ఒడిశా (Odisha) రాష్ట్రంలోని అంగుల్ గ్రామంలో మానవత్వాన్ని చాటే ఒక చిత్రమైన సంఘటన జరిగింది. అంగుల్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ప్రతిమ బెహరా.. ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకొని వార్తలలో నిలవడం విశేషం. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆమె తన కుమారుడు రష్మీ రంజన్ వివాహాన్ని.. లిల్లీ అనే అమ్మాయితో జరిపించింది. అయితే బొగ్గు గనుల్లో జరిగిన ఓ ప్రమాదంలో ప్రతిమ కుమారుడు మరణించాడు. దీంతో అతని భార్య వితంతువుగా మారింది.
తన కుమారుడి వివాహం జరిగిన నెలల వ్యవధిలో.. ఇలాంటి బాధాకరమైన సంఘటన జరగడం ప్రతిమను బాగా కలచివేసింది. అలాగే 20 ఏళ్లు కూడా నిండని ముక్కుపచ్చలారని వయసులో తన కోడలిని వితంతువుగా చూడడం ఆమె తట్టుకోలేకపోయింది. ఆమెకి మళ్లీ పెళ్లి (Re Marriage) చేయాలని సంకల్పించింది. అయితే కొందరు బంధుమిత్రులు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ప్రతిమ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన కోడలి కోసం ఓ పెళ్లి సంబంధాన్ని తీసుకొని వచ్చింది. బాగా చదువుకొని.. ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని వరుడిగా ఎంపిక చేసింది.
ప్రేమ వివాహం.. ప్రేమతో మీకు నేర్పించే విషయాలు ఇవే..
అయితే తన అత్తమ్మ తీసుకొచ్చిన ప్రతిపాదనను లిల్లీ తొలుత అంగీకరించలేదు. అప్పటికే భర్తను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉందామె. అయినా సరే ప్రతిమ ఆమెకు మనోధైర్యాన్ని అందించింది. జీవితం అనేది కేవలం ఒక విషాద ఘటనతో ఆగిపోకూడదని.. ప్రతీ మనిషి ముందుకు వెళ్లి జీవనాన్ని కొనసాగించాలని తెలిపిందామె. అలాగే ఒకరి జీవితాన్ని శాసించే హక్కు ఎవరికీ లేదని.. అత్తమ్మగా కాకుండా ఓ తల్లిగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చానని ప్రతిమ తెలిపింది.
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి
సెప్టెంబరు 11వ తేదిన స్థానిక జగన్నాథ స్వామి ఆలయంలో.. వధు, వరులిద్దరికీ తానే స్వయంగా దగ్గరుండి వివాహాన్ని జరిపించిందామె. ఈ క్రమంలో లిల్లీ భర్త సంగ్రామ్ బెహరా మాట్లాడుతూ “నాతో పాటు మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ లిల్లీని.. ఇంటి కోడలిగా తీసుకురావడానికి ఒప్పుకున్నారు. అలాగే నేను కూడా నిండు మనసుతో ఆమెను భార్యగా స్వీకరించాను. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా.. మా కాపురం సుఖంగా సాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను” అని తెలిపాడు.
పెళ్లికి సిద్ధమయ్యేందుకు.. ఈ వధువులిచ్చే సలహాలు ఎంతో తోడ్పడతాయి..!
అయితే ఈ పెళ్లి సమయంలో.. లిల్లీకి తల్లి స్థానంలో కూర్చొని.. ప్రతిమ అన్ని పనులను చేయడం విశేషం. సారె పంపించడం దగ్గర నుండి.. కానుకలను అందించే వరకూ ప్రతీ పనిని ఆమె దగ్గరుండి చూసుకున్నారు. “నాకు ఆడపిల్లలు లేరు. నాకు కోడలైనా, కూతురైనా లిల్లీనే. అందుకే ఈ పనులన్నీ తల్లి ప్రేమతో చేశాను. తను ఎక్కడున్నా సంతోషంగా, ఆనందంగా ఉండడమే నాకు కావాలి. నేను కనకపోయినా… మా మధ్య పేగు బంధం లేకపోయినా.. లిల్లీ ఎప్పటికీ నా బిడ్డే” అంటూ భావోద్వేగాలను అణచుకుంటూ ప్రతిమ చెప్పడం గమనార్హం.
Featured Image: Shutterstock.com
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.