Lifestyle

దేశాన్నే అబ్బురపరిచిన.. హైదరాబాదీ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ : ఈ టాప్ 5 విశేషాలు మీకోసం

Sandeep Thatla  |  Jan 8, 2020
దేశాన్నే అబ్బురపరిచిన.. హైదరాబాదీ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ : ఈ టాప్ 5 విశేషాలు మీకోసం

(Hyderabad’s All India Industrial Exhibition – Numaish 2020 garnering massive response)

హైదరాబాద్  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి యేటా జరిగే అఖిల భారతీయ పారిశ్రామిక ప్రదర్శనకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది.  ఈ ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం కూడా అంగరంగవైభవంగా జనవరి 1 తేదిన ప్రారంభమైంది. అయితే చాలామంది ప్రజలకు ఇది నుమాయిష్‌‌గా పరిచయం. ప్రతి ఏడాది  జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు.. దాదాపు 45 రోజుల పాటు వినియోగదారులకు కనువిందు చేస్తుంది ఈ ప్రత్యేక ప్రదర్శన. ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు లభించే అరుదైన వస్తువులన్నీ దొరుకుతాయి. అలాగే జంట నగరాల ప్రజలకు ఈ నుమాయిష్‌తో ఎంతో అనుబంధం ఉంటుంది.

ఈ క్రమంలో మనం కూడా ఈ ఏడాది ‘నుమాయిష్ 2020’ ప్రత్యేకతలను తెలుసుకుందాం ..! ఈ క్రమంలో మేం అందిస్తున్న టాప్ 5 విశేషాలివే 

హైదరబాదీ స్పెషల్ వంటకం.. ‘కిచిడి – ఖీమా’ తయారీ విధానం మీకోసం ..!

80 వసంతాల నుమాయిష్ –  ఇక ఈ ఏడాదితో నుమాయిష్ 80 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం విశేషం. దీనిని ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఈ 45 రోజులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా గత ఏడాది ఎగ్జిబిషన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా.. ఎన్నో స్టాల్స్ అగ్నిప్రమాదానికి గురి కావడంతో  కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. అయితే ప్రాణ నష్టం మాత్రం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకే ఈ సంవత్సరం భద్రతపరంగా కూడా హై సెక్యూరిటీకి ప్రాధాన్యమిచ్చారు.

అత్యున్నత భద్రత సేవలు – ఈ  ఏడాది నుమాయిష్ సందర్భంగా అత్యున్నత భద్రత సేవలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.  ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే 1 లక్ష లీటర్ల నీరు నిల్వ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అలాగే రెండు పంపులను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత ఏడాది అగ్నిప్రమాదం జరిగిన సమయంలో.. ఫైరింజన్ ఘటనా స్థలంలోకి ప్రవేశించి మంటలు ఆర్పడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. అందుకే ఈ సారి వాటర్ పంపులు ఏర్పాటు చేశారు.

 

Instagram

ప్రత్యేక బడ్జెట్  – అలాగే గత ఏడాది ఎక్కడ పడితే అక్కడ వేలాడ తీసిన కరెంట్ తీగల కారణంగా షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఈసారి ప్రతీ  స్టాల్ వద్ద ప్రత్యేకమైన ప్లగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఆ విధంగా షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలను నివారించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ రక్షణ చర్యల కోసం.. దాదాపు రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

స్టాల్స్‌కు బీమా సౌకర్యం –  గత ఏడాది స్టాల్స్ సంఖ్య దాదాపు 3 వేలు ఉండగా.. ఈ ఏడాది ఈ సంఖ్యను 2 వేలకు కుదించడం జరిగింది. అలాగే ప్రతి స్టాల్‌కు 45 రోజులకు ఇన్సూరెన్స్ తప్పనిసరి అని తెలియజేశారు. ఇన్సూరెన్స్ లేని వారికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. 

 

Instagram

హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!

1938లో హైదరాబాద్‌ పబ్లిక్ గార్డెన్స్‌లో తొలిసారి ఈ అఖిల భారతీయ పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించారు. ఆ తరువాత 1946 నుండి ఈ సంవత్సరం వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాత్రమే ఈ ప్రదర్శనకు వేదికైంది. ఇక ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో.. పేద విద్యార్థుల విద్యకు ఫండింగ్ ఇస్తున్నారు. అలా  చెప్పుకుంటూ పోతే.. ఈ ఎగ్జిబిషన్‌కి చాలా పెద్ద చరిత్రనే ఉంది.

రాష్ట్ర సంస్కృతికి పెద్దపీట –   ఈ ఎగ్జిబిషన్‌ వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా భిన్న ప్రాంతాల ఆహార పదార్ధాలు, వస్త్రాలు, హస్త కళల ఉత్పత్తులకు నుమాయిష్‌లో ప్రత్యేక ఆదరణ ఉంటుంది. వీటితో పాటుగా హైదరాబాద్  – సికింద్రాబాద్ నగరాలతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో విరివిగా లభించే వంటకాల రుచులు ఇతర రాష్ట్రాల వారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

జంటనగరాల్లో ఉండే ప్రజల్లో సహజంగానే.. ఈ ఎగ్జిబిషన్ గురించిన ఆసక్తి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే Numaish 2020 నిర్వాహకులు ఈసారి కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టడం విశేషం.

మెట్రో రైల్.. హైద‌రాబాద్‌కు ఒక వ‌రం.. ఇది నా అనుభ‌వం..!

Featured Images: Pixabay

Read More From Lifestyle