ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
మెట్రో రైల్.. హైద‌రాబాద్‌కు ఒక వ‌రం.. ఇది నా అనుభ‌వం..!

మెట్రో రైల్.. హైద‌రాబాద్‌కు ఒక వ‌రం.. ఇది నా అనుభ‌వం..!

హైదరాబాద్ (Hyderabad) – ఈ పేరు విన‌గానే మ‌న అనే ఒక భావ‌న మ‌న‌సులో క‌లుగుతుంటుంది. ఈ న‌గ‌రానికి ఏదో ఒక ప‌ని నిమిత్తం లేదా ప‌ని వెతుక్కునేందుకు.. ఇతరత్రా కార‌ణాల వ‌ల్ల ఎంతోమంది వ‌స్తూ ఉంటారు. ఇక ఈ భాగ్య‌న‌గ‌రంలో నివ‌సించే వారు స‌రేస‌రి! ఇలా ఇక్క‌డ ఉండే న‌గ‌రవాసుల‌తో పాటు వలస వచ్చేవారికి.. మొత్తం దాదాపు కోటి మందికి పైగా ఆశ్ర‌యం క‌ల్పిస్తూ భార‌తదేశంలోనే అతి పెద్ద న‌గ‌రాల్లో ఒక‌టిగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుంది.

ఇంత పెద్ద సంఖ్య‌లో జ‌నాభా ఉన్న ఈ న‌గ‌రంలో ప్ర‌జ‌లు ఏదో ఒక ప‌ని నిమిత్తం రోజూ ఒక ప్రాంతం నుంచి మ‌రొక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటారు. వీరిలో కొంద‌రు ఉద్యోగ‌స్థులైతే; ఇంకొంద‌రు చిరు వ్యాపారులు.. మ‌రికొంద‌రు విద్యార్థులు. ఎవ‌రైతేనేం.. ఈ నగరంలో ప్రతీ రోజూ ప‌లు ప్రాంతాల నుంచి ప్ర‌యాణించే వారి సంఖ్య 20 నుంచి 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. అందుకే భాగ్య‌న‌గ‌రంలో ర‌వాణా వ్య‌వ‌స్థ కూడా ఎంతో కీల‌క‌మైన అంశంగా మారింది.

Instagram-HyderabadMetro-1

క్ర‌మంగా పెరుగుతోన్న జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం, సంబంధిత అధికారులు సైతం సామాన్య ప్ర‌జానీకానికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడ‌డంలో భాగంగా తెర‌పైకి తీసుకొచ్చిన ర‌వాణా సాధ‌న‌మే మెట్రో రైల్. అదేనండీ.. మ‌నంద‌రికీ బాగా సుప‌రిచిత‌మైన హైద‌రాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail).

ADVERTISEMENT

వాస్త‌వానికి భాగ్య‌నగ‌రంలో మెట్రో స‌దుపాయం అందుబాటులోకి వ‌చ్చి 14 నెల‌లు కావ‌స్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు నేను కూడా మూడుసార్లు అందులో ప్ర‌యాణించాను ! కానీ నిన్న నాకు ఎదురైన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌ల దృష్ట్యా మెట్రో రైల్‌తో నాకు ఉన్న కొన్ని అనుభ‌వాల‌ను మీతో పంచుకోవాల‌ని అనుకుంటున్నాను.

Instagram-Hyd-Metro-2

నిన్న నేను సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్ (Parade Grounds) వ‌ద్ద ఉన్న‌ జూబ్లీ బస్ స్టేషన్ (Jubilee Bus Station) నుంచి మెహెదీప‌ట్నం (Mehdipatnam)కు చేరుకోవాల్సి ఉంది. అక్క‌డకు చేరుకునేందుకు నేను బ‌స్సు ఎక్కాను. సాధార‌ణంగా మెట్రో ఎక్కితే ట్రాఫిక్ స‌మ‌స్య లేక‌పోవ‌డంతో పాటు; ప్ర‌తి స్టేష‌న్‌లోనూ నిర్ణీత స‌మ‌యం మేర‌కు మాత్ర‌మే ఆగుతుంది. త‌ద్వారా మ‌న‌కు చాలా స‌మ‌యం ఆదా అవుతుంది. పైగా ట్రాఫిక్ ఇక్క‌ట్లు కూడా ఉండ‌వు.

