకుంటున్నారా? దీని కోసం మీరు  మంచి వాటర్ ప్రూఫ్ కాజల్, ఐ లైనర్ కొనుక్కోవాలి. ఇది వాటర్ ప్రూఫ్ అయ్యి ఉండడం వల్ల.. అందాన్ని అందించడంతో పాటు నీటిలో కరగకుండా ఉంటుంది. దీంతో పాటు లిక్విడ్ ఐ లైనర్‌కి బదులుగా.. పెన్సిల్ లేదా జెల్ ఐలైనర్‌ని వాడడం వల్ల అది కారిపోయే ప్రమాదం ఉండదు.

7. మస్కారా వద్దు..

shutterstock

సాధారణంగా ఐ మేకప్ చాలా తొందరగా చెరిగిపోతుంది. అందుకే మీరు అద్భుతంగా, అందంగా కనిపించాలని భావించినప్పుడు మాత్రం మస్కారాకి దూరంగా ఉండాలి. అదంటే ఎంత ఇష్టమైనా సరే.. మస్కారాని మాత్రం దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి, మస్కారా లేకుండా కళ్లు అందంగా కనిపించడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అంత ఆలోచన అవసరం లేదు. కళ్లపై చక్కటి ఐ షాడో ప్రైమర్  అప్లై చేసుకొని.. ఆ తర్వాత ఐ షాడో అప్లై చేసుకుంటే సరి. దీన్ని కూడా వాటర్ ప్రూఫ్ ఎంచుకుంటే మరీ మంచిది.

8. బ్లష్ ఇలా చేయండి.

మేకప్‌లో అత్యంత ముఖ్యమైన అంశం బ్లష్. ఇది మన ముఖానికి అందమైన గులాబీ మెరుపును జోడిస్తుంది. కానీ వానా కాలంలో ఎలా? అని ఆలోచిస్తున్నారా? దీని కోసం కూడా క్రీం బ్లష్‌ని ఎంచుకోవడం మంచిది. పౌడర్ బ్రష్ ఎండలు ఎక్కువగా ఉన్న రోజుల్లోనే పనిచేస్తుంది. కానీ.. వానాకాలంలో క్రీమ్ బ్లష్ ఉపయోగించడం వల్లే అది మీ చర్మానికి మరింత ఎక్కువ మెరుపును అందిస్తుంది.

9. ఇలాంటి హెయిర్ స్టైల్స్

instagram

ఎప్పుడూ వేసుకునే హెయిర్ స్టైల్స్ వానాకాలానికి పనికి రావు. ఈ కాలంలో ఎక్కువగా జుట్టును పట్టి ఉంచేలా కొప్పులు, జడలు వేసుకుంటూ ఉండాలి. జుట్టు అలా వదిలేయడం వల్ల.. వాతావరణంలోని తేమకు అది బిరుసుగా తయారవుతుంది. అందుకే ఈ కాలంలో.. జుట్టును ముడి వేసుకొని కొన్ని నగలు, యాక్సెసరీస్‌తో అందంగా తయారు కావచ్చు. ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా.. ఆ తర్వాత హెయిర్ స్ప్రే కొట్టడం వల్ల జుట్టు అలా నిలిచి ఉంటుంది. అలాగే వాతావరణంలోని తేమ జుట్టును పాడు చేయకుండా కాపాడుకున్న వాళ్లమవుతాం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

Read More From Beauty