Celebrity Life

అప్పుడు జీవితమంటే నమ్మకం పోయింది.. చాలా రోజులు ఏడ్చా : పరిణీతి చోప్రా

Soujanya Gangam  |  Aug 8, 2019
అప్పుడు జీవితమంటే నమ్మకం పోయింది.. చాలా రోజులు ఏడ్చా : పరిణీతి చోప్రా

ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపోటములు, బాధ (sadness), సంతోషం వంటివన్నీ సహజంగానే ఉంటాయి. ఇవి లేకపోతే జీవితం కూడా బోర్ కొట్టేస్తుంది. అయితే చాలా కష్టాలు జీవితంలో ఒక్కసారే చుట్టుముట్టేస్తే ఏం చేయాలో అర్థం కాని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో చనిపోవాలనుకునేవాళ్లు కూడా చాలామందే. మరెందరో డిప్రెషన్ (Depression) లోకి వెళ్లిపోతారు. తనకూ అలాంటి అనుభవమే ఎదురైందని చెబుతుంది బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti chopra).

Instagram

2014-15 సమయంలో తన జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పిన ఆమె.. ఆ సమస్యలు తనని డిప్రెషన్‌లోకి తీసుకెళ్లాయని అప్పటి అనుభవాలను పంచుకుంది. తాజాగా ఓ సినిమా వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాలన్నీ వెల్లడించింది పరిణీతి. 2014, 15.. ఈ మధ్యలో ఒకటిన్నర సంవత్సరం పాటు “నా జీవితంలో డార్క్ ఫేజ్” అని చెబుతా. జీవితంలోనే నేను చూసిన అత్యంత బాధాకకరమైన రోజులవి. నేను నటించిన దావత్ ఎ ఇష్క్, కిల్ దిల్ సినిమాలు ఫ్లాపయ్యాయి.

దాంతో నాకు సినిమా ఆఫర్లు రాలేదు. నా దగ్గర డబ్బు లేకుండా అయిపోయింది. అంతకుముందు చాలా డబ్బు సంపాదించా. అయితే అప్పుడే కొత్త ఇల్లు కొనుక్కోవడం, చాలా ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాను. దీంతో డబ్బు లేకుండా అయిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ప్రేమలోనూ విఫలమయ్యాను. అటు కెరీర్, డబ్బు, ప్రేమ.. ఇలా నా జీవితంలో పాజిటివ్ కోణం అనేది ఏదీ లేకుండా అన్ని విషయాల్లోనూ ఫెయిలయ్యాను.

ఆ దెబ్బతో ఆరు నెలలు గతం మర్చిపోయా: దిశా పటానీ

Instagram

ఈ బాధతో నేను బయటకు రాలేకపోయేదాన్ని. భోజనం చేసేదాన్ని కాదు. స్నేహితులను కలిసేదాన్ని కాదు. బయటకే వచ్చేదాన్ని కాదు. నా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులందరితోనూ దూరంగా ఉండడం మొదలుపెట్టాను. ఎప్పడో పది, పదిహేను రోజులకోసారి మాట్లాడేదాన్ని. ఇక నా జీవితం అయిపోయింది.. ఇలాగే ఉండిపోవాల్సిందే అనుకునేదాన్ని. నా గదిలోనే పడుకొని టీవీ చూడడం, పడుకోవడం, లేదా ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండిపోవడం.. ఇవే నా పనులు. నాకు నేనే ఓ జాంబీలా కనిపించేదాన్ని. అసలు ఆ పరిస్థితి ఎప్పటికైనా మారుతుందని నేను అనుకోలేదు.

Instagram

అవును.. ప్రేమలో ఉన్నా.. అతడు నా బాధను మర్చిపోయేలా చేశాడు : అమలాపాల్

అయితే మా తమ్ముడు సహజ్, నా బెస్ట్ ఫ్రెండ్ సంజనా బాత్రా నన్ను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు. నాలో ఎంతో ఉత్సాహం నింపేవారు. అయినా సరే.. ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి నేను చాలా కష్టపడ్డాను. కనీసం రోజుకు ఓ పది సార్లయినా ఏడ్చేసేదాన్ని. ఎప్పుడూ ముభావంగానే ఉండేదాన్ని. ఇక ఎప్పుడూ ఛాతి భాగంలో నొప్పిగానే ఉండేది. అందరూ అనుకునే డిప్రెషన్‌కి నా పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుందేమో.. కానీ ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను.

కానీ మా తమ్ముడు, నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను బలవంతంగా బయటకు తీసుకెళ్లేవారు. అలా బయటకు వెళ్తూ నా స్నేహితులను తిరిగి కలవడం ప్రారంభించిన తర్వాత.. నా పరిస్థితి కాస్త బెటర్‌గా మారింది. ఆ తర్వాత చాలామందికి ఫోన్ చేసి.. వాళ్ల ఫోన్లు ఎత్తకుండా ఇంతకాలం టచ్‌లో లేకుండా పోయినందుకు సారీలు చెప్పాల్సి వచ్చింది. అది వేరే విషయం.

కానీ పాతికేళ్ల వయసులోనే ఇలాంటి పరిస్థితులన్నీ డీల్ చేయడం వల్ల చాలా నేర్చుకోగలిగాను. జీవితం నాకు ఎలాంటి కష్టాలను చూపించినా.. ఓటములు, బాధలు చుట్టుముట్టినా..  వాటిని ఎదుర్కోగలిగే ధైర్యం నా సొంతమైంది. అంతేకాదు.. దేవుడు నాకిచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తూ.. నాకు ఇలాంటి అందమైన జీవితం ఇచ్చినందుకు.. ఆయనకు ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను. జీవితంలో ఒక్క దెబ్బ తగిలితేనే దాని నుంచి కోలుకొని తిరిగి జీవితాన్ని ఆనందంగా జీవించడం.. ఆస్వాదించడం తెలుస్తుంది అని చెప్పింది పరిణీతి.

Instagram

ఆ రెండేళ్లు నరకం అనుభవించా.. అయినా చావును ఎదురించా : సుస్మిత సేన్

2014లో “కిల్ దిల్” సినిమా ఫ్లాప్ అయిన తర్వాత.. పరిణీతి తన కెరీర్‌కి కాస్త గ్యాప్ ఇచ్చింది. తాను చాలా లావెక్కానని.. తన ఫొటోలు చూసి తనే ఇబ్బందిపడేదాన్నని చెప్పిందామె. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. అలా నాపై నాకు నమ్మకం తిరిగొచ్చేలా చూసుకున్నా అంటూ అప్పటి రోజుల గురించి చెప్పింది పరిణీతి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఆమె నటించిన జబ్రియా జోడీ సినిమా ఆగస్టు 9న విడుదలవనుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Celebrity Life