కానీ నిన్న బ‌స్సులో ప్ర‌యాణించిన‌ప్పుడు ఈ స‌మ‌స్య‌ల‌న్నింటినీ మ‌రోసారి నేను చ‌విచూశా. నేను ప్ర‌యాణించాల్సిన దూరం కేవ‌లం 12 కిలోమీట‌ర్లు మాత్ర‌మే! కాకపోతే అందుకు ప‌ట్టిన కాలవ్య‌వ‌ధి మాత్రం సుమారు 45 నుంచి 55 నిమిషాలు.. కానీ నిర్ణీత గమ్య‌స్థానాన్ని చేరుకోవ‌డానికి ఏక‌ధాటిగా ప్ర‌యాణిస్తే నాకు దాదాపు 2 గంట‌ల 10 నిమిషాల స‌మ‌యం ప‌ట్టింది.

ADVERTISEMENT

Hyd-Metro-Sunday

ఇదే స‌మ‌యంలో నాకు తెలిసిన ఒక స్నేహితుడు నేను ప్ర‌యాణించిన మార్గంలోనే మెట్రోలో ప్ర‌యాణించి 30 నిమిషాల వ్య‌వ‌ధిలో గ‌మ్య‌స్థానాన్ని చేరుకున్నాడు. మెహదీప‌ట్నంకు నేరుగా మెట్రో రైల్ ఉండి ఉంటే అత‌ను ఇంకా ముందుగానే అక్క‌డ‌కు చేరుకునేవాడు. కానీ ఆ స‌దుపాయం లేక‌పోవ‌డంతో ముందుగా అమీర్ పేటకు వ‌చ్చి.. అక్క‌డి నుంచి మ‌రో మెట్రో రైల్ ఎక్కి ల‌క్డీక‌పూల్ చేరుకున్నాడు. అక్క‌డి నుంచి మెహదీప‌ట్నంకు బ‌స్సులో ప్ర‌యాణించిన కార‌ణంగా అత‌నికి కూడా సుమారు 10 నుంచి 15 నిమిషాల స‌మ‌యం ఎక్కువ ప‌ట్టింది.

నాకు ఎదురైన ఈ అనుభ‌వం గురించి నా స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌తో పంచుకున్నా. ఆ స‌మ‌యంలో వారు కూడా వారికి ఎదురైన కొన్ని అనుభ‌వాల‌ను నాతో పంచుకున్నారు. అవ‌న్నీ మీ అంద‌రితోనూ పంచుకుంటే బాగుంటుంద‌నిపించి వాటికి కూడా ఇలా అక్ష‌ర‌రూపం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నా.

Hyd-Metro-Safety-Check

ADVERTISEMENT

మా పెద్ద‌నాన్న మెట్రో రైల్ విష‌య‌మై నాతో పంచుకున్న త‌న అనుభ‌వం.. “బ‌స్సు క‌న్నా కాస్త ఎక్కువ  ఖ‌రీదైన టికెట్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌యాణం చాలా సౌక‌ర్య‌వంతంగా సాగింది. JNTU నుంచి MGBS కి అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేశా. ఇక నా స్నేహితుడు అయితే.. గ‌మ్య‌స్థానానికి చాలా త్వ‌ర‌గా చేరుకున్నాడు. ఇక్క‌డ‌కు నేరుగా మెట్రో స‌దుపాయం ఉండి ఉంటే ఇంకా ముందుగానే వ‌చ్చేసేవాడిని.. అన్నాడు.

ఈ రెండు అనుభ‌వాల్లోనూ ఒక‌రు వేగం గురించి మాట్లాడితే.. మ‌రొక‌రు ప్ర‌యాణ స‌మ‌యంలో ఉన్న సౌక‌ర్యం గురించి త‌మ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నారు. అంటే వీరి మాట‌ల‌ను బ‌ట్టి మెట్రో ప్ర‌యాణం ద్వారా కేవ‌లం స‌మ‌యం ఆదా అవ్వ‌డం మాత్ర‌మే కాదు.. అల‌స‌ట లేకుండా సౌక‌ర్య‌వంతంగా కూడా ప్ర‌యాణించవచ్చని జనాలు భావిస్తున్నారు. ఈ ర‌వాణా సౌక‌ర్యం శ్రేయ‌స్క‌రం అని అనుకుంటున్నారు క‌నుకే.. ఇప్పుడు మెట్రో రైల్‌ను న‌గ‌రంలోని ప్ర‌తి మూల‌కు విస్త‌రిస్తే ఇంకా స‌దుపాయంగా ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో మనం ఏడాది స‌మ‌యంలోనే న‌గ‌ర‌వాసుల మ‌న‌సుల‌ను గెలుచుకున్న హైద‌రాబాద్ మెట్రో రైల్ , దాన్ని విజ‌య‌వంతంగా న‌డిపిస్తోన్న యాజ‌మాన్యాన్ని అభినందించి తీరాల్సిందే! హైద‌రాబాద్ మెట్రో రైల్‌కు సంబంధించిన కొన్ని వివ‌రాలు ఓసారి చూద్దాం రండి..

* హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1లో మూడు లైన్స్‌ని ప్రతిపాదించగా.. అందులో 72 కిలోమీటర్ల మేర ఈ లైన్స్‌ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

ADVERTISEMENT

* అలాగే మూడు లైన్స్‌లో మెట్రో రైల్ ప్ర‌తిపాదించగా.. కేవ‌లం రెండు లైన్స్‌లో మాత్ర‌మే, అనగా ప్రస్తుతం 46.5 కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తోంది.

* 2019లో అమీర్ పేట్ – హైటెక్ సిటీ, JBS – MGBS, హైటెక్ సిటీ & రాయదుర్గం లైన్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

* MGBS – ఫలక్ నామా లైన్‌కి మాత్రం ఇంకాస్త సమయం ప‌ట్ట‌చ్చు.

ర‌వాణా విష‌యంలో ప్ర‌యాణీకుల‌కు సంతృప్తి క‌లిగించ‌డ‌మే కాదు.. హైద‌రాబాద్ మెట్రో రైల్ ఇప్ప‌టికే చాలా రికార్డులు కూడా సృష్టించింది. వాటిలో కొన్ని..

ADVERTISEMENT

* దాదాపు 30 కిలోమీటర్ల లైన్‌తో మొదలైన మెట్రో రైల్ మన దేశంలో ఇదే మొదటిది కావ‌డం విశేషం.

* మెట్రో ప్రారంభించిన తొలి నెలలోనే అత్యధిక సంఖ్య‌లో ప్ర‌యాణీకులు ఉపయోగించి మెట్రోగా “హైదరాబాద్ మెట్రో” రికార్డులు తిరగరాసింది.

* ఇప్పటి వ‌ర‌కు ఉన్న లెక్కల ప్రకారం మనదేశంలో అత్యంత ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగిస్తున్న రెండో మెట్రోగా హైదరాబాద్ మెట్రో రైల్ నిలిచింది.

* వీటితో పాటుగా పలు జాతీయ – అంతర్జాతీయ సంస్థలు ప్రకటించే అవార్డుల్ని సైతం హైదరాబాద్ మెట్రో రైల్ సొంతం చేసుకుంది.

ADVERTISEMENT

ఇలా అనేక రికార్డులు & అవార్డుల‌ను సొంతం చేసుకున్న హైదరాబాద్ మెట్రో రైల్‌కి పెరుగుతున్న ఆదరణ & అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) ఫేజ్ 2కి కూడా శ్రీకారం చుట్టింది. ఈ ఫేజ్ 2 లో హైదరాబాద్‌‌కి కాస్త దూరంగా ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. నగరంతో కలుపుతూ మెట్రోకీ రూపకల్పన చేశారు. అలాగే నగరంలోని కొన్ని ప్రాంతాలకు, మెట్రో ఫేజ్ 1లో చోటు దక్కనివాటికి.. ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉదాహరణకి – రాయదుర్గం – టోలిచౌకి – లక్డికాపూల్ మెట్రో లైన్ గురించి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.

గంగ-జమున తెహజీబ్‌గా పిలుచుకునే మన హైదరాబాద్‌లో.. సగర్వంగా నగరాన్ని చుట్టేస్తోన్న‌ ఈ మెట్రోలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి సంస్కృతిని ప్రతిబింభించేలా మెట్రోలో అనౌన్సమెంట్ – తెలుగు, ఉర్దూ & ఇంగ్లీష్ భాషల్లో మనం విన‌వచ్చు. మొత్తానికి హైదరాబాద్ నగరంలో ఒక భాగంగా కలిసిపోయిన హైదరాబాద్ మెట్రో రైల్ ఈ నగరానికి ఒక వరం అనే చెప్పుకోవ‌చ్చు.

Images: https://www.instagram.com/lthydmetrorail/

Facebook.com/Hyderabad Metro Rail

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి

ఇరానీ ఛాయ్ – కేర్ అఫ్ హైదరాబాద్

హైదరాబాద్ కీ షాన్.. సూపర్ టాలెంట్ ఈ క్రీడాకారిణుల సొంతం

క్రీడాకారులుగా దూసుకుపోవడానికి.. మన యువ హీరోలు రెడీ..!

ADVERTISEMENT
29 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT