ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఐటమ్ ఫేమస్. ఉదాహరణకు కాకినాడ కాజా.. ఆత్రేయపురం పూతరేకులు.. మరి, అదే హైదరాబాద్ విషయానికి వస్తే? చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి. కానీ వాటన్నింటిలోకెల్లా ముందువరుసలో ఉండేది మాత్రం హైదరాబాదీ బిర్యానీ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది హైదరాబాద్‌లో చాలా హోటల్స్‌లో లభ్యమవుతూ ఉంటుంది. అయితే వాటిన్నింటిలోనూ ప్యారడైజ్ హోటల్ (Paradise Hotel)కు ఉన్న స్థానం మాత్రం చాలా ప్రత్యేకం.
ఎందుకంటే హైదరాబాదీ బిర్యానీకి కేరాఫ్ అడ్రస్‌గా ఈ ప్యారడైజ్ హోటల్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు- ప్రఖ్యాతులున్నాయి. 1953లో ఒక చిన్న టీ కెఫే సెంటర్‌గా మొదలైన ఈ పాయింట్ క్రమంగా బిర్యానీ సెంటర్‌గా మారింది.
అంతేకాదు.. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకుల్లో దాదాపు 90% మంది హైదరాబాదీ బిర్యానీని రుచి చూసేందుకు వెళ్లేది ఇక్కడికే! ఇంతటి గుర్తింపు సంపాదించుకున్న ఈ హోటల్ తాజాగా మరొక ఘనతను కూడా సొంతం చేసుకుంది. అదేంటంటే..
ముంబయిలో తాజాగా జరిగిన ఆసియా ఫుడ్ కాంగ్రెస్ (Asia Food Congress)లో బిర్యానీని బాగా సర్వ్ చేస్తున్న రెస్టరెంట్‌గా (Restaurent Best Serving Biryani Award) అవార్డును కైవసం చేసుకుంది. 2017 సంవత్సరం పొడవునా ఈ హోటల్ 70,44,287 బిర్యానీలను అమ్మినట్లుగా రికార్డ్స్ చెప్పడంతో ప్యారడైజ్ హోటల్‌కు ఈ గుర్తింపు లభించింది.
అంతేకాదు.. ఈ గుర్తింపు ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ (Limca Book Of Records)లో స్థానం కూడా సంపాదించుకుందీ బిర్యానీ పాయింట్.
ఈ మధ్యకాలంలో ప్యారడైజ్ రెస్టరెంట్స్‌కు అధినేతగా వ్యవహరిస్తోన్న అలీ హేమతిని ఈ రంగంలో విశేషమైన సేవలందిస్తున్నందుకుగాను జీవిత సాఫల్య పురస్కారం అందించి, ఘనంగా సత్కరించారు. దీని ద్వారా ప్యారడైజ్ హోటల్ పేరు- ప్రతిష్ఠలు మరింత పెరిగాయనే చెప్పాలి. హైదరాబాద్ కేంద్రంగా మొదలైన ఈ బిర్యానీ పాయింట్ ఇప్పుడు పలు ప్రదేశాల్లో తమ శాఖలను విస్తరించింది. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్స్, కూకట్ పల్లి , కొత్తపేట్ & బేగంపేట్ ప్రాంతాల్లోనే కాకుండా చెన్నై, బెంగళూరు & విశాఖపట్నంలలో కూడా బ్రాంచ్‌లను తెరిచారు.
ఇక ప్యారడైజ్ హోటల్‌లో కేవలం బిర్యానీ మాత్రమే స్పెషల్ అని మీరు భావిస్తే పొరపడినట్లే. ఎందుకంటే.. ఇక్కడ ఇరానీ టీ & ఉస్మానియా బిస్కెట్స్.. వీటితో పాటుగా ఏటా రంజాన్ మాసంలో తయారయ్యే హలీం కూడా చాలా స్పెషల్. మీకు తెలుసా.. హలీంకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండడంతో ఆ సీజన్‌లో ఇక్కడ తయారుచేసే హలీంని విదేశాలకు సైతం ఎగుమతి చేయడం ప్రారంభించారు.
అయితే ఇదంతా చదివి.. ప్యారడైజ్ హోటల్ కేవలం మాంసాహార ప్రియుల కోసమే అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ శాఖాహారుల కోసం కూడా రుచికరమైన వెజ్ బిర్యానీ లభిస్తుంది. ఇంకెందుకాలస్యం.. అటుగా వెళ్లినప్పుడు మీరు కూడా మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్‌ని ఓ పట్టు పట్టేయండి మరి..!
మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్‌గా వెలిగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి – www.plixxo.com
ఇండియాలోనే అతి పెద్ద ఇన్‌ఫ్లూయెన్సర్ నెట్‌వర్కులో చేరి.. టాప్ బ్రాండ్స్‌తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.
Images: https://www.facebook.com/pg/ParadiseFoodCourt/
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!
తెలంగాణ స్పెషల్ వంటకం – సర్వ పిండి ముచ్చట్లు మీకోసం..!
హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ ఖీర్ టేస్ట్ చేయండి..!
గండికోట – ది ఇండియన్ గ్రాండ్ కాన్యన్ .. ఈ ప్రదేశాన్ని అందరూ చూసి తీరాల్సిందే..!