Lifestyle

కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!

Sandeep Thatla  |  Dec 27, 2018
కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ..  మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!

కొత్త సంవత్సరంలోకి (New Year) అడుగుపెట్టడానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. దీనితో ఇప్పటికే అందరిలోనూ  పార్టీ జోష్ వచ్చేసి ఉంటుంది. దీనితో డిసెంబర్ 31 రాత్రి ఎలా పార్టీ చేసుకోవాలి? ఎక్కడ చేసుకోవాలి? ఎవరెవరితో చేసుకోవాలి? అన్న ప్రశ్నలు ఒక పక్కనుండి మనని వేధిస్తూనే ఉన్నా.. మరోవైపు నుండి కొత్త సంవత్సరంలో మనం తీసుకోబోయే కొత్త తీర్మానాల గురించి ఆలోచనలు కుదిపేస్తూనే ఉంటాయి.

ఈ క్రమంలో చాలామంది సాధారణంగా తీసుకునే తీర్మానాల్లో కొన్నింటిని గురించి మనం తెలుసుకుందాం.

ఎందుకంటే జనసామాన్యంలో ఎక్కువమంది  ఈ క్రింద చెప్పిన తీర్మానాల్లో  ఏదో ఒకటి తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు కూడా ఇదే తరహాలో ఏదైనా తీసుకున్నారా? లేదా ఇంకేదైనా తీసుకున్నారో అన్నది ఈ క్రింద జాబితా ఒకసారి చదివితే తెలుస్తుంది.

* వ్యాయామం చేయడం ప్రారంభించడం (Start Working Out)

* డబ్బు పొదుపు చేయడం (Financial Discipline)

* కారు లేదా వాహనం కొనుక్కోవడం (Buy A Vehicle)

* ఇల్లు కట్టుకోవడం (Buy A House)

* సిగరెట్ మానెయ్యడం (Get Rid Off Smoking)

* మద్యపానానికి దూరంగా ఉండడం (Stop Drinking)

* తిండిని అదుపుచేయడం (To Maintain Healthy Diet)

* రోజువారి పనులల్లో క్రమశిక్షణ  పాటించడం (To Maintain Discipine in Daily Life)

* కోపం తగ్గించుకోవడం (To Control Anger)

* కుటుంబానికి సమయాన్ని కేటాయించడం (Giving Time to Family or Dear Ones)

* కొత్త హాబీని ప్రారంభించడం (To start a new hobby)

* కొత్త ఉద్యోగంలో చేరడం లేదా ఇష్టమైన కెరీర్ ఎంచుకోవడం (To start a new profession or job)

* కొత్త కోర్సులో చేరడం లేదా మీకు ఇష్టమైన కోర్సులో చేరాలని నిర్ణయించుకోవడం (To start a new course)

* కొత్త నిర్ణయాలు తీసుకోవడం (Taking new decisions)

* వివాహం చేసుకోవడం (Planning for marriage)

* విదేశీ యాత్రకు వెళ్లడం (Planning for International Tour)

* బద్ధకాన్ని వదిలించుకోవడం (To control Laziness)

* డైరీ రాయడం ప్రారంభించడం (To start writing Diary)

* సానుకూల భావధోరణిని పెంపొందించుకోవడం (To develop Positive Attitude)

* లక్ష్యాలను నిర్దేశించుకోవడం (To set targets)

అయితే పైన పేర్కొన్న 20 పాయింట్స్ (20 Points) మీరు తీసుకోబోయే తీర్మానానికి ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సహాయపడతాయని మా అభిప్రాయం.  ఇవి కాకుండా.. మీరు తీసుకొనే ఏదైనా తీర్మానం ఈ పైన పేర్కొన్న జాబితాలో లేకపోతే మీరు మా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయవచ్చు. మేము కూడా అది ఏమిటో తెలుసుకుంటాం. 

ఇక నా వరకైతే ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్‌ను ఒక ప్రత్యేకమైన విధానంగా భావించను. ఈరోజు మనం గడిపే రోజు కన్నా.. రేపటి రోజుని మెరుగుపరుచుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. అదే మనం జీవితంలో ముందుకి వెళ్ళేందుకు ఉపయోగపడుతుంది అని నా భావన.

ఏదేమైనా కొత్త సంవత్సరం వస్తున్న వేళ.. కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా.. ప్రతీరోజు మీకు ఒక గొప్ప అనుభూతిని పంచడంతో పాటుగా మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

Image: Pixabay

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం

న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఇవ్వాలని భావిస్తున్నారా.. అయితే ఈ సైట్ సందర్శించాల్సిందే

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌‌కి వెళ్లాల్సిందే..!

Read More From Lifestyle